sachin baby
-
Ranji Trophy: కేరళ కెప్టెన్ సంజూ కాదు!.. కారణం ఇదే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ రంజీ బరిలో దిగనున్నాడు. సొంత రాష్ట్రం కేరళ తరఫున రెడ్‌బాల్ టోర్నీలో పాల్గొననున్నాడు. అయితే, ఈసారి కెప్టెన్‌గా గాకుండా కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఇందుకు కారణం ఏమిటంటే..?టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఉందని సంజూ శాంసన్ ఇటీవల తన మనసులోని మాట వెల్లడించిన విషయం తెలిసిందే. మేనేజ్మెంట్ సైతం ఇందుకు సుముఖంగా ఉందని పరోక్షంగా తెలిపాడు. యాజమాన్యం సూచనల మేరకే తాను దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగానన్నాడు సంజూ.ఇక ఆ టోర్నీలో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సంజూ శాంసన్.. తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాతో చేరాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్ మూడో మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి టీమిండియా 3-0తో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.కారణం ఇదేఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తాను త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఇందుకు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో అతడు రాణించాల్సి ఉంది. అయితే, గత ఎడిషన్‌లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ ఈసారి.. సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. టీమిండియా నవంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటమే ఇందుకు కారణం.రంజీ తాజా ఎడిషన్‌లో సచిన్ బేబీ సారథ్యంలో కేరళ తొలుత పంజాబ్‌తో మ్యాచ్ ఆడి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తదుపరి శుక్రవారం నుంచి కర్ణాటకతో తలపడేందుకు సిద్ధం కాగా.. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్ కారణంగా సంజూ కొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ముఖ్యంగా ఉత్తరప్రదేశ్(నవంబరు 6-9), హర్యానా(నవంబరు 13- 16)తో కేరళ ఆడే మ్యాచ్‌లకు సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో (నవంబరు 8 నుంచి) టీమిండియా టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అందుకే సంజూ కేరళ జట్టు కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND Vs NZ 1st Test: పాపం రోహిత్ శర్మ!.. ఆనందం ఆవిరి.. అన్‌లక్కీ భయ్యా! -
శతకాల మోత.. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 17) మొదలైన మ్యాచ్‌ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది తొలి రోజు ఆటలో సెంచరీలు బాదారు. సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మేఘాలయతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో బిహార్ ఆటగాడు బిపిన్ సౌరభ్ (177) కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు సచిన్ బేబి (116 నాటౌట్) ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒడిశా ఓపెనర్ శాంతాను మిశ్రా (107 నాటౌట్) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు నౌషద్ షేక్ (145 నాటౌట్) ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ (125) అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీశన్ (125) చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు సమర్పిత్ జోషి (123) మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అన్మోల్ప్రీత్ సింగ్ (124), నేహల్ వధేరా (123 నాటౌట్) చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాళ్లు వివేక్ సింగ్ (108), ఉపేంద్ర యాదవ్ (113) నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు అంకిత్ కల్సీ (116 నాటౌట్) హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అనుస్తుప్ మజుందార్ (137 నాటౌట్) -
"సంజు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.. అది అంత ఈజీ కాదు"
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై కేరళ వెటరన్ ఆటగాడు సచిన్ బేబీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో శాంసన్.. రాజస్థాన్ రాయల్స్‌ను విజయాల బాటలో నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. "ఐపీఎల్-2022లో సంజు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు బ్యాట్‌తో కూడా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించడం అంత తేలికైన పని కాదు. ఎందకుంటే జట్టు విజయం సాధించనప్పడు ప్రశంసలు కురిపించే వాళ్లు చాలా మంది ఉంటారు. అదే ఓటమి చెందితే ప్రశంసించిన వాళ్లే విమర్శలు గుప్పిస్తారు. కెప్టెన్సీ చాలా ఒత్తిడితో కూడుకున్నది. అది ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అతడు ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఉండడం కేరళ జట్టుకు మరింత కలిసిస్తోంది" అని సచిన్ బేబీ పేర్కొన్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో కేరళ జట్టుకు శాంసన్, సచిన్ బేబీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదవండి: IPL 2022: "అతడు అద్భుతమైన బౌలర్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు" -
కేరళ కెప్టెన్‌గా సచిన్ బేబి... జట్టులోకి శ్రీశాంత్!
Ranji Trophy KCA Sachin Baby To Lead: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌కుగానూ కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రాబబుల్స్ జట్టును ప్రకటించింది. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ టోర్నీ నేపథ్యంలో సచిన్ బేబికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. వికెట్‌కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా సీనియర్ పేసర్ శ్రీశాంత్‌కు జట్టులో చోటు దక్కడం విశేషం. ఇక ఎలైట్ గ్రూపు బీలో ఉన్న కేరళ జట్టు... విదర్భ(జనవరి 13-16)తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బెంగాల్, రాజస్తాన్, త్రిపుర, హర్యానాతో తలపడనుంది. రంజీ ట్రోఫీ 2021-22 కేరళ ప్రాబబుల్ జట్టు: సచిన్ బేబి(కెప్టెన్), విష్ణు వినోద్(వైస్ కెప్టెన్), ఆనంద్ క్రిష్ణన్, రోహన్ కునుమెల్ వత్సల్ గోవింద్, రాహుల్ పి, సల్మాన్ నిజర్, సంజూ శాంసన్, జలజ్ సక్సేనా, సిజో మోన్ జోసెఫ్ అక్షయ్ కేసీ, మిథున్, బాసిల్ ఎన్ పీ, నిదీశ్ ఎండీ, మను క్రిష్ణన్, బాసిల్ థంపి ఫనూస్, శ్రీశాంత్ ఎస్, అక్షయ్ చంద్రన్, వరుణ్ నాయనర్, ఆనంద్ జోసెఫ్ వినూప్ మనోహరన్, అరుణ్ ఎం, వైశక్ చంద్రన్. చదవండి: Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా! -
శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన శ్రీశాంత్ తన రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌పై నిషేధం ముగియనుండటంతో క్రికెట్ పునరాగమనం కోసం యత్నాలు ఆరంభించాడు. దేశవాళీ సీజన్లో భాగంగా తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో ఉన్నాడు. దీనిపై కేరళ బ్యాట్స్‌మన్ సచిన్ బేబీ మాట్లాడుతూ. శ్రీశాంత్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా శ్రీశాంత్ కేరళ జట్టుకు దూరమైన విషయాన్ని కాస్త బాధగా చెప్పిన సచిన్ బేబీ.. అతను ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడనే విషయాన్ని వెల్లడించాడు. గతంలో ప్రాక్టీస్ సెషన్లో కూడా శ్రీశాంత్ బౌలింగ్ చేసేవాడన్నాడు. (శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...) శ్రీశాంత్ పేస్‌లో స్వింగ్ ఎక్కువగా ఉండటంతో తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు. టెలివిజన్ కామేంటేటర్, ప్రజెంటర్ అరుణ్ వేణుగోపాల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్లో అనేక విషయాలను సచిన్ బేబీ షేర్ చేసుకున్నాడు. ‘ నాకు శ్రీశాంత్ సోదరుడు లాంటివాడు. కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమిద్దరం గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. శ్రీశాంత్‌తో ప్రాక్టీస్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్‌లో బౌలింగ్ అమోఘంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇక శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించాల్సి ఉంది’ అని కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీ తెలిపాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. (‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’) -
మైదానంలో క్లీన్బోల్డ్.. పెళ్లికి క్రికెటర్ రెడీ!
-
మైదానంలో క్లీన్బోల్డ్.. పెళ్లికి క్రికెటర్ రెడీ!
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ జంట నూతన సంవత్సరం సందర్భంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నదన్న కథనాలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పట్లో తమ ఎంగేజ్మెంట్ ఉండబోదంటూ విరాట్ సంకేతాలు ఇవ్వగా.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో అతని సహచరుడైన మరో క్రికెటర్ మాత్రం పెళ్లికి రెడీ అయ్యాడు. కేరళ క్రికెటర్ సచిన్ బేబీ తన ప్రియురాలు అన్నాచాందీని వివాహమాడబోతున్నాడు. ఏడాదికాలంగా డేటింగ్ చేస్తున్న అన్నా చాందీని పెళ్లి చేసుకోబోతున్నట్టు గ్రాండ్‌గా ప్రకటించాడు. ఈ జంట వివాహ ఆహ్వాన వీడియోను కోకోనట్స్ వెడ్డింగ్స్ ఆన్లైన్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కేరళ క్రికెట్ అసోసియేషన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సచిన్ టెండూల్కర్ అభిమానులకు మొదట కృతజ్ఞతలు చెప్పిన సచిన్ బేబి.. అనంతరం మైదానంలో అన్నా చాందీ వేసిన బంతికి బౌల్డ్ అవుతాడు. అనంతరం ఇద్దరు ఒకరిప్రేమను ఒకరు చాటుకుంటారు. ఈ నెల 5న తోడుపుఝాలోని చర్చిలో ఈ జంట వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది. 2009లో కేరళ తరఫున క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ బేబి ఇప్పటివరకు 47 మ్యాచుల్లో 2092 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ జట్టులో చేరిన అతను ఇప్పటివరకు 11 టీ-20లలో 119 పరుగులు చేశాడు. -
చివరి ఓవర్లో ఏడ్చేశాడు!
బెంగళూరు:తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించాలన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కల చెదిరిపోయింది. ఓవరాల్ ఐపీఎల్లో మూడు సార్లు ఫైనల్ కు చేరినా, ఒక్కసారి కూడా టైటిల్ ను అందుకోలేకపోయారు.అయితే బెంగళూరు చేతిల్లోంచి ట్రోఫీ చేజారిన క్షణాన కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించినా, మిగతా ఆటగాళ్ల అంతా బాధాతప్త హృదయంతో నిరాశలో కూరుకుపోయారు. ఇదిలాఉండగా, బెంగళూరు ఆటగాడు సచిన్ బేబీ మాత్రం తన కళ్లలో నీళ్లను ఆపులేకపోయాడు. జట్టు ఓటమి ఖరారైన తరుణంలో సచిన్ బేబీ ఏడ్చేశాడు. రాయల్ చాలెంజర్స్ ఆఖరి బంతికి 13 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ సమయంలో నాన్ స్టైకర్స్ ఎండ్‌లో ఉన్న సచిన్ బేబీ తన కళ్లల్లో చెమర్చిన నీటిని అదిమిపెట్టలేకపోయాడు. ఆఖరి ఓవర్లో రెండు బంతులుండగా బెంగళూరు 14 పరుగులు చేయాలి. అప్పుడు స్ట్రైకింగ్ లో ఉన్న సచిన్ బేబీ ఒక పరుగు మాత్రమే సాధించి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు వెళ్లే క్రమంలో అతని కళ్లల్లో కన్నీళ్లే కనిపించాయి. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలసిందే.