న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు మరోసారి సేవ చేయడానికి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రూపంలో అవకాశం లభించిందని... దీనిని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి వ్యాఖ్యానించారు. 49 ఏళ్ల జోషిని చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘మన దేశానికి మరోసారి సేవ చేయడానికి దక్కిన గౌరవంగా, హక్కుగా ఈ పదవిని నేను భావిస్తున్నాను. నన్ను బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసిన సీఏసీ ప్యానల్ సభ్యులైన మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లకు కృతజ్ఞతలు’ అని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన జోషి 1996–2001 మధ్య సాగిన తన కెరీర్‌లో 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. అనంతరం హైదరాబాద్, యూపీ, జమ్మూ కశ్మీర్ జట్లకు కోచ్‌గా... 2017 నుంచి 2019 ప్రపంచ కప్ వరకు బంగ్లాదేశ్ జట్టుకు... 2019 జులై నుంచి కొన్ని నెలలపాటు అమెరికా జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తన సేవలను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment