రోహిత్ శర్మ
India Vs West Indies: ‘‘రోహిత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం తనకు కావాల్సినంత విశ్రాంతి లభించింది. కాబట్టి పనిభారం అన్న మాటకు తావే లేదు. వెస్టిండీస్ పర్యటనలో అతడే జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశారు.
కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నాడనే వార్తల నేపథ్యంలో ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఈ మేరకు సదరు అధికారి స్పష్టతనిచ్చారు. ఐపీఎల్-2023, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. అయితే.. గత కొంతకాలంగా తన ప్రదర్శన బాగానే ఉందని పేర్కొన్నారు.
‘‘ఆస్ట్రేలియా నాగ్‌పూర్ టెస్టులో రోహిత్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రోహిత్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. నిలకడలేమి ఫామ్ కారణంగా అతడి పట్ల దారుణమైన విమర్శలు చేయడం సరికాదు. రోహిత్ త్వరలోనే తిరిగి పుంజుకుంటాడు’’ అని సదరు అధికారి చెప్పుకొచ్చారు. కాగా జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా.. వెస్టిండీస్ పర్యటన మొదలుకానున్న విషయం తెలిసిందే.
ఆ ముగ్గురు దూరంగానే
రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లతో కూడిన ఈ టూర్‌కు సంబంధించి జూన్ 27న బీసీసీఐ జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కానున్నారు.
యువ సంచలనం ఎంట్రీ
గాయాల నుంచి కోలుకుంటున్న వీరు ముగ్గురు సెలక్షన్‌కు అందుబాటులో లేరని.. ఛతేశ్వర్ పుజారా మాత్రం జట్టుతో కొనసాగుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు రోహిత్ సారథ్యం వహించనుండగా.. హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక టెస్టు సిరీస్ నేపథ్యంలో సర్ఫరాజ్‌తో పాటు పేసర్ ముకేశ్ కుమార్‌కు సెలక్టర్లు పిలుపునివ్వనున్నట్లు సమాచారం. సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లపై భారం తగ్గించే క్రమంలో ముకేశ్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ధోని చాలా గ్రేట్.. తన సమస్య గురించి ఎవరికీ చెప్పలేదు! ఆఖరికి
లబుషేన్‌కు ఊహించని షాక్.. ప్రపంచ నంబర్ 1 అతడే! వారెవ్వా పంత్..
Comments
Please login to add a commentAdd a comment