chief selector
-
చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పారితోషికం ఎంతో తెలుసా?
బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం తాత్కాలిక సెలెక్టర్ శివ్‌సుందర్ దాస్ నేతృత్వంలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ప్యానెల్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విటర్లో పేర్కొంది. కాగా టీమిండియా తరపున 1998లో అరంగేట్రం చేసిన అగార్కర్ 2007 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 9 ఏళ్ల కెరీర్లో అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టి20 వరల్డ్‌కప్‌ను గెలిచిన టీమిండియా జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ముంబై జట్టుకు ప్రధాన సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటరీ ప్రొఫెషన్‌లోనూ అగార్కర్ తనదైన ముద్ర వేశాడు మరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అజిత్ అగార్కర్ పారితోషికం ఎంత ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ఇప్పటికైతే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు రూ. కోటి పారితోషికం చెల్లిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ కాకుండా మిగతా వారికి రూ.90 లక్షల చొప్పున ఏడాదికి చెల్లిస్తారు. అయితే అజిత్ అగార్కర్‌కు మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపేట్టేందుకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశం ఉంది. బీసీసీఐ కూడా చీఫ్ సెలెక్టర్ పదవికి పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అగార్కర్‌కు రూ. కోటి నుంచి మూడు కోట్ల వరకు చెల్లించే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక టీమిండియా తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇప్పటికి అజిత్ అగార్కర్ పేరిటే ఉంది. 2000వ సంవత్సరంలో జింబాబ్వేతో వన్డేలో అగార్కర్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అంతేకాదు అతి తక్కువ వన్డేల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గానూ అగార్కర్ నిలిచాడు. కేవలం 23 మ్యాచ్‌ల్లోనే అగార్కర్ ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా అగార్కర్ రికార్డు దశాబ్దం పాటు చెక్కుచెదరకుండా ఉంది. చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా Dhoni-Sakshi: 'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువయ్యాయా?' -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం ఇంటర్వ్యూలు చేసింది. చివరకు అగార్కర్ పేరును ఈ పదవి కోసం సీఏసీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. అనంతరం అగార్కర్ అనుభవం దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ పదవికి కూడా సీఏసీ అతని పేరునే సూచించింది. ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది. 2000లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో అగార్కర్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్లేయర్‌గా కెరీర్ ముగిశాక అగార్కర్ ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్‌గా, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. క్రికెట్ దిగ్గజం ఒకరు అగార్కర్ పదవి చేపట్టడం వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా చీఫ్ సెలెక్టర్ జీతం విషయంలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐలో అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తికి కేవలం కోటి రూపాయల జీతం ఉండటంపై చాలా మంది ఈ పదవిపై ఆనాసక్తి చూపారు. డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే కారణంగా చీఫ్ సెలెక్టర్ పోస్ట్‌పై అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ: అజిత్ అగార్కర్ (చైర్మన్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్. -
కోటి చాలదు! వద్దే వద్దు! ఇంకా పెంచుతాం.. బీసీసీఐ హామీ.. ఎట్టకేలకు..
BCCI New Chief Selector: టీమిండియా క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. వార్షిక వేతనం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చిన హామీ మేరకు ఈ మాజీ పేసర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చేతన్ శర్మ రాజీనామాతో కాగా ఓ ప్రైవేట్ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషరన్ వల్ల టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ పదవి ఊడిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు ఫిట్నెస్ లేకపోయినా ఇంజక్షన్లు తీసుకుని బరిలో దిగుతారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. దీంతో చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. సెహ్వాగ్ పేరు తెరపైకి! కొట్టిపడేసిన మాజీ ఓపెనర్ ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి స్టార్లను చీఫ్ సెలక్టర్‌గా నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనంటూ వీరూ భాయ్ కొట్టివేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా వ్యవహరించిన అజిత్ అగార్కర్ ఆ ఫ్రాంఛైజీతో బంధానికి వీడ్కోలు పలకడం చర్చకు దారి తీసింది. కోటి చాలదు! వద్దే వద్దు! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి చేపట్టేందుకు అగార్కర్ తొలుత సంశయించినా బోర్డు మాత్రం అతడిని ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి కోటి రూపాయాలు వేతనంగా చెల్లిస్తోంది బీసీసీఐ. కమిటీలోని మిగతా సభ్యులకు వార్షిక వేతనంగా 90 లక్షలు అందజేస్తున్నట్లు సమాచారం. ఇంకా పెంచుతాం.. బోర్డు హామీ అయితే, జీతం విషయంలో అగార్కర్ వెనకడుగు వేయగా.. వేతనం పెంచేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామెంటేటర్‌గా, కోచ్‌గా అగార్కర్ ఆర్జిస్తున్న మొత్తాన్ని భర్తీ చేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు గురువారం చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇందుకు సంబంధించి శనివారం (జూలై 1) ఇంటర్వ్యూ జరుగనుంది. ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2023 టోర్నీకి ముందు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ నియామకం ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. టీమిండియా తరఫున ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ టీమిండియా తరఫున 26 టెస్టులు, 188 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో టెస్టుల్లో 58, వన్డేల్లో 288, టీ20లలో మూడు వికెట్లు పడగొట్టి విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా పేరొందాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. చదవండి: ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది! Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!
త్వరలోనే భారత జట్టుకు సరికొత్త చీఫ్ సెలెక్టర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ కొత్త చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. కాగా గత రెండు సార్లు కూడా ఛీప్ సెలక్టర్ రేసులో అగార్కర్ పేరు వినిపించినప్పటికి.. అతడు ఈ పదవిని చేపట్టేందుకు సుముఖత చూపలేదు. అయితే ఈ సారి మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టేందుకు అజిత్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ జూలై మొదటి వారంలో అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో అప్పటి సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ భారత జట్టుకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేసి దొరికిపోవడంతో రాజీనామా చేశాడు. ఈ క్రమంలో చేతన్ శర్మ స్థానంలో సెలక్షన్ ప్యానల్లో సభ్యుడైన శివ్‌సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛీప్ సెలెక్టర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే త్వరలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు జరగనుండంతో పూర్తి స్థాయి ఛీప్ సెలెక్టర్‌ను ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ పడింది. ఈ క్రమంలోనే కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూలై 1 నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి. చదవండి: #ICCWorldCup2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం! -
చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! ఖండించిన మాజీ ఓపెనర్
కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరిలో చేతన్ శర్మ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాలుగు నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్స్‌లోనూ ఉంచింది. అప్లికేషన్లో జాబ్ రోల్‌తో పాటు అందుకు కావాల్సిన అర్హతలను అందుబాటులో ఉంచింది. చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికైన వ్యక్తి టెస్టులు, వన్డేలు, టి20లకు జాతీయ టీమ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాగా దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 అని బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేయాల్సిన పనులు, బాధ్యతలు.. 1. న్యాయమైన, పారదర్శక పద్ధతిలో సాధ్యమైనంత ఉత్తమమైన జట్టును ఎంచుకునే ప్రయత్నం చేయాలి. 2. సీనియర్ జాతీయ జట్టు కోసం ఒక బలమైన బెంచ్ బలాన్ని సిద్ధం చేసుకోవాలి 3. అవసరమైన సమయంలో బృంద సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. 4. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను చూడటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి 5. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధిత జట్టు ప్రదర్శనల మూల్యాంకన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు త్రైమాసిక రిపోర్టులు అందించాల్సి ఉంటుంది. 6. జట్టు ఎంపికపై బీసీసీఐ సూచనలను మీడియా సమావేశంలో వెల్లడించేందుకు సిద్దంగా ఉండాలి 7.ప్రతి ఫార్మాట్లో జట్టుకు కెప్టెన్‌ని నియమించండి. 8. బీసీసీఐ నియమాలు,నియంత్రణలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉండాలి. ► ఇక టీమిండియా తరపున ఏడు టెస్టులు లేదా కనీసం 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు.. లేదా 10 వన్డేలు లేదా 20 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి. ముందు వరుసలో వీరేంద్ర సెహ్వాగ్.. ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి టీమిండియా మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నాడు. బీసీసీఐకి చెందిన ఒక అధికారి సెహ్వాగ్ వద్దకు వెళ్లి ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ సెహ్వాగ్ ఆ వార్తలను ఖండించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్ పదవిపై ఆశపడడం లేదు.. కానీ అవకాశం వస్తే ఆలోచిస్తా. అయితే రెమ్యునరేషన్ విషయంలో కాస్త గందరగోళం ఉందని తేలింది. అయితే తాజాగా సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులకు ఆహ్వనాలు ఇవ్వడంతో సెహ్వాగ్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చేతన్ శర్మ స్థానంలో ప్రస్తుతం శివ్‌సుందర్ దాస్ తాత్కాలిక సెలెక్టర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ధోనిని నియమించండి..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని భారత జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని కొందరు భారత క్రికెట్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. ధోని స్థాయికి చీఫ్ సెలెక్టర్ పదవి చిన్నదే అయినప్పటికీ ఆటగాళ్ల ఎంపికల విషయంలో పారదర్శకత ఉంటుందని వారంటున్నారు. ధోని చీఫ్ సెలెక్టర్ అయితేనే ఎలాంటి పక్షపాతాలు లేకుండా ప్రతిభే కొలమానంగా ఎంపికలు జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు. ఐపీఎల్ కారణంగా ధోనికి యువ ఆటగాళ్లపై పూర్తిగా అవగాహణ ఉంది కాబట్టి, టాలెంట్ ఉన్న యువకులకు సరైన నాయ్యం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ధోని ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పి కొద్దికాలం పాటు సెలెక్టర్‌గా, కోచ్‌గా, నేషనల్ క్రికట్ అకాడమీ ఛైర్మన్‌గా వ్యవహరించాలని కోరుతున్నారు. భారత్‌లో మరో తరం క్రికెట్ మెరుగుపడాలంటే ధోని ఈ త్యాగం చేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇలా జరగడానికి అవకాశం లేకపోతే బీసీసీఐ తగు సవరణలు చేసైనా ధోనికి ఈ మూడు పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియాలో చాలామంది స్టార్ క్రికెటర్లకు వయసు పైబడుతుండటంతో, తదుపరి జనరేషన్‌ను ఇప్పటి నుంచే తీర్చిదిద్దుకోవడం కోసం ధోనికి ఈ మూడు కీలక పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు. ధోని కొంతకాలం పాటు ఈ మూడు పదవులు చేపడితే భారత క్రికెట్లో నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుందని అంటున్నారు. ధోనికి ఉన్న అపారమైన క్రికెట్ పరిజ్ఞానం, ఆట పట్ల అతనికున్న అంకితభావం, టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇచ్చి వారి నుంచి సక్సెస్‌ను రాబట్టిన ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని భారత క్రికెట్ భవిష్యత్తును ధోని చేతుల్లో పెట్టాలని కోరుతున్నారు. కాగా, భారత జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా చేతన్ శర్మ తొలగించబడటంతో ఆ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోనిని చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో ధోని లాంటి వ్యక్తి అయితే సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేయగలడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ధోని విషయంలో వారికి ఇలాంటి ఆచరణ సాధ్యం కాని అంచనాలు ఉన్నప్పటికీ.. ఇది జరగడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి. -
ఏడాదికి కేవలం కోటి రూపాయలే! అందుకే వీరూ పట్టించుకోలేదా? 4-5 కోట్లు ఇవ్వడం..
BCCI- Team India- Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మకు బీసీసీఐ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని బరిలోకి దిగుతారంటూ సంచలన వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాడు. ఈ మేరకు ఓ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ బహిర్గతం కావడంతో చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీలోని శివ్ సుందర్ దాస్ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా అతడికి డిప్యూటీలుగా సేవలు అందిస్తున్నారు. దీంతో కొత్త చీఫ్ సెలక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారత క్రికెట్లో స్టార్లుగా వెలుగొందిన వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు చీఫ్ సెలక్టర్ పదవి పట్ల ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారో సదరు అధికారి వివరించారు. నిజానికి ఐదేళ్ల కాలం కలిగిన టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్న వ్యక్తి ఏడాదికి రూ. కోటి జీతంగా పొందనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు 90 లక్షల ప్యాకేజీ ఉంటుందని సమాచారం. అయితే, తమకున్ను క్రేజ్ దృష్ట్యా సెహ్వాగ్, భజ్జీ వంటి స్టార్లు ఎండార్స్మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్స్టార్లు ఈ పదవిపై ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ‘‘కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(CoA) నియామక సమయంలో వీరూను హెడ్‌కోచ్ జాబ్‌కి అప్లై చేయమనే ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అతడు పట్టించుకోలేదు. అప్పుడు అనిల్ కుంబ్లేకు అవకాశం వచ్చింది. ఆర్థికంగానూ పదవులు మనకు దోహదం చేస్తేనే ఎవరైనా ఇలాంటి వాటికి మొగ్గుచూపుతారు. తర్వాత సెహ్వాగ్ నార్త్ జోన్ నుంచి సెలక్టర్‌గా వచ్చే ఛాన్స్ ఉండింది. కానీ అదీ జరుగలేదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. 4-5 కోట్లు ఇవ్వడం సమస్యేమీ కాదు ‘‘చీఫ్ సెలక్టర్‌కు 4-5 కోట్ల రూపాయలు చెల్లించడం పెద్ద సమస్యేమీ కాదు. కేవలం జీతం తక్కువ అన్న కారణంగా కాకుండా.. తాము అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేమనే కారణంగానే ప్రసిద్ధ ఆటగాళ్లు సెలక్షన్ కమిటీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు’’ అని తెలిపారు. అంతేగాక.. అన్ని సవాళ్లను అధిగమించి సరైన జట్టును ఎంపిక చేయడం కూడా కత్తిమీద సాములాంటిదే అని వ్యాఖ్యానించారు. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
#MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్'
టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ''క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని సగర్వంగా చెప్పగలను. క్రికెట్లో కేఎస్ భరత్ లాంటి యంగ్ క్రికెటర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. అదే విధంగా ఇతర క్రీడలో సాత్విక్ సాయిరాజ్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులు బ్యాడ్మింటన్‌లో.. టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశానికి వివిధ కేటగిరీల్లో పతకాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిస్తున్నారు. ఇక క్రీడల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా ఉంది. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. '' అంటూ చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడా మౌలిక సదుపాయాలు ఇంటర్నేషనల్ స్టేడియంలు 2 క్రికెట్ అకాడమీలు 4 ఫస్ట్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్ లు 18 ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు? ఇక ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ''దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే), కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్లున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కటే ఉంది. ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరపున కాదు. ఆ మధ్య రెండు కొత్త జట్లను ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్‌చంద్రా రెడ్డి కూడా 3,500 కోట్లకు బిడ్ వేశారు. కానీ, ఎక్కువ కోట్ చేసిన వేరేవాళ్లకు ఆ జట్లు వెళ్లాయి. ఒకదశలో వైజాగ్, అమరావతి అన్న పేరుతో ఫ్రాంచైజీ వస్తుందన్న టాక్ నడిచింది. ఐపీఎల్ కమర్షియల్ టోర్నమెంట్.ఇలాగే ఉంటే కొన్నిరోజులకు బీసీసీఐకి కూడా నష్టం జరుగుతోంది. ఒక రకంగా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేకపోవడమే మంచిది. ఫుట్‌బాల్‌లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు. '' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు. ఇక వికెట్ కీపర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ టీమిండియా తరపున ఆరు టెస్టుల్లో 106 పరుగులు, 17 వన్డేల్లో 131 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థశతకం ఉంది. ఇక 2016 నుంచి 2020 వరకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. చదవండి: #ViratKohli: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం -
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
-
పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా అఫ్రిది మంగమ్మ శపథం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇటీవలే షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ పేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కూడిన సెలక్షన్ కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో షాహిద్ అఫ్రిది తాను చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికవ్వడంపై తొలిసారి పెదవి విప్పాడు. తాను పదవి నుంచి దిగిపోయేలోపు పాకిస్తాన్ క్రికెట్ లో రెండు పటిష్టమైన జట్లను తయారుచేస్తానని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని చెప్పాడు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ''చీఫ్ సెలక్టర్ గా నా పదవీ కాలం ముగిసేలోపు పాక్ క్రికెట్ టీమ్ బెంచ్ ను బలోపేతం చేస్తా. నేను పాకిస్తాన్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేలా రెండు జట్లను తయారుచేస్తా'' అంటూ మంగమ్మ శపథం చేశాడు . అయితే అఫ్రిది వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందించారు. ప్రధాన జట్టుకు సమాంతరంగా మరో జట్టును తయారుచేయడం పాకిస్తాన్ కు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ ప్రపంచ క్రికెట్ లో అది పాత చింతకాయ పచ్చడిలానే ఉంది. ఇంగ్లండ్ (ఈసీబీ), ఇండియా (బీసీసీఐ) ఇవి కొద్దికాలంగా అమలుపరుస్తున్న విధానాలే.ఏకకాలంలో ఆ జట్లు రెండు దేశాలతో ఆడేంత సామర్థ్యం సాధించుకున్నాయి. షాహిన్ అఫ్రిది గాయంతో తప్పుకోవడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో షాహిన్ తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షాలు కూడా చివరి రెండు టెస్టులకు దూరమయ్యారు. దీంతో అంతగా అనుభవం లేని బౌలర్లతో పాకిస్తాన్ బరిలోకి దిగి సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈ ప్రయత్నంలో అఫ్రిది ఏ మేరకు విజయవంతమవుతాడనేది వేచి చూడాల్సిందే. చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే? ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్‌లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు పీసీబీ తన ట్విటర్లో ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీసీబీలో ప్రక్షాళన జరుగుతుంది. త్వరలోనే పాక్ జట్టులోనూ ఆటగాళ్ల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. బాబర్ ఆజంను త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన షాహిద్ అఫ్రిది పాక్ తరపున అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 22 ఏళ్ల లాంగ్ కెరీర్లో అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2009 టి20 వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టులో అఫ్రిది సభ్యుడిగా ఉన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ కూడా పాక్ తరపున మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 1996 నుంచి 2013 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్ రజాక్ 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇఫ్తికర్ అంజూమ్ పాక్ తరపున 62 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. PCB Management Committee has appointed former Pakistan captain Shahid Afridi as the interim Chair of the Men’s National Selection Committee. Other members of the panel are: Abdul Razzaq and Rao Iftikhar Anjum. Haroon Rashid will be the Convener. — Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022 -
దినేష్ కార్తీక్ కెరీర్ క్లోజ్..!
-
విండీస్ చీఫ్ సెలక్టర్‌గా బ్యాటింగ్ దిగ్గజం
వెస్టిండీస్ క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం డెస్మండ్ హేన్స్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జాతీయ జట్లను ఎంపిక చేసే చీఫ్ సెలక్టర్‌గా నియమించింది. రోజర్ హార్పర్ స్థానంలో 65 ఏళ్ల హేన్స్ సెలక్షన్ పగ్గాలు చేపట్టనున్నారు. జూన్ 2024 వరకు రెండున్నరేళ్ల పాటు ఆయన ఈ పదవీలో ఉంటారు. 1978 నుంచి 1994 వరకు అంతర్జాతీయ కెరీర్లో కొనసాగిన హేన్స్ 238 వన్డేలు, 116 టెస్టులాడి 16,135 పరుగులు చేశారు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్
ముంబై: ఐపీఎల్లో రాణించడంతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిందని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. సుందర్ గాయపడటంతో ఆఫ్ స్పిన్నర్ కొరత ఏర్పడిందని, దాంతో అశ్విన్‌ను తీసుకోవడం అనివార్యమైందని పేర్కొన్నాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమని తెలిపిన చేతన్ శర్మ.. అతను జట్టుకు పెద్ద ఆస్తి అని పేర్కొన్నాడు. కాగా, అశ్విన్ 2017 జూలైలో వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్లో అతని నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. గతేడాది ఐపీఎల్లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసిన యాష్.. ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది తొలిదశ ఐపీఎల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన యాష్.. కరోనా నేపథ్యంలో కుటుంబంతో కలిసుండాలని లీగ్ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17న ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపిక కాగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ధోనిని ఈ ప్రపంచకప్‌లో టీమిండియా మెంటర్‌గా బీసీసీఐ నియమించింది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా బెదిరింపులు -
‘చీఫ్ సెలెక్టర్’ పదవికి మిస్బా గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ బుధవారం ప్రకటించాడు. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా సమాచారమిచ్చానని వెల్లడించాడు. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పూర్తిగా సేవలందించేందుకే సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ‘రానున్న జింబాబ్వే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంతో సెలెక్టర్‌గా నా పని ముగుస్తుంది. ఆ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారిస్తా. నా నిర్ణయంలో బోర్డు ప్రమేయం లేదు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని తెలిసింది. అందుకే కోచ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నా’ అని మిస్బా వివరించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ జట్టు సెలెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా మిస్బా నియమితుడయ్యాడు. -
ఈ పదవి ఓ గౌరవం: చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు మరోసారి సేవ చేయడానికి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రూపంలో అవకాశం లభించిందని... దీనిని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి వ్యాఖ్యానించారు. 49 ఏళ్ల జోషిని చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘మన దేశానికి మరోసారి సేవ చేయడానికి దక్కిన గౌరవంగా, హక్కుగా ఈ పదవిని నేను భావిస్తున్నాను. నన్ను బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసిన సీఏసీ ప్యానల్ సభ్యులైన మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లకు కృతజ్ఞతలు’ అని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన జోషి 1996–2001 మధ్య సాగిన తన కెరీర్లో 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. అనంతరం హైదరాబాద్, యూపీ, జమ్మూ కశ్మీర్ జట్లకు కోచ్‌గా... 2017 నుంచి 2019 ప్రపంచ కప్ వరకు బంగ్లాదేశ్ జట్టుకు... 2019 జులై నుంచి కొన్ని నెలలపాటు అమెరికా జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తన సేవలను అందించారు. -
ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో సునీల్ జోషి
సాక్షి, ముంబై: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సునీల్ జోషీ నియమితులయ్యారు. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సునీల్ జోషి పేరును బీసీసీఐకి సిఫార్సు చేసింది. బుధవారం సమావేశమైన సీఏసీ సెలక్టర్ పదవికి దరఖాస్తులు చేసుకున్న వారిని తుది ఇంటర్వ్యూలు చేసింది. వెంకటేశ్ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ సునీల్ వైపే సీఏసీ మొగ్గు చూపడంతో అతడికే చీఫ్ సెలక్టర్ పదవి వరించింది. సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేసర్ హర్విందర్ సింగ్‌కు సీఏసీ అవకాశం కల్పించింది. స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఈ నూతన ఛైర్మన్ ఆధ్వర్యంలోని కమిటీనే టీమిండియాను ఎంపిక చేయనుంది. బుధవారం చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక నేపథ్యంలో సీఏసీ మంగళవారమే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలను కలిసి మార్గదర్శకాలను తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మరోసారి భేటీ అయిన సీఏసీ అజిత్ అగార్కర్ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో కర్ణాటక మాజీ ప్లేయర్స్ వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషీలపై పోటీ ఏర్పడింది. చివరికి సునీల్ జోషీనే సీఏసీ ఎంపిక చేసింది. ఇక సునీల్ 1996-2001 మధ్య కాలంలో టీమిండియా తరుపున ప్రాతినిథ్య వహించాడు. 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. చదవండి: అజిత్ అగార్కర్‌కు నిరాశ 'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది' -
‘కుంబ్లేను చీఫ్ సెలక్టర్‌గా చూస్తాం!’
న్యూఢిల్లీ: టీమిండియా లెజండరీ బౌలర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేను భవిష్యత్‌లో జాతీయ చీఫ్ సెలక్టర్‌గా చూస్తామని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. ఆ పదవికి కుంబ్లే అన్ని విధాల అర్హుడని స్పష్టం చేశాడు. బుధవారం ఓ సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘2007-08లో ఆస్ట్రేలియా సిరీస్‌కు తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాను. మ్యాచ్ రోజు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న నా దగ్గరికి వచ్చి ఇంకో రెండు సిరీస్‌ల వరకు నువ్వు జట్టుతోనే ఉంటావు. స్వేచ్చగా ఆడు.. అంటూ ప్రొత్సహించాడు. ఇలా ఓ ఆటగాడిపై సారథిగా అంత కాన్ఫిడెంట్ ఉండటం మామూలు విషయం కాదు. ఇక సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజాలతో ఆడాడు, అదేవిధంగా యువ క్రికెటర్లను ఎంతగానో ప్రొత్సహిస్తున్నాడు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి కుంబ్లేను సెలక్టర్‌గా చూడటానికి? నన్ను ఎవరూ కోరలేదు 2017లో బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి నన్ను ప్రత్యేకంగా కోరడంతోనే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాను. కానీ ఈ సారి ఎవరూ నన్ను అడగలేదు అందుకే దరఖాస్తు చేయలేదు. ఇక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే మ్యాచ్ సమీకరణాలు వేరేలా ఉండేవి. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కొన్ని వ్యూహాలు బెడిసికొడతాయి. ఇక శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేయడం సంతోషకరం. త్వరలో టీమిండియా తరుపున ఆడాలని ఆకాంక్షిస్తున్నా’అంటూ సెహ్వాగ్ వివరించాడు. ఇక ప్రస్తుత సెలక్షన్ బృందంపై అన్ని వైపులా విమర్శలు వస్తున్న తరుణంలో సెహ్వాగ్ వ్యాఖ్యలు ఆసక్తి నెలకొన్నాయి. ప్రస్తుతమున్న సెలక్టర్లలో ఒక్కరు కూడా సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన వారు కాదని, 15కి మించి వన్డే/టెస్టులు ఆడలేదని మాజీ క్రికెటర్లు విమర్శించిని విషయం తెలిసిందే. దీంతో సెలక్టర్ల కాంట్రాక్టు ముగుస్తున్న తరుణంలో బీసీసీఐ వారిని కొనసాగిస్తుందా లేదా వేరే ఎవరైనా దిగ్గజాలకు అవకాశం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి. -
నిఖత్ జరీన్‌కు షాక్!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ పెద్ద టోర్నీలలో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశలపై భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పంచ్ విసిరింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్న ఆమెను ఊహించని విధంగా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో నిఖత్ పాల్గొనకుండా స్వయానా చీఫ్ సెలక్టర్ రాజేశ్ భండారి నిరోధించారు. నిఖత్ ఈవెంట్ అయిన 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్‌ను బీఎఫ్ఐ ఎంపిక చేసింది. ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మేరీకోమ్‌ను ఎంపిక చేసినట్లు బీఎఫ్ఐ ప్రకటించింది. మేరీకోమ్ ఈ ఏడాది ఇండియన్ ఓపెన్‌తో పాటు ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరిగిన ట్రయల్స్‌లో వన్లాల్ దువాతితో నిఖత్ తలపడాల్సి ఉంది. అయితే బౌట్ ఆరంభానికి కొద్దిసేపు ముందు ఈ పోరు జరగడం లేదని ఆమెకు భండారి చెప్పారు. బుధవారం జరగవచ్చని ఆశించినా... జాబితాలో ఆమె పేరు, కేటగిరీలే కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఈ నిజామాబాద్ బాక్సర్ దిగ్భ్రాంతికి గురైంది. ట్రయల్స్ నిర్వహించండి... తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ నిఖత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ యూత్ బాక్సింగ్ రజత, సీనియర్ ఆసియా కాంస్య పతక విజేత అయిన ఆమె తన సమస్యను, బాధను వెల్లడిస్తూ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. ఇటీవలే నిఖత్ థాయ్‌లాండ్‌లో జరిగిన టోర్నీలో కూడా రజతం సాధించింది. ‘ఇది చాలా ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. చిన్న వయసులోనే నేను ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగకుండా రక్షిస్తున్నామని, మంచి భవిష్యత్తు కోసం నా మేలు కోరుతున్నామని సెలక్టర్లు నాతో చెప్పారు. అయితే 2016లోనే ఈ టోర్నీలో పాల్గొన్న నేను ఇప్పుడు చిన్నదాన్ని ఎలా అవుతాను. కాబట్టి నన్ను ఆపేందుకు వయసు మాత్రమే కారణం కాదు. మీ ఆధ్వర్వంలో పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక నిబంధన నిజంగా ఉంటే అది బాక్సర్ల స్థాయి, ఘనతను బట్టి కాకుండా అందరికీ వర్తింపజేయాలి. బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించవద్దు. అందుకే మీ జోక్యం కోరుతున్నాను’ అని 23 ఏళ్ల నిఖత్ ఆ లేఖలో పేర్కొంది. సరైన నిర్ణయమే: భండారి నిఖత్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ భండారి సమర్థించుకున్నారు. భారత్ పతకావకాశాలు మెరుగ్గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బీఎఫ్ఐ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ను ఎంపిక చేశాం. ఆమె కోచ్ కూడా మాకు ఒక అభ్యర్థన పంపారు. దానిని పరిశీలించిన తర్వాత ట్రయల్స్ లేకుండానే ఎంపికయ్యేందుకు మేరీకోమ్‌కు అర్హత ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇటీవల ఇండియా ఓపెన్‌లో నిఖత్‌ను కూడా ఆమె ఓడించింది. జాతీయ శిబిరంలో కూడా అందరికంటే మెరుగ్గా కనిపించింది. నిఖత్ కూడా చాలా మంచి బాక్సర్. భవిష్యత్తులో ఆమెకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రదర్శన, అనుభవంపైనే మేరీకోమ్‌ని ఎంపిక చేశాం’ అని భండారి వివరించారు. మేరీకోమ్గీనిఖత్ మే నెలలో గువాహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో నిఖత్‌పై మేరీకోమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ‘నాకు స్ఫూర్తిగా నిలిచిన బాక్సర్తో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆమె వ్యూహాలను పసిగట్టి గట్టి పోటీనిస్తా’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అంత వివాదం ఏమీ లేదు. కానీ ఎందుకో మేరీకోమ్ అహం దెబ్బతిన్నట్లుంది! లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం తనకంటే ఎంతో జూనియర్ అయిన నిఖత్‌పై మ్యాచ్ తర్వాత ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ‘ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను చా లా ఏళ్లుగా ఆడుతున్నాను. నన్ను ఆమె సవాల్ చేస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చింది. నాకు ఆశ్చర్యంతో పాటు చికాకు కలిగింది. ముందు నిన్ను నువ్వు రింగ్‌లో నిరూపించుకో. ఆ తర్వాత నాపై వ్యాఖ్యలు చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయి లో ఒక్క పతకం గెలిచిన ఆమెకు ఇంత అహం అవసరమా? నాతో పోటీ పడటం ఆమె అదృష్టం’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిఖత్ కెరీర్ ఆరంభం నుంచి 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతోంది. మొదటి నుంచి 48 కేజీల విభా గంలో ఆడిన మేరీ కోమ్ దానిని ఒలింపిక్స్ నుంచి తప్పించడంతో ఇండియా ఓపెన్‌తోనే 51 కేజీలకు మారింది. దాంతో నిఖత్ అవకాశాలు దెబ్బతింటున్నాయి. నాటి ఘటనకు, ఇప్పుడు నిఖత్‌ను అడ్డుకోవడానికి సంబంధం ఉండవచ్చని బాక్సింగ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. -
పాక్ చీఫ్ సెలక్టర్‌గా ఇంజమామ్ వుల్-హక్!
కరాచీ: ఆఫ్గనిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్కు సొంతగడ్డ నుంచి పిలుపువచ్చింది. పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ వుల్-హక్‌ను నియమించాలని పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది చివరి వరకు ఆఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు తో ఇంజమామ్‌కు కాంట్రాక్టు ఉంది. ఇంజమామ్‌ను కాంట్రాక్ట్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పాక్ బోర్డు నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని అఫ్గనిస్తాన్ బోర్డు తెలిపింది. ఇంజమామ్ నేతృత్వంలో ఆఫ్గనిస్థాన్ క్రికెట్ జట్టు రాటుదేలి, వరల్డ్ కప్ టీ20లో తన సట్టాచాటింది. సూపర్10లో ప్రవేశించడమే కాకుండా తాము ఆడిన చివరి మ్యాచ్‌లో వెస్టిండిస్ పై నెగ్గి దుమ్మురేపింది. పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ టీమ్ కు కోచ్‌గా ఇంతకు ముందు అతడికి అవకాశం వచ్చింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు తిరస్కరించాడు.