సర్ఫరాజ్ ఖాన్ (PC: BCCI X)
Ex India Star's Blunt Take After Sarfaraz Khan's Test Selection: భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ దీప్‌దాస్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేసిన విధానం సబబుకాదేమోనని అభిప్రాయపడ్డాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడి బ్యాటింగ్ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. కేవలం వాటి ప్రాతిపదికన సర్ఫరాజ్ గొప్ప ఆటగాడని చెప్పలేమన్నాడు. చిన్న జట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదన్న దీప్‌దాస్ గుప్తా.. అలాంటి జట్లపై సాధించిన పరుగులను ఎంత వరకు లెక్కలోకి తీసుకవచ్చో ఆలోచించాలన్నాడు.
తానేమీ సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్న ఈ బెంగాలీ క్రికెటర్.. ఓ బ్యాటర్ ఎన్ని పరుగులు తీశాడన్న దానికన్నా.. పటిష్ట ప్రత్యర్థిపై ఎలా ఆడాడన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేసినంత మాత్రాన అతడి ఆడిస్తారనే నమ్మకం లేదని దీప్‌దాస్ గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
తుదిజట్టులో పదకొండు మంది ఆటగాళ్లకే చోటు ఉంటుందని.. అలాంటపుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే మేనేజ్‌మెంట్ ఆచితూచి వ్యవహరిస్తుందన్నాడు. ఉదాహరణకు.. శుబ్‌మన్ గిల్ లేదంటే సర్ఫరాజ్.. ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కచ్చితంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. గిల్‌వైపే మొగ్గు చూపుతాడని దీప్‌దాస్ అభిప్రాయపడ్డాడు.
ఆ జట్లను తక్కువ చేయాలని కాదు.. కానీ
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గురించి మాట్లాడతారు. అక్కడ 37 జట్లు ఉంటాయి. అందులో కొంతమంది యావరేజ్ జట్ల మీద పరుగుల వరద పారిస్తారు.
అలా అని నేను చిన్నజట్లను అగౌరవపరచడం లేదు. అయితే, ఓ బ్యాటర్ ఎంపిక గురించి మాట్లాడేటపుడు క్వాలిటీ ఆఫ్ రన్స్ గురించి కూడా మాట్లాడాలి. నేను ఇదంతా సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా చెప్పడం లేదు.
కానీ సెలక్షన్ సమయంలో మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్లకు ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉంటే వాళ్లకే అవకాశం ఇస్తుంది’’ అని దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తరఫున దీప్‌దాస్ 8 టెస్టులాడి కేవలం 100 పరుగులు చేశాడు.
ఆ ముగ్గురికి ఛాన్స్
ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరం కాగా.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత్, సహా పాకిస్తాన్ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. దీప్‌దాస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 2న మొదలుకానున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ కూడా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment