చివరి ఓవర్లో ఏడ్చేశాడు! | Sachin Baby starts crying at non-striker's end with RCB needing 13 off last ball | Sakshi
Sakshi News home page

చివరి ఓవర్లో ఏడ్చేశాడు!

Published Mon, May 30 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

చివరి ఓవర్లో ఏడ్చేశాడు!

చివరి ఓవర్లో ఏడ్చేశాడు!

బెంగళూరు:తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించాలన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కల చెదిరిపోయింది. ఓవరాల్ ఐపీఎల్లో మూడు సార్లు ఫైనల్ కు చేరినా, ఒక్కసారి కూడా టైటిల్ ను అందుకోలేకపోయారు.అయితే బెంగళూరు చేతిల్లోంచి ట్రోఫీ చేజారిన క్షణాన  కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించినా, మిగతా ఆటగాళ్ల అంతా బాధాతప్త హృదయంతో నిరాశలో కూరుకుపోయారు.

ఇదిలాఉండగా, బెంగళూరు ఆటగాడు సచిన్ బేబీ మాత్రం తన కళ్లలో నీళ్లను ఆపులేకపోయాడు. జట్టు ఓటమి ఖరారైన తరుణంలో సచిన్ బేబీ ఏడ్చేశాడు. రాయల్ చాలెంజర్స్ ఆఖరి బంతికి 13 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ సమయంలో నాన్ స్టైకర్స్ ఎండ్లో ఉన్న సచిన్ బేబీ తన కళ్లల్లో చెమర్చిన నీటిని అదిమిపెట్టలేకపోయాడు. ఆఖరి ఓవర్లో రెండు బంతులుండగా బెంగళూరు 14 పరుగులు చేయాలి. అప్పుడు స్ట్రైకింగ్ లో ఉన్న సచిన్ బేబీ ఒక పరుగు మాత్రమే సాధించి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు వెళ్లే క్రమంలో అతని కళ్లల్లో కన్నీళ్లే కనిపించాయి. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement