హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. కాగా రోహిత్‌కు ఇది కెప్టెన్‌గా 33వ టీ20 విజయం.
అంతుకుముందు ఈ ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి సారథ్యంలో టీమిండియా 32 టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని 42 విజయాలతో మొదటి స్థానంలో ఉన్నాడు.
అదే విధంగా మరో రికార్డును కూడా రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఏడాది అత్యధిక టి20 మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా ధోని (2016లో) పేరిట ఉన్న రికార్డును 15వ గెలుపుతో రోహిత్ శర్మ సమం చేశాడు.
చదవండి: Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్‌కప్ ఫైనల్ అయితే!
Comments
Please login to add a commentAdd a comment