ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోపీ ఫైనల్లో సెంచరీతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా ఇరానీ కప్‌లోనూ శతకం సాధించి తన జోరు చూపిస్తున్నాడు. కేవలం 92 బంత్లులోనే శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం 125 పరుగులతో ఆడుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ఇక ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సర్ఫారాజ్ ఖాన్ 125 పరుగులు, కెప్టెన్ హనుమ విహారి 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు రెస్టాఫ్ ఇండియా బౌలర్ల దాటికి సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ 4 వికెట్లు,కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో మూడు వికెట్లు తీశారు.
💯 for Sarfaraz Khan! 🙌 🙌
— BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022
What a stunning knock this has been by the right-hander! 👏 👏
Follow the match ▶️ https://t.co/u3koKzDR7B#IraniCup | #SAUvROI | @mastercardindia pic.twitter.com/O2XeAZ91RV
Comments
Please login to add a commentAdd a comment