లక్నో: సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్ మ్యాచ్‌లో ముంబై సారథి రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (88 బంతుల్లో 54 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.
ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ పృథ్వీ షా (4), ఆయుష్ మాత్రే (19), హార్దిక్ తమోర్ (0) విఫలమయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా, యశ్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment