Photo: IPL Twitter
సర్ఫరాజ్ ఖాన్.. ఇటీవలీ కాలంలో బాగా మారుమోగిన పేరు. దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీ సహా ఇతర క్రికెట్ లీగ్స్‌లో వరుస శతకాలతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఇలాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాలోకి ఎందుకు తీసుకోరని అభిమానులు ప్రశ్నించారు. చెత్త రాజకీయాలతో టాలెంటెడ్ ఆటగాడిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.
Photo: IPL Twitter
అయితే ఐపీఎల్‌కు వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ టాలెంట్‌ను పొగిడిన నోళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నాయి. అందుకు అతను బాగా ఆడలేకపోతున్నాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విమర్శించేది అతని చేస్తున్న స్లో బ్యాటింగ్‌పై. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవ్వడంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఇక బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 34 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ స్లో బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ రన్‌రేట్ మధ్యలో దారుణంగా పడిపోయింది.
దీంతో క్రికెట్ ఫ్యాన్స్ సర్ఫరాజ్ ఖాన్‌ను ట్రోల్ చేశారు. ''ఇలా అయితే ఐపీఎల్‌కు పనికిరావు.. రంజీలనుకుంటున్నావా కాస్త వేగం పెంచు.. సర్పరాజ్ కేవలం రెడ్‌బాల్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడు.'' అంటూ కామెంట్ చేశారు.
He played this in a T20 match 🙂#DCvGT #IPL pic.twitter.com/5KUSnDwdqz
— Om 🇮🇳 (@chadxomm) April 4, 2023
Comments
Please login to add a commentAdd a comment