సహచర ఆటగాళ్ల తప్పిదాల కారణంగా రనౌట్లు కావడం ఇటీవలికాలంలో చాలా ఎక్కువైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సహచరుడు రవీంద్ర జడేజా తప్పిదానికి బలైపోగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్.. సహచరుడు కుల్దీప్ యాదవ్ రాంగ్ కాల్ కారణంగా రనౌటయ్యాడు.
A heart-breaking run-out for Shubman Gill....!!!!pic.twitter.com/GoFZ3OEeOl
— Johns. (@CricCrazyJohns) February 18, 2024
ఈ రెండు ఘటనల్లో స్ట్రయికింగ్‌లో ఉన్న ఆటగాళ్లే (జడేజా, కుల్దీప్) తొలుత పరుగుకు పిలుపున్చి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఈ రెండు సందర్భాల్లో రాంగ్ కాల్‌కు బలైపోయిన ఆటగాళ్లు మాంచి ఊపులో ఉన్నప్పుడు రనౌటయ్యారు.
సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యే సమయానికి మెరుపు అర్ధసెంచరీ (66 బంతుల్లో 62 పరుగులు; 9 ఫోర్లు, సిక్స్) చేసి జోరు మీదుండగా.. ఇవాళ జరిగిన దురదృష్ట ఘటనలో గిల్ సెంచరీకి తొమ్మిది పరుగులు దూరంలో (151 బంతుల్లో 91; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నప్పుడు ఔటయ్యాడు. సర్ఫరాజ్, గిల్ రనౌట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
కాగా, రాజ్‌కోట్ టెస్ట్ నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 440 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇవాల్టి ఆటలో శుభ్‌మన్ గిల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు.
స్కోర్ వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153)
Comments
Please login to add a commentAdd a comment