Cricket Fans Stunned With MS Dhoni Flaunts His Bike And Cars Collection, Video Goes Viral - Sakshi
Sakshi News home page

MS Dhoni Cars, Bikes Collection Tour: 'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి'

Published Tue, Jul 18 2023 12:02 PM | Last Updated on Tue, Jul 18 2023 12:53 PM

Cricket Fans Stunned With MS Dhoni Flaunts His Bike Collection Viral - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని మంచి వాహన ప్రియుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచీలోని తన సొంత ఇంట్లో ధోని కార్లు, బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్లో కొత్త బైక్‌ లేదా కార్‌ వచ్చిన అది ధోని గ్యారేజీలోకి రావాల్సిందే. ధోని తన గ్యారేజీని ఎప్పుడు చూపించడానికి ఇష్టపడలేదు. అయితే మాజీ బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ చొరవతో ధోని గ్యారేజీని తొలిసారి చూసే అవకాశం మనకు దక్కింది.

ధోని గ్యారేజీకి సంబంధించిన వీడియోనూ చూస్తే కళ్లు బెర్లు కమ్మడం ఖాయం. పలు రకాల మోడల్స్‌కు సంబంధించిన కార్లు, బైక్‌లు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్యారేజీ మొత్తం బైకులు, కార్లతో నిండిపోయింది. అవసరం అనుకుంటే ధోని ఒక చిన్నపాటి షోరూం అయినా నడిపించొచ్చు.  ఏది ప్రత్యేకంగా కనిపించినా.. అది ధోని గ్యారేజ్‌లోకి రావాల్సిందే. బైక్‌లు, కార్లు అంటే ధోనీకి అంత పిచ్చి అన్నమాట. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో చూడొచ్చు.

విషయంలోకి వెళితే.. టీమిండియా మాజీలు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషిలు రాంచీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ధోనీ ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. అక్కడే ఉన్న ధోని తొలిసారి తన గ్యారేజీని వారికి చూపించాడు. గ్యారేజీలో ఒక్కో కారు, బైకు చూస్తుంటే మతి పోవాల్సిందే.  ధోని దగ్గర దాదాపు అన్ని రకాల మోడల్స్‌ వింటేజ్‌ బైక్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత వెంకటేష్ ప్రసాద్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు.

బైక్‌ల విస్తృత సేకరణతో పాటు, ధోనీకి పాతకాలపు కార్ల జాబితా కూడా ఉంది. వీటిలో కొన్ని ధోని దిగుమతి చేసుకున్న కార్లు కాగా, మరికొన్ని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేసినవి. అతిపెద్ద విషయం ఏమిటంటే, ధోని తన గ్యారేజీలో ఉన్న అన్ని బైక్‌లను చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. వీటికి సర్వీసింగ్ కూడా స్వయంగా తానే చేసుకుంటాడు.

ధోని గ్యారేజీ చూడాలనుకుంటే వెంటనే వీడియోపై ఒక లుక్కేయండి. అయితే వీడియో చూసిన అభిమానులు.. ''ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా.. నీ దగ్గరున్న బైక్‌లు, కార్లతో షోరుంనే ఏర్పాటు చేయొచ్చు''..  ''మంచి భోజన ప్రియుడ్ని చూశాం.. నీలాంటి వాహన ప్రియుడ్ని మాత్రం ఎక్కడా చూడలేదు'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: BAN Vs AFG: పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్‌, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ

#MLC2023: దంచికొట్టిన సీఎస్‌కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement