
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ అవతారమెత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. తన సహజశైలికి విరుద్ధంగా.. వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ మాదిరి బౌల్ చేయబోయి ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌కు దొరికిపోయాడు.
కాగా దులిప్ ట్రోఫీ-2024కు ముందు భారత క్రికెటర్లు.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుచ్చిబాబు రెడ్‌బాల్ టోర్నీలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రేయస్ అయ్యర్ సొంత జట్టు ముంబైకి ఆడుతున్నాడు. ఈ క్రమంలో టీఎన్‌సీఏ ఎలెవన్ జట్టుతో మంగళవారం ముంబై మ్యాచ్ మొదలైంది.
సునిల్ నరైన్‌ను అనుసరించబోయి..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీఎన్‌సీఏ తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి(90 ఓవర్లు) ఐదు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అయితే, ఆట ముగియడానికి ఒక్క ఓవర్ మిగిలి ఉన్న ఉన్న తరుణంలో శ్రేయస్ అయ్యర్ బంతితో రంగంలోకి దిగాడు. తొంభైవ ఓవర్లో బాల్ చేతబట్టిన ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ సునిల్ నరైన్ శైలిని అనుసరించబోయాడు. అయితే, క్రీజులో ఉన్న తమిళనాడు బ్యాటర్ సోను యాదవ్ భారీ సిక్సర్‌తో అయ్యర్‌కు చేదు అనుభవం మిగిల్చాడు.
ఇండియా-డి జట్టుకు కెప్టెన్‌గా
మొత్తంగా అయ్యర్ ఓవర్లో టీఎన్‌సీఏ ఏడు పరుగులు రాబట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ టోర్నీ అనంతరం సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. ఇండియా-డి జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కాగా స్పెషలిస్టు బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఇక విండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. వీరిద్దరు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో సహచర ఆటగాళ్లు. ఈ ఏడాది అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన
Shreyas Iyer bowling with Sunil Narine action. 😂 pic.twitter.com/EpX4ZxnfZx
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2024