sunil joshi
-
చరిత్ర మరువని అద్భుత గణాంకాలు
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ పేరిట నమోదై ఉన్నాయి. 2023, నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 9.5 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.ఈ ప్రదర్శన తర్వాత 12 మంది భారత బౌలర్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసినప్పటికీ ఒక్కరు కూడా ఏడు వికెట్ల మార్కును తాకలేకపోయారు. 2014లో స్టువర్ట్ బిన్నీ బంగ్లాదేశ్‌పై నమోదు చేసిన 6/4 ప్రదర్శన భారత వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమం. భారత వన్డే క్రికెట్లో టాప్-5 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఒక్కరు కూడా తమ కోటా 10 ఓవర్లు పూర్తిగా వేయకపోవడం గమనించదగ్గ విశేషం.అసలు విషయానికొస్తే.. వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు సిరాజ్ పేరిట నమోదై ఉన్నప్పటికీ.. 1999లో సౌతాఫ్రికాపై సునీల్ జోషీ నమోదు చేసిన గణాంకాలను (10-6-6-5) మాత్రం వన్డే క్రికెట్ ఎన్నటికీ మరువదు. కెన్యాలోని నైరోబీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సునీల్ జోషి మెలికలు తిరిగే బంతులతో సౌతాఫ్రికా ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బంతి వికెట్ల ఆవల నేలపై పడిందంటే వదిలేయడం తప్ప సౌతాఫ్రికా ఆటగాళ్లకు వేరే గత్యంతరం లేకుండా ఉండింది.వన్డే క్రికెట్ చరిత్రలో ఓ స్పిన్నర్ ఇంతలా బ్యాటర్లను భయపెట్టడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండవచ్చు. ఈ మ్యాచ్‌లో జోషి ఓవర్‌కు 0.60 సగటున పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల్లో కోటా ఓవర్లు పూర్తి చేసి ఇంత తక్కువ ఎకానమీతో బౌల్ చేయడం చాలా అరుదు. నేటి ఆధునికి క్రికెట్లో 10 ఓవర్లలో ఒకటి, రెండు మెయిడిన్లు వేస్తేనే గగనమైతే.. అప్పట్లో జోషి ఏకంగా ఆరు మెయిడిన్ ఓవర్లు సంధించాడు. ఆ మ్యాచ్‌లో జోషి స్పిన్ మాయాజాలం ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 48 ఓవర్లు ఎదుర్కొని 117 పరుగులకే కుప్పకూలింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 22.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సదగోపన్ రమేశ్ 26, సౌరవ్ గంగూలీ 38 పరుగులు చేసి ఔట్ కాగా.. విజయ్ భరద్వాజ్ (18), రాహుల్ ద్రవిడ్ (6) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో సునీల్ జోషి నమోదు చేసిన గణంకాలు 14వ అత్యుత్తమమైనప్పటికీ.. వన్డే క్రికెట్లో ఈ ప్రదర్శన చిరకాలం గుర్తుండిపోతుంది. -
'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి'
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని మంచి వాహన ప్రియుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచీలోని తన సొంత ఇంట్లో ధోని కార్లు, బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్లో కొత్త బైక్ లేదా కార్ వచ్చిన అది ధోని గ్యారేజీలోకి రావాల్సిందే. ధోని తన గ్యారేజీని ఎప్పుడు చూపించడానికి ఇష్టపడలేదు. అయితే మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ చొరవతో ధోని గ్యారేజీని తొలిసారి చూసే అవకాశం మనకు దక్కింది. ధోని గ్యారేజీకి సంబంధించిన వీడియోనూ చూస్తే కళ్లు బెర్లు కమ్మడం ఖాయం. పలు రకాల మోడల్స్‌కు సంబంధించిన కార్లు, బైక్‌లు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్యారేజీ మొత్తం బైకులు, కార్లతో నిండిపోయింది. అవసరం అనుకుంటే ధోని ఒక చిన్నపాటి షోరూం అయినా నడిపించొచ్చు. ఏది ప్రత్యేకంగా కనిపించినా.. అది ధోని గ్యారేజ్‌లోకి రావాల్సిందే. బైక్‌లు, కార్లు అంటే ధోనీకి అంత పిచ్చి అన్నమాట. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో చూడొచ్చు. విషయంలోకి వెళితే.. టీమిండియా మాజీలు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషిలు రాంచీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ధోనీ ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. అక్కడే ఉన్న ధోని తొలిసారి తన గ్యారేజీని వారికి చూపించాడు. గ్యారేజీలో ఒక్కో కారు, బైకు చూస్తుంటే మతి పోవాల్సిందే. ధోని దగ్గర దాదాపు అన్ని రకాల మోడల్స్ వింటేజ్ బైక్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత వెంకటేష్ ప్రసాద్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. బైక్‌ల విస్తృత సేకరణతో పాటు, ధోనీకి పాతకాలపు కార్ల జాబితా కూడా ఉంది. వీటిలో కొన్ని ధోని దిగుమతి చేసుకున్న కార్లు కాగా, మరికొన్ని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేసినవి. అతిపెద్ద విషయం ఏమిటంటే, ధోని తన గ్యారేజీలో ఉన్న అన్ని బైక్‌లను చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. వీటికి సర్వీసింగ్ కూడా స్వయంగా తానే చేసుకుంటాడు. ధోని గ్యారేజీ చూడాలనుకుంటే వెంటనే వీడియోపై ఒక లుక్కేయండి. అయితే వీడియో చూసిన అభిమానులు.. ''ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా.. నీ దగ్గరున్న బైక్‌లు, కార్లతో షోరుంనే ఏర్పాటు చేయొచ్చు''.. ''మంచి భోజన ప్రియుడ్ని చూశాం.. నీలాంటి వాహన ప్రియుడ్ని మాత్రం ఎక్కడా చూడలేదు'' అంటూ కామెంట్స్ చేశారు. One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house. Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz — Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023 చదవండి: BAN Vs AFG: పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ #MLC2023: దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం -
అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి.. శాంసన్ కంటే బెటర్!
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో జితేష్ శర్మ ఒకడని సునీల్ జోషి కొనియాడాడు. కాగా జితేష్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్‌గా మారాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన జితేష్ 165.97 స్ట్రైక్ రేట్‌తో239 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో హిందూస్తాన్ టైమ్స్‌తో జోషి మాట్లాడుతూ.. "ఐపీఎల్లో జితేష్ దుమ్మురేపుతున్నాడు. పంజాబ్‌కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ శర్మ మెరుగైన ఆటగాడు. గత కొన్ని నెలలగా అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గత కొన్ని టీ20 సిరీస్‌లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు. కానీ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఈ సారి మాత్రం అతడికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్‌కు ఏమి చేస్తున్నాడో టీమిండియాకు కూడా అదే అందిస్తాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్ -
WC 2023: చహల్ కంటే అతడు బెటర్.. కుల్దీప్ కూడా..: టీమిండియా మాజీ సెలక్టర్
ICC ODI World Cup 2023- Kul-Cha Spin Duo: ‘‘సుదీర్ఘ కెరీర్లో ప్రతి బౌలర్ కెరీర్లో ఇలాంటి దశను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చహల్ అదే స్థితిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి తను దేశవాళీ క్రికెట్ ఆడితే బాగుంటుంది. పూర్తిస్థాయిలో తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా చహల్ ఈ మేరకు సన్నద్ధం కావాల్సి ఉంది’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సునిల్ జోషి అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో తానైతే ‘కుల్-చా’ స్పిన్ ద్వయంలో కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తానని పేర్కొన్నాడు. చహల్ ఇప్పటి వరకు ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 2/43, శ్రీలంకతో వన్డేలో 1/58 గణాంకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల విషయానికొస్తే.. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు చహల్ ఖాతాలో ఉన్నాయి. జడ్డూ ఉంటాడు.. బ్యాకప్‌గా అతడే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ముచ్చటించిన సునిల్ జోషి.. తన ప్రపంచకప్ జట్టులో చహల్‌కు చోటు ఇవ్వలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడినట్లయితే.. నా టీమ్‌లో జడేజా ఉంటాడు. ఒకవేళ తను ఫిట్‌గా లేనట్లయితే బ్యాకప్‌గా అక్షర్ పటేల్ ఉండాలి. ఆ తర్వాత వాషీ(వాషింగ్టన్ సుందర్). ఒకవేళ మరో లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయి జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన కనబరచగలడు. వరుస విరామాల్లో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. అంతేకాదు.. రవి బిష్ణోయి.. చహల్ కంటే మెరుగ్గా ఫీల్డింగ్ చేయగలడు’’ అని సునిల్ జోషి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భిన్న పరిస్థితుల నడుమ ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి చెబుతూ.. ‘‘కుల్దీప్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. భారత్‌లో ప్రపంచకప్ జరుగబోతోంది. ఇక్కడ విభిన్న తరహా మైదానాలు ఉన్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎక్కడిక్కడ భిన్నంగా ఉంటాయి. కాబట్టి వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టును ఒక్కో మైదానంలో ఎదుర్కొనేందుకు ఏ మేర సంసిద్ధమవుతాడనే అంశం మీదే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని సునిల్ జోషి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కూడా కుల్దీప్ పాత్ర కీలకం కానుందని సునిల్ అంచనా వేశాడు. అదరగొడుతున్న కుల్దీప్ ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో రెండు వన్డేల్లో ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్ Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది -
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
ఈ ఏడాది ఐపీఎల్ టి20 టోర్నీలో పంజాబ్ కింగ్స్ జట్టుకు భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కర్ణాటకకు చెందిన 52 ఏళ్ల సునీల్ జోషి భారత జట్టు తరఫున 1996 నుంచి 2001 మధ్య కాలంలో 15 టెస్టులు ఆడి 41 వికెట్లు... 69 వన్డేలు ఆడి 69 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన సునీల్ జోషి గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు. ఇక ఇప్పటికే పంజాబ్ తమ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ ఆటగాడు ట్రెవర్ బేలిస్ నియమించిన సంగతి తెలిసిందే. అదే విధంగా పంజాబ్ కింగ్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు భారత వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్ అప్పగించింది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. బుమ్రా కీలక నిర్ణయం! -
భారత జట్టుతో పాటు ఐర్లాండ్‌కు వెళ్లనున్న చీఫ్ సెలెక్టర్..!
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టుతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు టీ20ల సిరీస్ నిమిత్తం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటనుంచనుంది. ఇక జూన్ 26న డబ్లిన్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఐర్లాండ్ సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దూరమయ్యాడు. దీంతో తొలి సారి భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎంపిక కాగా, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. చేతన్ శర్మ భారత జట్టుతో పాటు ఐర్లాండ్‌కు పయనం కానున్నారు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బీసీసీఐ సెలెక్టర్ సునీల్ జోషి కూడా భారత జట్టుతో ఉన్నారు. ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Wasim Jaffer Trolls Eoin Morgan: 'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్ -
రోహిత్ శర్మ ఫిట్
బెంగళూరు: భారత అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు మార్గం సుగమమైంది. శుక్రవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించిన పరీక్షలో రోహిత్ సఫలమయ్యాడు. అతను తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మాజీ కెప్టెన్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగిందని... రోహిత్ ఫిట్నెస్, బ్యాటింగ్ సమయంలో అతని కదలికలతో సంతృప్తి చెందిన ద్రవిడ్ తన నివేదికను బోర్డుకు పంపించినట్లు సమాచారం. బీసీసీఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆది లేదా సోమవారాల్లో రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరతాడు. చార్టర్డ్ ఫ్లయిట్లో దుబాయ్ వెళ్లి అక్కడినుంచి సిడ్నీకి పయనమవుతాడు. ఆసీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోహిత్ ముందుగా భారత జట్టుతో సంబంధం లేకుండా 14 రోజుల కఠినమైన క్వారంటైన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను జట్టుతో కలుస్తాడు. జనవరి 7నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్లో కండరాల గాయానికి గురైన అనంతరంనుంచి అతని ఫిట్నెస్, జట్టులోకి ఎంపిక చేయకపోవడం, కెప్టెన్‌కు సమాచారం ఇవ్వకపోవడంవంటి తదితర అంశాలు వివాదానికి కారణమయ్యాయి. తాజా పరిణామంతో వాటికి ముగింపు లభించింది. -
టెస్టు జట్టులో సిరాజ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్‌తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు. బయో బబుల్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్‌లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరాజ్ శ్రమకు ఫలితం... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు. వన్డే, టి20 జట్ల నుంచి పంత్ అవుట్... ఏడాది తర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్లో 11 మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల వరుణ్ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్ సొంతం. ఈ ఐపీఎల్లో వరుణ్ స్పిన్‌కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు. భారత జట్ల వివరాలు టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, విహారి, శుబ్‌మన్ గిల్, సాహా (వికెట్ కీపర్), పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్. వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకూర్. టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్ పాండ్యా, సామ్సన్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి. అదనపు పేస్ బౌలర్లు: కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్. -
ఈ పదవి ఓ గౌరవం: చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు మరోసారి సేవ చేయడానికి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రూపంలో అవకాశం లభించిందని... దీనిని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి వ్యాఖ్యానించారు. 49 ఏళ్ల జోషిని చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘మన దేశానికి మరోసారి సేవ చేయడానికి దక్కిన గౌరవంగా, హక్కుగా ఈ పదవిని నేను భావిస్తున్నాను. నన్ను బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసిన సీఏసీ ప్యానల్ సభ్యులైన మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లకు కృతజ్ఞతలు’ అని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన జోషి 1996–2001 మధ్య సాగిన తన కెరీర్లో 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. అనంతరం హైదరాబాద్, యూపీ, జమ్మూ కశ్మీర్ జట్లకు కోచ్‌గా... 2017 నుంచి 2019 ప్రపంచ కప్ వరకు బంగ్లాదేశ్ జట్టుకు... 2019 జులై నుంచి కొన్ని నెలలపాటు అమెరికా జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తన సేవలను అందించారు. -
అగార్కర్‌కు మరో చాన్స్?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సెలక్టర్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయిన మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు మరో చాన్స్ ఉన్నట్లే కనబడుతోంది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్‌జోన్)ని ఎంపిక చేయడంతో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. జోనల్ పద్ధతిని పాటించడంతో అగార్కర్ అసలు సెలక్టర్ల రేసులోనే లేకుండా పోయాడు.(ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి) రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహాన్లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోనల్ ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్ ఖోడా సెంట్రల్ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఇక్కడ సునీల్ జోషి, హర్విందర్ సింగ్‌లను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే సునీల్ జోషి చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేశారు. అగార్కర్‌కు మరో చాన్స్ ఎలా? సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)ల పదవీ కాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనుంది. దాంతో ప్రస్తుతం దరఖాస్తుకు చేసుకుని నిరాశకు గురైన అగార్కర్, నయాన్ మోంగియా, మణిందర్ సింగ్ తదితరులు మళ్లీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం లేకుండానే రేసులో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా జతిన్ పరంజపే ముంబైకు చెందిన వాడు కావడంతో అతని స్థానంలో అగార్కర్‌కు చాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే దానికి మరో ఆరు నుంచి ఏడు నెలలు నిరీక్షించాల్సి ఉంటుంది. సెలక్టర్‌గా అగార్కర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. ‘భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాలు అగార్కర్‌కు ఉన్నాయి. సెలక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకున్న జాబితా ప్రకారం చూస్తే అతనే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ జోనల్ పద్ధతిని అనుసరించడంతో అగార్కర్ చాన్స్ మిస్సయ్యాడు. అదే సమయంలో ముంబై నుంచి పరంజపే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దాంతో అగార్కర్‌కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ముగ్గురు మరో ఆరు-ఏడు నెలల్లో వీడ్కోలు చెప్పనున్నారు. అప్పుడు అగార్కర్‌ను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం’ అని గంగూలీ తెలిపాడు. -
ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి
ముంబై: ఓ తెలుగు జట్టు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్ పదవీకాలం ముగియగా... ఇప్పుడు అతని స్థానంలో మరో తెలుగు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాడు సునీల్ జోషి సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా వచ్చాడు. 49 ఏళ్ల సునీల్ జోషి గతంలో హైదరాబాద్ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్‌జోన్)ని ఎంపిక చేయగా... ఈ ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జోషి సిఫారసును బోర్డు ధ్రువీకరించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సెంట్రల్ జోన్ నుంచి ఖాళీ అయిన స్థానంలో మాజీ భారత పేస్ బౌలర్, 42 ఏళ్ల హర్వీందర్ సింగ్‌కు అవకాశమిచ్చారు. ఎమ్మెస్కేతో పాటు గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) పదవీ కాలం కూడా ముగిసింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఇప్పటికే జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)లు ఉండగా... కొత్తవారు త్వరలోనే బాధ్యతలు చేపడతారు. భారత మాజీ క్రికెటర్లు నయన్ మోంగియా, అజిత్ అగార్కర్ సహా మొత్తం 40 మంది సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోగా... ఇందులో నుంచి సునీల్ జోషి, హర్వీందర్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, శివరామకృష్ణన్‌లను తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించాక చైర్మన్, సెలక్టర్‌ను ఖరారు చేశారు. ‘సెలక్షన్ కమిటీ కోసం అత్యుత్తమ వ్యక్తుల్నే ఎంపిక చేశాం. జోషి, హర్వీందర్‌లు సరైన దృక్పథంతో ఉన్నారు. ఇంటర్వ్యూలో వాళ్లిద్దరు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా సూటిగా స్పష్టంగా ఉన్నాయి’ అని సీఏసీ చైర్మన్ మదన్ లాల్ తెలిపారు. సీఏసీకి చాలా దరఖాస్తులే వచ్చాయని, అందరి పేర్లను పరిశీలించాకే తుది జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పారు. చైర్మన్ సునీల్ జోషి, సెలక్టర్ హర్వీందర్‌లు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. జోషి తెలుసుగా... సునీల్ జోషి అంటే గొప్పగా గుర్తొచ్చే ప్రదర్శన సఫారీపైనే! నైరోబీలో 1999లో జరిగిన వన్డే టోర్నీలో జోషి 10–6–6–5 బౌలింగ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 1996 నుంచి 2001 వరకు సాగిన స్వల్ప కెరీర్లో జోషి 15 టెస్టులాడి 41 వికెట్లు, 69 వన్డేలు ఆడి 69 వికెట్లను పడగొట్టాడు. హైదరాబాద్ రంజీ కోచ్‌గా వ్యవహరించిన జోషికి బంగ్లాదేశ్ జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాజీ పేసర్ హర్వీందర్ది కూడా స్వల్ప కాలిక కెరీరే! 1998 నుంచి 2001 వరకు కేవలం నాలుగేళ్లే టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈ మాజీ సీమర్ మూడే టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. -
ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో సునీల్ జోషి
సాక్షి, ముంబై: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సునీల్ జోషీ నియమితులయ్యారు. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సునీల్ జోషి పేరును బీసీసీఐకి సిఫార్సు చేసింది. బుధవారం సమావేశమైన సీఏసీ సెలక్టర్ పదవికి దరఖాస్తులు చేసుకున్న వారిని తుది ఇంటర్వ్యూలు చేసింది. వెంకటేశ్ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ సునీల్ వైపే సీఏసీ మొగ్గు చూపడంతో అతడికే చీఫ్ సెలక్టర్ పదవి వరించింది. సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేసర్ హర్విందర్ సింగ్‌కు సీఏసీ అవకాశం కల్పించింది. స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఈ నూతన ఛైర్మన్ ఆధ్వర్యంలోని కమిటీనే టీమిండియాను ఎంపిక చేయనుంది. బుధవారం చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక నేపథ్యంలో సీఏసీ మంగళవారమే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలను కలిసి మార్గదర్శకాలను తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మరోసారి భేటీ అయిన సీఏసీ అజిత్ అగార్కర్ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో కర్ణాటక మాజీ ప్లేయర్స్ వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషీలపై పోటీ ఏర్పడింది. చివరికి సునీల్ జోషీనే సీఏసీ ఎంపిక చేసింది. ఇక సునీల్ 1996-2001 మధ్య కాలంలో టీమిండియా తరుపున ప్రాతినిథ్య వహించాడు. 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. చదవండి: అజిత్ అగార్కర్‌కు నిరాశ 'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది' -
అజిత్ అగార్కర్‌కు నిరాశ
ముంబై: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో అందరి కంటే ముందున్నాడనుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) షాకిచ్చింది. మంగళవారం సమావేశమైన మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన సీఏసీ... అగార్కర్ దరఖాస్తును తిరస్కరించింది. రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహాన్లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోన్ల ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్ ఖోడా సెంట్రల్ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: పాండ్యా సూపర్ ఇన్నింగ్స్) -
భారత బౌలింగ్ కోచ్ పదవికి సునీల్ జోషి దరఖాస్తు
న్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్ కోచ్ పదవికి భారత మాజీ ఆటగాడు సునీల్ జోషి దరఖాస్తు చేశాడు. కర్ణాటకకు చెందిన జోషి ఇటీవలి ప్రపంచ కప్ వరకు బంగ్లాదేశ్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవమే ప్రాతిపదికగా తన అభ్యర్థ్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు ఒక స్పిన్నర్ బౌలింగ్ కోచ్‌గా ఉండటం అవసరమని అంటున్నాడు. 2011లో హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల జోషి 1996–2001 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 69 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 160 మ్యాచ్‌ల్లో 615 వికెట్లు తీశాడు. -
బౌలింగ్ కోచ్ రేసులో సునీల్ జోషి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి మాజీ స్పిన్నర్ సునీల్ జోషి దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన జోషి.. భారత బౌలింగ్ కోచ్ రేసులోకి వచ్చాడు. భారత బౌలింగ్ కోచ్ విషయంలో స్పిన్ బౌలింగ్‌లో అనుభవమున్న వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నదని బలంగా నమ్ముతున్న సునీల్ జోషి అందుకు దరఖాస్తు చేశాడు. ‘ అవును.. నేను టీమిండియా బౌలింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేశా. నేను ఇప్పటికే బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా నా వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించా. తదుపు చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నా. భారత్‌కు స్పెషలిస్టు స్పిన్ కోచ్ అవసరం లేదనే విషయం నాకు తెలుసు. కాకపోతే స్పిన్‌లో అనుభవమున్న నన్ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేస్తారని నమ్ముతున్నా’ అని జోషి తెలిపాడు. ‘పలు అంతర్జాతీ క్రికెట్ జట్లు స్పెషలిస్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటాయి. దాంతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. అందులో పేస్ బౌలింగ్ కోచ్ కానీ స్పిన్ బౌలింగ్ కోచ్ కానీ ఉంటారు. భారత్ క్రికెట్ జట్టు కూడా బౌలింగ్ కోచ్ అవసరం. అది స్పిన్ బౌలర్ కానీ, పేస్ బౌలర్ కానీ కావొచ్చు. అందుకు నేను కూడా బౌలింగ్ కోచ్ పదవి రేసుకు పోటీ పడటం తప్పులేదు’ అని జోషి పేర్కొన్నాడు. 1996-2001 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు ప్రాతినిథ్యం వహించిన జోషి 15 టెస్టుల్లో 41 వికెట్లు సాధించాడు. ఇక వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 160 గేమ్స్ ఆడి 615 వికెట్లు సాధించాడు. -
చిక్కుల్లో ప్రజ్ఞా ఠాకూర్
భోపాల్: భోపాల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై 12ఏళ్ల క్రితం నమోదైన హత్యకేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం తిరిగి విచారించాలని నిర్ణయించింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో ప్రజ్ఞాసింగ్ విజయం సాధించనున్నారని తేలిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్‌జోషి హత్యకేసులో ప్రజ్ఞాసింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిప్పటికీ ఈ కేసును పునర్విచారించేందుకు న్యాయసలహా తీసుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ మంగళవారం వెల్లడించారు. 2007 డిసెంబర్ 29న దేవస్ జిల్లాలో సునీల్‌జోషి హత్యకు గురయ్యారు. సరైన సాక్ష్యాధారాలులేని కారణంగా 2017లో ప్రజ్ఞాసింగ్, మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సునీల్ జోషి హత్యకేసు పునర్విచారణకు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని శర్మ తెలిపారు. -
అన్ని ‘సంఝౌతా’ కేసులేనా?
సాక్షి, న్యూఢిల్లీ : 12 ఏళ్ల క్రితం 68 మంది ప్రయాణికులను బలితీసుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసులో నిందితులంతా విడుదలయ్యారు. నెంబర్ వన్ నిందితుడు స్వామి అసీమానంద్ సహా నిందితులందరిని మార్చి 20వ తేదీన కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విడుదల చేసిన విషయం తెల్సిందే. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విఫలమైనే కారణంగానే నిందితులను విడుదల చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇంతకుముందు మక్కా మసీదు, ఆజ్మీర్ షరీఫ్ బాంబు పేలుళ్ల కేసుల నుంచి కూడా స్వామి అసీమానంద్ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగానే విడుదలయ్యారు. హిందూత్వ టెర్రర్ కేసులన్నింటిలో సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఎన్ఐఏ విఫలమైందంటూ కోర్టులు పలు సార్లు ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ప్రత్యేక కోర్టు తీర్పుతో విడుదలైన అసీమానంద బయటకు రాగానే తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. 2010, డిసెంబర్ నెలలో, 2011, జనవరి నెలలో బాంబు పేలుళ్ల వెనక తన హస్తం ఉందని కోర్టు ముందు అసీమానంద స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత మాటమార్చి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేయడం వల్ల అలా తాను వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ‘కారవాన్’ అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారన్న విశయాన్ని ఖండించారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని హింసాత్మక సంఘటనల్లో తన హస్తం ఉందని గర్వంగా చెప్పుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ముస్లింలు లక్ష్యంగా జరిగిన అన్ని బాంబు పేలుళ్ల సంఘటనలకు ఆరెస్సెస్ నాయకులు మోహన్ భగవత్, ఇంద్రేశ్ కుమార్ల దీవెనలు కూడా ఉన్నాయని ఆయన ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2006లో జరిగిన మాలెగావ్ బాంబ్ కేసు, 2007లో జరిగిన సంఝౌతా బాంబ్ కేసు, 2007లో జరిగిన మెక్కా మసీదు పేలుడు కేసు, 2007లోనే జరిగిన అజ్మీర్ షరీఫ్ పేలుడు కేసు, 2008లో జరిగిన మాలేగావ్ మరో కేసు... వీటన్నింటి వెనక హిందూత్వ శక్తుల హస్తం ఉందనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల వెనక హిందూత్వ శక్తుల నెట్వర్క్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయని ‘సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసు’ ప్రత్యేక దర్యాప్తు బృందానికి మూడేళ్లపాటు నాయకత్వం వహించిన హర్యానా పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ 2016, జూన్ 6వ తేదీన ‘ది వైర్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఇండోర్ వెళ్లడం, అక్కడి ఆరెస్సెస్ సభ్యుడు సునీల్ జోషి, అతని ఇద్దరు అనుచరుల హస్తం ఉందని విచారణలో తేలడం, ఆ బృందం సునీల్ జోషిని అరెస్ట్ చేసేలోగా ఆయన హత్య జరగడం తదితర పరిణామాల గురించి పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ పూసగుచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝాతా కేసులో నిందితులను మార్చి 20వ తేదీన ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ‘ది వైర్ న్యూస్’ నాటి వికాస్ నారాయణ్ రాయ్ ఇంటర్వ్యూను ఈ మార్చి 21వ తేదీన పునర్ ప్రచురించింది. ఈ హిందూత్వ కేసుల దర్యాప్తును 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వీకరించినప్పటి నుంచి కొన్ని కేసులు కాల గర్భంలో కలిసి పోయాయి. కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేక నిందితులు విడుదలయ్యారు. కొన్ని కేసుల్లో నిందితులంతా బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక్క కేసులో కూడా ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడలేదు. 2008 నాటి మాలెగావ్ కేసులో నిందితులైన సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్ట్‌నెంట్ కల్నల్ పురోహిత్ బెయిల్‌పై విడుదలయ్యారు. నాటి ఆరెస్సెస్ స్థానిక నాయకుడు ఇంద్రేశ్ కుమార్ నేడు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు. సాక్ష్యాధారాలు లేక సంఝౌతా కేసు నుంచి కూడా పురోహిత్ విడుదలయ్యారు. ఎవరి మధ్య ఏం ‘సంఝౌతా’ కుదరిందోగానీ నేరస్థులతా తప్పించుకున్నారు. దేశంలో జరగుతున్న టెర్రరిస్టు దాడుల కేసులను త్వరతిగతిన దర్యాప్తు జరిపి నేరస్థులకు తగిన శిక్ష విధించేందుకు 2009లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ సంస్థను ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ టెర్రరిస్టు కేసుల దర్యాప్తునకు ఏ రాష్ట్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు చీఫ్‌గా 2017లో ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. -
రేసులో సునీల్ జోషి, రమేశ్ పవార్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ స్పిన్నర్లు సునీల్ జోషి, రమేశ్ పవార్లు పోటీపడుతున్నారు. 2017 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన కోచ్ తుషార్ అరోథె... సీనియర్ క్రీడాకారిణులతో వచ్చిన విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేసింది. దీనికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా, విజయ్ యాదవ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమత మాబెన్, సుమన్ శర్మ, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మారియా ఫహే తదితరులు ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం సునీల్ జోషి, రమేశ్ పవార్ల మధ్య ఉండనుంది. జోషి టీమిండియా తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడగా... పవార్ 2 టెస్టులు, 31 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పవార్ ప్రస్తుతం మహిళా జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తుండగా... జోషి మొన్నటి వరకు బంగ్లాందేశ్‌కు కోచ్‌గా పనిచేశాడు. శుక్రవారం ముంబైలో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీమ్, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. -
త్రిపుర...అదే జోరు!
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరాలన్న హైదరాబాద్ ఆశలకు త్రిపుర గండి కొట్టేటట్లే కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో అన్నింటికంటే బలహీన జట్టుగా ఉన్న త్రిపుర తొలి రోజు ఆటతీరును కొనసాగిస్తూనే కాస్త దూకుడు కూడా జోడించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 588 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ యోగేశ్ టకవాలే (400 బంతుల్లో 212; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించగా... వెటరన్ అబ్బాస్ అలీ (196 బంతుల్లో 105 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. శనివారం తీవ్రంగా శ్రమించినా హైదరాబాద్ బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. మారని బౌలింగ్ 285/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన త్రిపుర కొద్దిసేపటికే మురా సింగ్ (225 బంతుల్లో 150; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) వికెట్ కోల్పోయింది. మరో పది పరుగులు మాత్రమే జోడించిన అతను, రవికిరణ్ బౌలింగ్‌లో రవితేజకు క్యాచ్ ఇవ్వడంతో 206 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అభిజిత్ డే (12) కూడా వెంటనే వెనుదిరిగాడు. అయితే సీనియర్ బ్యాట్స్‌మన్ అబ్బాస్ అలీ అండతో టకవాలే చెలరేగిపోయాడు. 218 బంతుల్లో కెరీర్లో తన నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతటితో ఈ జోడి తమ జోరును ఆపలేదు. హైదరాబాద్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఈ క్రమంలో టకవాలే 150 మార్క్‌ను అందుకోగా...అలీ అర్ధ సెంచరీ పూర్తయింది. మూడో సెషన్లో త్రిపుర వేగం పెంచింది. 380 బంతుల్లో డబుల్ సెంచరీ చేరుకున్న యోగేశ్, 204 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో అక్షత్‌కు క్యాచ్ ఇచ్చినా... థర్డ్ అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. అయితే ఆ వెంటనే రవితేజ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొద్ది సేపటికే అచర్జీ (16) అవుటైనా...178 బంతుల్లో కెరీర్లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్న అబ్బాస్ అజేయంగా నిలిచాడు. స్పోర్టింగ్ వికెట్‌ను కాదని... హైదరాబాద్ కోచ్ సునీల్ జోషి అంచనా తప్పింది. ధర్మశాలలో హిమాచల్‌ప్రదేశ్‌పై ఘన విజయంతో తమ బ్యాట్స్‌మెన్‌ను ఆయన అమితంగా నమ్మినట్లుంది. అందుకే పిచ్ క్యురేటర్‌తో వాదించి మరీ బ్యాటింగ్ వికెట్‌ను సిద్ధం చేయించినట్లు తెలిసింది. వాస్తవంగా చూస్తే మన జట్టు బ్యాటింగ్ ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నా అద్భుతమైన లైనప్ ఏమీ కాదు. జట్టులో ఒక్క అంతర్జాతీయ ఆటగాడు కూడా లేడు. ఈ మ్యాచ్ కోసం క్యురేటర్ రెండు వికెట్లు సిద్ధం చేశారు. కోచ్‌గా తన జట్టు బలాలు, బల హీనతలు బాగా తెలిసిన జోషి, తనకు అసలు ఎలాంటి పిచ్ కావాలనే విషయంపై చివరి వరకు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. అయితే టాస్ గెలిస్తే భారీ స్కోరు చేయవచ్చనే ఆశతో బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా సహకరించే వికెట్‌ను కాదని జీవం లేని బ్యాటింగ్ వికెట్‌ను ఎంచుకున్నారు. అనూహ్యంగా త్రిపుర దీనిపై పండుగ చేసుకుంది. రెండు రోజుల ఆట పూర్తయినా త్రిపుర ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నాలుగు వికెట్లతో ఆ జట్టు మూడో రోజు కనీసం లంచ్ వరకు ఆడవచ్చు. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రా వైపే మొగ్గు చూపిస్తున్నా... మిగిలిన ఐదు సెషన్లు ఆడి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం అసాధ్యమే. కాబట్టి ఒక్క పాయింట్‌తో సరి పెట్టుకోవాల్సిందే!