
బెంగళూరు: న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడిపోయి 37 ఏళ్లు గడిచాయి. 1987లో చివరిసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై పరాజయం ఎదురైంది. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో ఓటమి ముప్పు పొంచి ఉంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం... క్రీజులోకి రావాల్సిన భారత బ్యాటర్లకు భారీ స్కోర్లు చేసే సత్తా ఉండటంతో అద్భుతం జరుగుతుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది.
ఎందుకంటే 2001లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులోనూ భారత జట్టు ఇలాగే ప్రత్యరి్థకి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సమరి్పంచుకొని... ఆ తర్వాత తిరిగి పుంజుకుని విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అసాధారణ ఆటతీరుతో కంగారూల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కు 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంత భారీ లోటును పూడ్చాలంటే... రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతం జరగాల్సింది.
అలాంటి అరుదైన సందర్భానికి శుక్రవారం బ్యాటింగ్ చేసిన నలుగురు నాంది పలకగా... నాలుగో రోజు మిగిలిన వాళ్లు దాన్ని కొనసాగించాల్సి ఉంది. దేశవాళీల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశి్వన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అయితే కీపింగ్ చేస్తూ గాయపడ్డ పంత్ బ్యాటింగ్ చేయడంపై స్పష్టత లేదు. సొంతగడ్డపై పూర్తిస్థాయి బ్యాటర్ల కన్నా మంచి ఇన్నింగ్స్‌లు ఆడే ఆల్‌రౌండర్లు అశి్వన్, జడేజా రాణించాల్సిన అవసరం ఉంది. టీమిండియాకు కనీసం రెండొందల పరుగుల ఆధిక్యం దక్కితే తప్ప... బెంగళూరులో బౌలర్లు కూడా పెద్దగా చేయగలిగిందేమీ లేదు!
Comments
Please login to add a commentAdd a comment