బ్యాటింగ్‌లో గిల్‌.. బౌలింగ్‌లో జడ్డూ.. సెకెండ్‌ ప్లేస్‌లోనూ మనోళ్లే..! | Most Runs And Wickets Across All Formats In 2023 | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌లో గిల్‌.. బౌలింగ్‌లో జడ్డూ.. సెకెండ్‌ ప్లేస్‌లోనూ మనోళ్లే..!

Published Fri, Dec 29 2023 8:07 PM | Last Updated on Fri, Dec 29 2023 8:12 PM

Most Runs And Wickets Across All Formats In 2023 - Sakshi

మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరానికి ఎండ్‌ కార్డ్‌ పడనుంది. కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ మినహాయించి ఈ ఏడాది మ్యాచ్‌లన్నీ అయిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌-యూఏఈల మధ్య రెండు టీ20లు (29, 31 తేదీల్లో), న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య మూడో టీ20 (31) మ్యాచ్‌లు మాత్రమే ఈ ఏడాదికి మిగిలి ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలుపుకుని) అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల రికార్డులు ఎవరి పేరిట ఉన్నాయని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. 

వివరాల్లోకి వెళితే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌  విభాగాల్లో టాప్‌-2లో భారత ఆటగాళ్లే ఉండటం విశేషం. బ్యాటింగ్‌లో టీమిండియా నయా రన్‌ మెషీన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువగా.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. 

గిల్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 48 మ్యాచ్‌లు ఆడి 46.82 సగటున 7 సెంచరీలు, 10 అర్థసెంచరీల సాయంతో 2154 పరుగులు చేయగా.. విరాట్‌.. కేవలం 35 మ్యాచ్‌ల్లోనూ 66.06 సగటున 8 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 2048 పరుగులు చేశాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ డారిల్‌ మిచెల్‌ (50 మ్యాచ్‌ల్లో 1988) మూడో స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ (35 మ్యాచ్‌ల్లో 1800), ట్రవిస్‌ హెడ్‌ (31 మ్యాచ్‌ల్లో 1698) టాప్‌-5లో ఉన్నారు. 

బౌలర్ల విషయానికొస్తే.. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్న రవీంద్ర జడేజా 35 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత రెండో స్థానంలోనూ టీమిండియా బౌలరే ఉన్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ ఈ ఏడాది 39 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ మిచెల్‌ స్టార్క్‌ (23 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు), పాక్‌ షాహీన్‌ అఫ్రిది (30 మ్యాచ్‌ల్లో 62), టీమిండియా మొహమ్మద్‌ సిరాజ్‌ (34 మ్యాచ్‌ల్లో 60) ఈ ఏడాది టాప్‌-5 వికెట్‌ టేకర్లలో ఉన్నారు. వరల్డ్‌కప్‌ హీరో మొహమ్మద్‌ షమీ (23 మ్యాచ్‌ల్లో 56) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement