Sarfaraz Khan Faces Wrath Of DC Fans After Yet Another Failed Outing In IPL 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

IPL 2023: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్‌ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా?

Published Sun, Apr 30 2023 1:19 PM | Last Updated on Sun, Apr 30 2023 4:22 PM

 Sarfaraz Khan faces wrath of DC fans after yet another failed outing in IPL  - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌-2023 ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్ ఖాన్ తన పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సర్ఫరాజ్‌ విఫలమవుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్‌.. టెస్టు మ్యాచ్‌ కంటే దారుణంగా ఆడాడు.

కీలక సమయం‍లో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. కేవలం 10 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌ ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సర్ఫరాజ్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

టెస్టులు ఆడేవాడిని ఐపీఎల్‌లో ఆడిస్తే ఇలానే ఉంటుంది అని పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంతమంది ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా జట్టులో ఇంకా ఎవరూ లేరా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: IPL 2023: అదే మా కొంపముం‍చింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement