ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలో తడబడినప్పటికీ.. ఆతర్వాత విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆసీస్‌పై గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఫీల్డింగ్‌లో భారత ఆటగాళ్ల కాంట్రిబ్యూషన్ అమోఘం. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సీమర్లు సైతం రివర్స్ స్వింగ్‌కు రాబట్టగలిగారు. స్పిన్నర్లు చక్కని ప్రాంతాల్లో బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. మొత్తంగా టీమిండియా బౌలర్ల నుంచి అదిరిపోయే ప్రదర్శన.
2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం అనేది చాలా దారుణం. స్వల్ప లక్ష్య ఛేదనలో ఏ జట్టూ ఇలాంటి ఆరంభాన్ని కోరుకోదు. క్రెడిట్ ఆసీస్ బౌలర్లుకు దక్కుతుంది. మేము కూడా కొన్ని చెత్త షాట్లు ఆడాం. తక్కువ టార్గెట్ ఉంటే పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టాలని చూస్తాం. అంతిమంగా క్రెడిట్ విరాట్, కేఎల్ రాహులకే దక్కుతుంది. చెన్నై ఎప్పుడూ నిరాశపరచలేదు. వారు క్రికెట్‌ను అమితంగా ప్రేమిస్తారు. వారు వేడిని సైతం లెక్క చేయకుండా మైదానాలకు వచ్చి జట్టును ఉత్సాహపరుస్తారని రోహిత్ అన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్ యాదవ్ (10-0-42-2), అశ్విన్ (10-1-34-1), సిరాజ్ (6.3-1-26-1), హార్దిక్ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ కాగా.. కోహ్లి, రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, స్టార్క్ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్, ఇషాన్‌లతో పాటు శ్రేయస్ అయ్యర్ డకౌట్లయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment