ఇటీవలే దేశవాలీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైదొలిగాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కిడ్నీలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుఉతున్న సర్ఫారాజ్ ప్రస్తుతం రాంచీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
''కొన్నిరోజులు కిందట కిడ్నీలో తీవ్రమైన నొప్పి రావడంతో స్కానింగ్ చేయగా స్టోన్స్ ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు'' అంటూ సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ వెల్లడించాడు.
ఇక 25 ఏళ్ల సర్ఫారాజ్ ఖాన్ ఇటీవలే ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికి నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్-ఏ టూర్‌కు మాత్రం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు.
ఇక విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్ శివమ్ దూబే గాయంతో దూరమవడం.. తాజగా సర్ఫరాజ్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో జట్టు బలహీనంగా మారిపోయింది.
చదవండి: Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment