రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదంతొక్కాడు. సర్ఫరాజ్ 150 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ సెంచరీతో సత్తా చాటడంతో రెండో రోజు లంచ్ సమయానికి (94 ఓవర్లలో) ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌తో పాటు తనుశ్ కోటియన్ (26) క్రీజ్‌లో ఉన్నాడు.
SARFARAZ KHAN - THE STAR. ⭐
- Yet Another day and yet another Hundred by Sarfaraz Khan in first Class, He has 15 Hundreds & 14 Fifties in First Class. 🤯pic.twitter.com/xIVR7ZV3TX— Tanuj Singh (@ImTanujSingh) October 2, 2024
ముంబై ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. పృథ్వీ షా 4, ఆయుశ్ మాత్రే 19, హార్దిక్ తామోర్ 0, షమ్స్ ములానీ 5 పరుగులకు ఔటయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్ స్కోర్ 237/4 వద్ద ముంబై రెండో రోజు ఆట మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ
రెస్ట్ ఆఫ్ ఇండియాపై చేసిన సెంచరీ సర్ఫరాజ్ ఖాన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15వది. ఈ సెంచరీతో సర్ఫరాజ్ యావరేజ్ 67 దాటింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యుత్తమ యావరేజ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతనికి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇరానీ కప్‌లోనూ అతనికి ఇది రెండో సెంచరీ.
చదవండి: ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్
Comments
Please login to add a commentAdd a comment