సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు బంపరాఫర్ వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి కెప్టెన్ కావాలన్న అతడి కల నెరవేరింది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024లో సర్ఫరాజ్‌ను ముంబై జట్టు కెప్టెన్‌గా నియమించింది యాజమాన్యం.
కాగా దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో గత రంజీ సీజన్ ట్రోఫీని ముంబై గెలుచుకుంది. ఇక ఆ సమయంలో షామ్స్ ములానీ రహానే డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా వ్యహరించాడు. అయితే, రహానే ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీలతో బిజీగా ఉన్నాడు. లీసెస్టర్‌షైర్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
మరోవైపు.. షామ్స్ ములానీ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక పృథ్వీ షా సైతం ఇంగ్లండ్‌లో బిజీగా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం చేసి ప్రస్తుతం జట్టుతో పాటు కొనసాగుతున్నాడు.
కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్
ఇలా సీనియర్లంతా తమ తమ షెడ్యూల్‌తో బిజీగా ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ ధ్రువీకరించాడు. ‘‘అజింక్య రహానే అందుబాటులో ఉంటే అతడే కెప్టెన్‌గా ఉండేవాడు.
ఒకవేళ అతడు జట్టుతో లేకపోయినా మాకు కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతడే ఈ టోర్నీలో మా కెప్టెన్‌గా ఉంటాడు’’ అని సంజయ్ పాటిల్ ‘మిడ్ డే’తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
తుదిజట్టులో కూడా చోటు దక్కించుకుని హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మూడు టెస్టులాడి 200 పరుగులు సాధించాడు. అయితే, కేఎల్‌రాహుల్, రిషభ్ పంత్ వంటి సీనియర్ల రాకతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికవుతాడా?లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు ముంబై జట్టు
సర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా.
కాగా నాటి మద్రాస్ ప్రెసిడెన్సీకి మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. 1868లో జన్మించిన ఆయన.. స్వదేశీయులకు క్రికెట్ క్లబ్‌లో అవకాశాలు కల్పించారు. క్రికెట్ జట్లలో వివక్షకు తావులేకుండా గొంతెత్తారు. ఆయన పేరు మీదుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. రెడ్‌బాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment