రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా ఇవాళ (జనవరి 17) మొదలైన మ్యాచ్‌ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది తొలి రోజు ఆటలో సెంచరీలు బాదారు. సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
- మేఘాలయతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో బిహార్ ఆటగాడు బిపిన్ సౌరభ్ (177)
- కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు సచిన్ బేబి (116 నాటౌట్)
- ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒడిశా ఓపెనర్ శాంతాను మిశ్రా (107 నాటౌట్)
- హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు నౌషద్ షేక్ (145 నాటౌట్)
- ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ (125)
- అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీశన్ (125)
- చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు సమర్పిత్ జోషి (123)
- మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అన్మోల్‌ప్రీత్ సింగ్ (124), నేహల్ వధేరా (123 నాటౌట్)
- చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాళ్లు వివేక్ సింగ్ (108), ఉపేంద్ర యాదవ్ (113)
- నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు అంకిత్ కల్సీ (116 నాటౌట్)
- హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అనుస్తుప్ మజుందార్ (137 నాటౌట్)
Comments
Please login to add a commentAdd a comment