
Ranji Trophy KCA Sachin Baby To Lead: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌కుగానూ కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రాబబుల్స్ జట్టును ప్రకటించింది. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ టోర్నీ నేపథ్యంలో సచిన్ బేబికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. వికెట్‌కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది.
కాగా సీనియర్ పేసర్ శ్రీశాంత్‌కు జట్టులో చోటు దక్కడం విశేషం. ఇక ఎలైట్ గ్రూపు బీలో ఉన్న కేరళ జట్టు... విదర్భ(జనవరి 13-16)తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బెంగాల్, రాజస్తాన్, త్రిపుర, హర్యానాతో తలపడనుంది.
రంజీ ట్రోఫీ 2021-22 కేరళ ప్రాబబుల్ జట్టు:
సచిన్ బేబి(కెప్టెన్), విష్ణు వినోద్(వైస్ కెప్టెన్), ఆనంద్ క్రిష్ణన్, రోహన్ కునుమెల్ వత్సల్ గోవింద్, రాహుల్ పి, సల్మాన్ నిజర్, సంజూ శాంసన్, జలజ్ సక్సేనా, సిజో మోన్ జోసెఫ్ అక్షయ్ కేసీ, మిథున్, బాసిల్ ఎన్ పీ, నిదీశ్ ఎండీ, మను క్రిష్ణన్, బాసిల్ థంపి ఫనూస్, శ్రీశాంత్ ఎస్, అక్షయ్ చంద్రన్, వరుణ్ నాయనర్, ఆనంద్ జోసెఫ్ వినూప్ మనోహరన్, అరుణ్ ఎం, వైశక్ చంద్రన్.
చదవండి: Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా!
Comments
Please login to add a commentAdd a comment