Ranchi Hospital
-
ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
ఇటీవలే దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైదొలిగాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కిడ్నీలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుఉతున్న సర్ఫారాజ్ ప్రస్తుతం రాంచీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ''కొన్నిరోజులు కిందట కిడ్నీలో తీవ్రమైన నొప్పి రావడంతో స్కానింగ్ చేయగా స్టోన్స్ ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు'' అంటూ సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ వెల్లడించాడు. ఇక 25 ఏళ్ల సర్ఫారాజ్ ఖాన్ ఇటీవలే ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికి నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్-ఏ టూర్‌కు మాత్రం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు. ఇక విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్ శివమ్ దూబే గాయంతో దూరమవడం.. తాజగా సర్ఫరాజ్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో జట్టు బలహీనంగా మారిపోయింది. చదవండి: Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు.. -
దోమలు చంపుతున్నాయ్, వార్డు మార్చండి
రాంచీ/పట్నా: అపరిశుభ్రత, దోమల బెడద, కుక్కల అరుపులతో ఇబ్బందిగా ఉన్నందున వేరే వార్డుకి మార్చాలంటూ ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ రిమ్స్ అధికారులను కోరారు. వివిధ అవినీతి కేసుల్లో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆర్జేడీ నేత భోలా యాదవ్ అన్నారు. దోమలు కుట్టడంతోపాటు ఆ పక్కనే మార్చురీ ఉండటంతో వీధికుక్కల సంచారం, అరుపులతో తమ నేత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను రిమ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పక్కనే కొత్తగా నిర్మించిన వార్డులోకి మారిస్తే అవసరమైన అద్దె చెల్లిస్తామని చెప్పామన్నారు. గతంలో లాలూ ఎయిమ్స్‌లో చికిత్స పొందినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉండే వార్డులోకి మార్చామని తెలిపారు. ఆస్పత్రిలో లాలూకు కలిగిన అసౌకర్యంపై అధికార జేడీయూ ఎద్దేవా చేసింది. ‘ప్రస్తుతం మీరు దోమలు, కుక్కలను చూసి భయపడుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి బిహార్ ప్రజలు భయపడ్డారు’ అని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఇది మనుషులు చేసే పనేనా?
రాంచి: పేదోడికి వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, బాధ్యతారాహిత్యం కారణంగా సర్కారు దవఖానాలు గరీబోళ్లకు సరైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నాయి. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఘోరాలను కళ్లకుకట్టే ఘటన జార్ఖండ్ రాజధాని రాంచిలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అతిపెద్ద సర్కారు ఆస్పత్రి రాంచి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్సెస్(రిమ్స్)లో ఓ రోగికి నేలపై అన్నం వడ్డించిన వైనం మానవతావాదులను కలచివేసింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఉదంతంకు సంబంధించిన ఫొటోను ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ప్రచురించింది. చేతికి కట్టుతో ఉన్న పాల్మతి దేవి అనే మహిళారోగికి బుధవారం నేలపై వడ్డించిన భోజనం తింటున్నట్టు ఈ ఫోటోలో ఉంది. ప్లేట్లు లేవన్న సాకుతో ఆమెకు ఆస్పత్రి వార్డు బోయ్స్ నేలపైనే అన్నం, పప్పు, కూరలు వడ్డించారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న పాల్మతి దేవి దగ్గర పళ్లెం లేకపోవడంతో ప్లేట్ ఇవ్వమని ఆమె అడగ్గా సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. ప్లేట్లు లేవని నేలపైనే ఆమెకు భోజనం వడ్డించి అమానవీయంగా ప్రవర్తించారు. మీడియా ద్వారా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ. 300 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ఆస్పత్రిలో రోగులు భోజనం తినడానికి ప్లేట్లు లేకపోవడం శోచనీయమని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. రోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.