Ranji Trophy 2022-23: Mumbai Sarfaraz Khan Hits 3rd Century Vs Delhi - Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022-23: దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. సీజన్‌లో మూడో సెంచరీ

Published Tue, Jan 17 2023 4:18 PM | Last Updated on Tue, Jan 17 2023 5:03 PM

Ranji Trophy 2022-23: Mumbai Sarfaraz Khan Hits 3rd Century-Vs DEL - Sakshi

ముంబై స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ రంజీ ట్రోఫీలో తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోయినప్పటికి తన పరుగుల ప్రవాహం మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నాడు. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌ తాజాగా ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు చూసుకుంటే గత 23 రంజీ ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్‌ఖాన్‌కు ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు సర్ఫరాజ్‌ ఆరు మ్యాచ్‌లాడి 556 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి.

ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఢిల్లీతో మ్యాచ్‌లో మంగళవారం సర్ఫరాజ్‌ సెంచరీ ఫీట్‌ సాధించాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఓపికగా నిలబడి బ్యాటింగ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ 135 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం అందుకున్నాడు. 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును సర్ఫరాజ్‌ ఆదుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నప్పటికి తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ 124, తనుష్‌ కొటెయిన్‌ క్రీజులో ఉన్నారు.

చదవండి: స్టీవ్‌ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు

ఉప్పల్‌లో మ్యాచ్‌ అంటే కోహ్లికి పూనకాలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement