సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan- Team India: గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో తరచుగా వినిపిస్తున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నా జాతీయ జట్టుకు మాత్రం సెలక్ట్‌కావడం లేదు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతున్నా.. బీసీసీఐ సెలక్టర్లు అతడి ఎంట్రీకి తలుపులు తెరవడం లేదు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తారని భావించినా అలా జరుగలేదు. రంజీ ట్రోఫీ 2022-23లో సత్తా చాటినా భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో తాను తీవ్ర నిరాశకు లోనయ్యానన్న సర్ఫరాజ్.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు తనను సిద్ధంగా ఉండమని చెప్పారంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
తాను కూడా మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల సర్ఫరాజ్‌కు మద్దతుగా అభిమానులు, పలువురు మాజీలు.. సెలక్టర్ల తీరుపై విమర్శలు సంధించారు. ఈ క్రమంలో ఈ విషయంపై బీసీసీఐ సెలక్టర్ శ్రీధరన్ శరత్ తాజాగా స్పందించారు.
బ్యాటింగ్ విభాగం పటిష్టం
‘‘కోహ్లి ఇంకా మ్యాచ్ విన్నరే. ఛతేశ్వర్ పుజారా ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. శ్రేయస్ అయ్యర్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎల్ రాహుల్ తనదైన రోజు ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారత బ్యాటింగ్ విభాగం బాగుంది.
తనకూ ఓ రోజు ఛాన్స్
ఇక సర్ఫరాజ్ కూడా మా ప్రణాళికల్లో ఉన్నాడు. తనదైన రోజు తప్పకుండా అతడికి అవకాశం వస్తుంది. అయితే, జట్టును ఎంపిక చేసేటపుడు అన్ని విభాగాలను పరిశీలించి సమతుల్యంగా ఉండేట్లు చూసుకుంటాం’’ అంటూ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పేర్కొన్నాడు.
ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతున్న క్రమంలో సర్ఫరాజ్ గురించి శ్రీధరన్ శరత్‌కు ప్రశ్న ఎదురు కాగా ఇలా బదులిచ్చాడు. కాగా ఇటీవల చేతన్ శర్మ నాయకత్వంలో ఏర్పాటైన నేషనల్ ప్యానెల్‌లో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలాతో పాటు శ్రీధరన్ శరత్ కూడా ఉన్నారు.
చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు
Hyd Vs DEL: దంచికొట్టిన ఆయుశ్.. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ ఓటమి
Comments
Please login to add a commentAdd a comment