![West Indies Batting Great Desmond Haynes Named New Chief Selector Of Team - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/8/west-indies.jpg.webp?itok=To8jbw7z)
PC: WI Cricket
వెస్టిండీస్ క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం డెస్మండ్ హేన్స్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జాతీయ జట్లను ఎంపిక చేసే చీఫ్ సెలక్టర్‌గా నియమించింది. రోజర్ హార్పర్ స్థానంలో 65 ఏళ్ల హేన్స్ సెలక్షన్ పగ్గాలు చేపట్టనున్నారు. జూన్ 2024 వరకు రెండున్నరేళ్ల పాటు ఆయన ఈ పదవీలో ఉంటారు. 1978 నుంచి 1994 వరకు అంతర్జాతీయ కెరీర్‌లో కొనసాగిన హేన్స్ 238 వన్డేలు, 116 టెస్టులాడి 16,135 పరుగులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment