
న్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్ కోచ్ పదవికి భారత మాజీ ఆటగాడు సునీల్ జోషి దరఖాస్తు చేశాడు. కర్ణాటకకు చెందిన జోషి ఇటీవలి ప్రపంచ కప్ వరకు బంగ్లాదేశ్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవమే ప్రాతిపదికగా తన అభ్యర్థ్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు ఒక స్పిన్నర్ బౌలింగ్ కోచ్‌గా ఉండటం అవసరమని అంటున్నాడు. 2011లో హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల జోషి 1996–2001 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 69 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 160 మ్యాచ్‌ల్లో 615 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment