cricket team
-
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
క్రికెట్ జట్టు కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిడ్ దాఖలు
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.100-బాల్ ఫార్మాట్‌తో ‘ది హండ్రెడ్’100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.ఇదీ చదవండి: ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలుటెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తిసుందర్ పిచాయ్‌కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. -
సీనియర్లకు షాక్!.. అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందే
-
అమెరికా జట్టులో కోరీ అండర్సన్
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కివీస్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20లు ఆడిన అండర్సన్ ఆఖరిసారిగా 2018లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2014లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో)తో వెలుగులోకి వచ్చిన అతను ఆ తర్వాత 2015లో వరల్డ్ కప్ ఫైనల్ చేరిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. కెనడాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన అమెరికా టీమ్‌లో అండర్సన్‌కు చోటు దక్కింది. అయితే ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లి అక్కడి మైనర్ లీగ్‌లో భారీగా పరుగులు సాధించినా...భారత అండర్–19 విజేత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. మరో వైపు భారత దేశవాళీ క్రికెట్లో రాణించిన హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్లు కూడా టీమ్‌లో అవకాశం దక్కించుకున్నారు. -
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్‌గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్‌లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్‌లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్‌గా సచిన్‌తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్‌గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్‌లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్‌తో కలిసిన అండర్సన్ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్‌తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్‌పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్‌బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్‌లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్‌ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్‌గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్‌లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్‌గా నిలిచింది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్‌తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్‌లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్‌టౌన్‌లో 5 వికెట్లు, అడిలైడ్‌లో 5 వికెట్లు, 2012లో నాగ్‌పూర్‌లో భారత్‌పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్‌కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్‌లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్‌గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్‌కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్‌లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్‌వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది. -
"ఈ సలా కప్ నమ్మదు.."
-
Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్‌కు కుట్రలు
జైపూర్: దేశమంతటా ఎక్కడ చూసినా క్రికెట్ ప్రపంచకప్ ముచ్చట్లే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ తీరును క్రికెట్ టీమ్‌తో పోల్చారు. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేసుకొనేందుకు గత ఐదేళ్లుగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా ఆ పారీ్టలో నేతల మధ్య రగులుతున్న అంతర్గత విభేదాలను, సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరును ప్రస్తావించారు. వారు పరుగులు చేయడానికి బదులు, సొంత టీమ్‌లోని ప్రత్యర్థులను పడగొట్టాలని చూశారని చెప్పారు. వారి టీమ్ సరిగ్గా లేనప్పుడు ఇక ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు వల్ల దేశంలో యువతకు ఎదిగే అవకాశాలు రాలేదని చెప్పారు. పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం.. రాజస్తాన్‌లో బీజేపీకి అధికారం అప్పగిస్తే అవినీతిపరుల భరతం పడతామని, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఎంత దూరంగా ఉంటే రాజస్తాన్‌కు అంత మేలు జరుగుతుందని, భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రజలకు సూచించారు. వెలుతురికి, చీకటికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే మంచికి, కాంగ్రెస్‌కు మధ్య కూడా ఉందని అన్నారు. రాష్ట్రంలో జల జీవన్ మిషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకంలోనూ నిధులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, అభివృద్ధి అనేవి పరస్పరం శత్రువులని, ఆ శత్రుత్వం ఎప్పటికీ కొనసాగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పేపర్ లీక్ మాఫియా యువత భవిష్యత్తును లక్షలాది రూపాయలకు అమ్మేసిందని ధ్వజమెత్తారు. ఎరువుల కుంభకోణంతో రైతులను విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పాలనలో ధరలు భారీగా పెరిగిపోయానని మోదీ గుర్తుచేశారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.13 అధికంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరలను సమీక్షిస్తామని, ప్రజలకు ఊరట కలి్పస్తామని వెల్లడించారు. కొన్నేళ్లలో అన్ని రంగాల్లోనూ భారత్ అద్భుతాలు చేసిందన్నారు. ఎటు చూసినా నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్‌మెన్: ప్రధాని మోదీ
Rajasthan Elections: క్రికెట్‌కు ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నాయకులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విమర్శలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్.. తమను తామే రనౌట్ చేసుకునే క్రికెట్ జట్టు లాంటిదని, తమ బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు రనౌట్ చేసుకోవడానికి ఐదేళ్లు ప్రయత్నించారని మోదీ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ చురు జిల్లా తారానగర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అనేవి పరస్పర శత్రవులని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీకి మంచి ఉద్దేశాలు ఉండవని, వాటి మధ్య ఉన్న సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉన్న సంబంధం లాంటిదన్నారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విషయంలో కాంగ్రెస్ మాజీ సైనికులను దశాబ్దాలుగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా రాజస్థాన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అదుపుతప్పాయని విమర్శించారు. ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు -
ఐపీఎల్ లో ఆంధ్రప్రదేశ్ !
-
క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్ చరణ్, ఐపీఎల్లోనా?
ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇమేజ్ ప్రపంచస్థాయికి చేరింది. మెగాస్టార్ వారసుడిగానే అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్‌చరణ్ కేవలం హీరోగానే కాదు వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ మెగా హీరోకి పోలో టీమ్ ఉండగా.. ట్రూజెట్ పేరుతో ఎయిర్‌లైన్స్ రంగంలోనూ అడుగుపెట్టాడు. సహజంగా స్పోర్ట్‌పైనా ఇంట్రెస్ట్ ఉండే రామ్‌చరణ్ ఇప్పుడు క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. చెర్రీ ఐపీఎల్లో టీమ్ కొనుగోలు చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే టీమ్‌గా ఉంది. ఇది కూడా తమిళనాడుకు చెందిన కావ్యా మారన్ ఓనర్‌గా ఉంటే.. ఏపీ నుంచి మాత్రం ఐపీఎల్లో ఫ్రాంచైజీ ప్రాతినిథ్యం లేదు. దీంతో రామ్‌చరణ్ ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి వైజాగ్ వారియర్స్ అనే పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఐపీఎల్లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదు. గత ఏడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీలను బడా వ్యాపారవేత్తలు దక్కించుకున్నారు. గుజరాత్ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్స్, లక్నో టీమ్‌ను సంజీవ్ గోయెంకా టీమ్ వేలంలో కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పట్లో ఈ సంఖ్యను మరింత పెంచే ఉద్ధేశమైతే బీసీసీఐకి లేదు. దీంతో రామ్‌చరణ్ ఐపీఎల్లో టీమ్ ఎలా కొనుగోలు చేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రామ్‌చరణ్ కొనబోయేది ఐపీఎల్ కాదు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అనీ తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏపీలో యువక్రికెటర్లను ప్రోత్సహించే ఉద్ధేశంతో గత ఏడాది ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. తొలి సీజన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్‌లో పలువురు వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. ఆరు జట్లతో గత ఏడాది జరిగిన సీజన్ ద్వారా పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. రామ్‌చరణ్ ఏపీఎల్‌లో ఉన్న వైజాగ్ వారియర్స్ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. దీనిపై వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్లతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ శ్రీనుబాబు, నరేంద్ర రామ్, సీఈవో భరణిలని మీడియా వర్గాలు ప్రశ్నించగా... రామ్‌చరణ్ లాంటి స్టార్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో భాగమయితే చాలా సంతోషిస్తామనీ, లీగ్‌కు, ఇందులో ఆడుతున్న యువ ఆటగాళ్లకు ఇది ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైజాగ్ వారియర్స్ సీఈవో భరణి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువ ఆటగాళ్ళకు ఏపీఎల్ గొప్ప వేదిక అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి లీగ్‌లో రామ్‌చరణ్ లాంటి టాప్ హీరో ఎంట్రీ ఇస్తే గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఏడాదిన్నర ఇంట్లోనే కూర్చున్నా: బెల్లంకొండ హీరో -
IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
హరారే: ఇప్పటికే 2–0తో సిరీస్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ రాణించి జింబాబ్వేను కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ ఆకట్టుకోగా... తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో రాణించి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నారు. రెండు వన్డేల్లో టాస్ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కెప్టెన్ రాహుల్ ఈసారి టాస్ గెలిస్తే భారత బ్యాటర్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఆఖరి వన్డేలో భారత టీమ్ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్‌కు తొలిసారి అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరోవైపు జింబాబ్వే జట్టు అన్ని విభాగాల్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. సొంతగడ్డపై భారత జట్టుపై 2010లో చివరిసారి వన్డేలో గెలిచిన జింబాబ్వే మళ్లీ గెలుపు రుచి చూడాలంటే అద్భుతమే చేయాల్సి ఉంటుంది. -
విండీస్ చీఫ్ సెలక్టర్‌గా బ్యాటింగ్ దిగ్గజం
వెస్టిండీస్ క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం డెస్మండ్ హేన్స్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జాతీయ జట్లను ఎంపిక చేసే చీఫ్ సెలక్టర్‌గా నియమించింది. రోజర్ హార్పర్ స్థానంలో 65 ఏళ్ల హేన్స్ సెలక్షన్ పగ్గాలు చేపట్టనున్నారు. జూన్ 2024 వరకు రెండున్నరేళ్ల పాటు ఆయన ఈ పదవీలో ఉంటారు. 1978 నుంచి 1994 వరకు అంతర్జాతీయ కెరీర్లో కొనసాగిన హేన్స్ 238 వన్డేలు, 116 టెస్టులాడి 16,135 పరుగులు చేశారు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
IND Vs NZ 1st Test: ప్రాక్టీస్‌లో చమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు
-
క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్
Queensland Cricketer Jimmy peirson Cricket Kit Stolen: క్రికెట్ జట్టుపై దొంగలు దాడి చేసి, అందులోని క్రికెట్ సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో చోటుచేసుకుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియాతో మ్యాచ్‌కు ముందు క్వీన్స్‌ల్యాండ్ జట్టు వాహనంపై దొంగలు దాడి చేసి క్రికెట్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని అపహరించారు. క్వీన్స్‌ల్యాండ్ జట్టు బస చేసే హోటల్ పార్కింగ్‌లో ఉన్న వాహనం అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. ఆ జట్టు వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్కు చెందిన రెండు బ్యాట్లతో పాటు ఇతర క్రికెట్ సామాగ్రిని దొంగిలించారు. View this post on Instagram A post shared by Jimmy Peirson (@jimmypeirson) ఈ విషయాన్ని పియర్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. తన సరికొత్త గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్లు చోరీ అయ్యాయని, ఎవరికైనా దొరికితే తనకు తెలియజేయాలంటూ రాసుకొచ్చాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు.. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్వీన్స్‌ల్యాండ్-టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 30న బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉండింది. అయితే, బ్రిస్బేన్ నగరంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. చదవండి: విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..! -
పాక్ టూర్ ను అర్దాంతరంగా రద్దు చేసుకున్న న్యూజిలాండ్
-
స్టార్ క్రికెటర్ల వంతపాట ఆగాలి
న్యూఢిల్లీ: క్రికెట్ జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. జట్టుపై తన అభిప్రాయాలను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు ఈ–మెయిల్లో తెలియజేశారు. ఏ ఒక్క క్రికెటర్ పేరు చెప్పకపోయినా... జట్టులో ప్రస్తుతమున్న స్టార్ క్రికెటర్ అనే సంస్కృతి మారాలని గట్టిగా లేఖలో సూచించినట్లు తెలిసింది. బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్ రామన్ ఈ–మెయిల్ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. స్టార్ సంస్కృతి జట్టుకు చేటు చేస్తోందని రామన్ చెప్పినట్లు తెలిసింది. దీనిపై అధ్యక్షుడు గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం 42 ఏళ్ల రమేశ్ పొవార్‌కు మళ్లీ అమ్మాయిల కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. 2018లో కోచ్‌గా పనిచేసిన పొవార్... మిథాలీతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. -
కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా
ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. గతేడాది కరోనా పరిస్థితుల నడుమ(మార్చి నెలలో) కోచ్ బాధ్యతలు చేపట్టిన ఈ దేశవాళీ పరుగుల యంత్రం.. ఏడాది తిరిగేలోపే పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని ఆకస్మిక నిర్ణయానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడం ఉత్తరాఖండ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. అతని రాజీనామాను మాత్రం ఆమోదించలేదు. కాగా, వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. -
అఫ్గాన్ క్రికెటర్ల ప్రాక్టీస్
కాబూల్: రెండు నెలల విరామం తర్వాత అఫ్గానిస్తాన్ క్రికెటర్లు తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక్కడి కాబూల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నుంచి ఆరంభమైన ప్రాక్టీస్ సెషన్లో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీతో పాటు పలువురు ఆటగాళ్లు పాల్గొన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ ఆటగాళ్లు మరింత మెరుగవడానికి, మైదానంలో జట్టుగా సమష్టి ప్రదర్శన ఇచ్చేందుకు ఈ సెషన్ ఉపయోగపడుతుందని ఏసీబీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో నెలరోజుల పాటు సాగే ఈ సెషన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాలకు లోబడే నిర్వహించనున్నట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా శనివారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి తమ ఆటగాళ్లతో పాటు బోర్డు అధికారులను చైతన్య పరిచింది. ఈ ఏడాది అఫ్గానిస్తాన్ అక్టోబర్‌లో టి20 ప్రపంచకప్, నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
విజయం దిశగా ఆంధ్ర
సాక్షి, ఒంగోలు: హైదరాబాద్‌తో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం దిశగా సాగుతోంది. ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో ఓవర్‌నైట్ స్కోరు 237/1తో సోమవారం ఆట కొనసాగించిన ఆంధ్ర... తమ తొలి ఇన్నింగ్స్‌ను 153 ఓవర్లలో 8 వికెట్లకు 489 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 264 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. రెండో రోజు పూర్తిగా చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు మూడో రోజు ఫర్వాలేదనిపించారు. ఆట ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ప్రశాంత్ కుమార్ (119; 15 ఫోర్లు, సిక్స్), హనుమ విహారి (55; 7 ఫోర్లు)లతో పాటు శ్రీకర్ భరత్ (5; ఫోరు)ను 20 పరుగుల తేడాలో పెవిలియన్‌కు చేర్చి ఆంధ్రను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసేలా కనిపించారు. ఈ సమయంలో రికీ భుయ్ (69; 11 ఫోర్లు), కరణ్ షిండే (94; 13 ఫోర్లు) హైదరాబాద్ బౌలర్ల దూకుడును అడ్డుకున్నారు. వీరు బాధ్యతాయుతంగా ఆడుతూ ఐదో వికెట్‌కు 161 పరుగులు జోడించడంతో ఆంధ్రకు భారీ ఆధిక్యం ఖాయమైంది. సెంచరీ చేసేలా కనిపించిన కరణ్‌ను మెహదీ హసన్ బౌల్డ్ చేశాడు. చివర్లో శశికాంత్ (31; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ (3/150) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హైదరాబాద్‌ను పైడికాల్వ విజయ్ కుమార్ (3/8) దెబ్బ తీయడంతో ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ తన్మయ్ (20 బ్యాటింగ్), జావీద్ అలీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే హైదరాబాద్ మరో 219 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు. -
60 ఏళ్లకు మించరాదు!
ముంబై: భారత క్రికెట్ జట్టు కొత్త శిక్షకుల వేటలో పడింది. టీమ్ హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కొత్తగా దరఖాస్తులు కోరింది. వీటితో పాటు ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటర్ మేనేజర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు ఈ నెల 30ని తుది గడువుగా నిర్ణయించింది. ప్రస్తుతం పని చేస్తున్న సహాయక సిబ్బంది పదవీకాలం వాస్తవానికి ప్రపంచ కప్‌తోనే ముగిసింది. అయితే వెంటనే వెస్టిండీస్ పర్యటన ప్రారంభం అవుతుండటంతో వారికి మరో 45 రోజుల పొడిగింపు లభించింది. బీసీసీఐ ఈ సారి హెడ్ కోచ్ పదవి విషయంలో వయోపరిమితిని విధించడం విశేషం. దరఖాస్తు చేసే వ్యక్తి 60 ఏళ్లకు మించరాదని నిబంధన విధించింది. దీంతోపాటు కొన్ని ప్రధాన అర్హతలను సూచించింది. ప్రధాన టెస్టు జట్టుకు కనీసం రెండేళ్లు ప్రధాన కోచ్‌గా పని చేసి ఉండాలని లేదా అసోసియేట్ జట్టు లేదా ఐపీఎల్ జట్టుకైనా కనీసం మూడేళ్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టింది. 30 టెస్టు మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. లేదంటే బీసీసీఐ లెవల్–3 కోచింగ్ సర్టిఫికెట్ ఉండాలనేది నిబంధన. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే సిరీస్ నుంచి జట్టుతో ఉన్నారు. అదే సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ జట్టుతో చేరినా... కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో అతను పదవి కోల్పోయాడు. అయితే రవిశాస్త్రి మళ్లీ కోచ్‌గా వచ్చాక అరుణ్‌ను తన బృందంలో చేర్చుకున్నాడు. జూలై 2015 నుంచి ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫార్హర్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు టీమిండియాతో కలిసి పని చేస్తున్నారు. వీరిద్దరి శ్రమ వల్లే భారత జట్టు ఫిట్నెస్పరంగా అత్యున్నత ప్రమాణాలు అందుకోగలిగింది. వీరిద్దరి కాంట్రాక్ట్ సైతం ప్రపంచ కప్‌తోనే ముగియగా... మళ్లీ కొనసాగటానికి ఆసక్తి చూపించలేదు. దాంతో కొత్తవారి ఎంపిక ఖాయమైంది. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా ఉన్న సునీల్ సుబ్రమణ్యన్ స్థానంలోనూ మరొకరి నియామకానికి బోర్డు దరఖాస్తులు కోరింది. కొత్తగా ఎంపికయ్యే సహాయక సిబ్బంది పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 24, 2021 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌తో వీరంతా తమ బాధ్యతలు చేపడతారు. అక్టోబర్ 22 వరకు బోర్డు బాధ్యతలు నిర్వర్తించనున్న క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)నే ఈ మొత్తం నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. శాస్త్రి కొనసాగుతాడా..! కెప్టెన్ కోహ్లితో విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత 57 ఏళ్ల రవిశాస్త్రి జూలై 2017లో బాధ్యతలు చేపట్టాడు. అతని మార్గనిర్దేశనంలో భారత జట్టు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు ఓడినా, ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించింది. వన్డేల్లో కొంత కాలంగా అద్భుతమైన రికార్డును కొనసాగించిన టీమిండియా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు వచ్చేసరికి మాత్రం సెమీఫైనల్‌కే పరిమితమైంది. కోచ్‌గా పనితీరుపై గొప్ప ప్రశంసలేవీ పొందకపోయినా... కోహ్లితో సాన్నిహిత్యంతో పాటు జట్టు వరుస విజయాల కారణంగా శాస్త్రి కోచింగ్‌లో పెద్దగా లోపాలేమీ కనిపించలేదు. బాధ్యతలు తీసుకున్న సమయంలో శాస్త్రి లక్ష్యం కూడా వరల్డ్ కప్ అయి ఉండవచ్చు. టోర్నీ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. అతనికి బీసీసీఐ ఏడాదికి రూ. 8.20 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది! తాజాగా బోర్డు చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం పని చేస్తున్న సహాయక సిబ్బంది ఎవరూ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. తమంతట తాము తప్పుకుంటే తప్ప వారిని కూడా ఈ ప్రక్రియలో పరిశీలనలోకి తీసుకుంటారు. అయితే వీరంతా కొనసాగేందుకు ఇష్టపడతారా అనేదానిపై తమకు స్పష్టత లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పుడే ప్రపంచ కప్ ముగియగా, వచ్చే ఏడాది నవంబరులో గానీ టి20 ప్రపంచ కప్ స్థాయి టోర్నీ లేదు. భారత్‌కు సవాల్‌కు నిలిచే సిరీస్‌లు కూడా ఇప్పట్లో లేవు. కాబట్టి శిక్షణపై శాస్త్రికి అనాసక్తి ఉండవచ్చని సమాచారం. మరోసారి అతను వ్యాఖ్యానంపై ఆసక్తి చూపిస్తే భారత్ కొత్త కోచ్‌ను చూడవచ్చు. -
83.. భారత క్రికెట్లో ఒక మరుపురాని జ్ఞాపకం
న్యూఢిల్లీ : జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఈ తేదీ ఒక సంచలనం. భారత క్రికెట్ అభిమానులకు ఒక మరుపురాని జ్ఞాపకం. సరిగ్గా ఇదే తేదీన 36 ఏళ్ల కిందట కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు లార్డ్స్ మైదానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అభేద్యమైన వెస్టిండీస్ జట్టును ఫైనల్లో మట్టికరిపించి.. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. మొట్టమొదటి విశ్వ క్రికెట్ కిరీటాన్ని స్వదేశానికి సగర్వంగా తీసుకొచ్చింది. 36 వసంతాల కిందటి ఈ అద్భుత విజయమే.. భారత క్రికెట్‌ను సమూలంగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచకప్ విజయం ప్రపంచ క్రికెట్లో భారతదేశ ఉనికిని బలంగా చాటింది. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టమిది. 1983లో భారత జట్టుకు సరైన సదుపాయాలు కూడా లేవు. జట్టుకు కావాల్సిన అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో నాటి భారత క్రికెట్ బోర్డు ఉండేది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మానం చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి. భారత జట్టు ఈ అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత క్రికెటర్లను సన్మానించడానికి.. ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్లో సంగీత కచేరీ నిర్వహించి విరాళాలు సేకరించారు. ఇక, 1983నాటి ప్రపంచకప్ పరిస్థితులను పరిశీలిస్తే.. అప్పటివరకు ఏ అంచనాలు లేని కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి బలమైన దేశాలను మట్టికరిపించింది. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కు భారత జట్టును చేర్చడంలో కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. లీగ్‌మ్యాచ్‌లో జింబాబ్వేపై కపిల్ వీరోచితమైన ప్రదర్శనతో 175 పరుగులు చేసి భారత జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ప్రపంచకప్ ఫైనల్ రోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల టీవీలు, రేడియోల ముందు భారత అభిమానులు మ్యాచ్‌ను తిలకించారు. భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 183 పరుగులు చేసింది. భారత జట్టుకు ఉన్న మదన్ లాల్ , మోహిందర్ అమర్నాథ్ వంటి బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ పటిమతో వెస్టిండీస్‌ను 140 పరుగులకు ఆలౌట్ చేసి ప్రపంచకప్‌ను భారతదేశం ఒడిలోకి చేర్చి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. ఆ మధుర క్షణాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మనస్సుల్లో భద్రంగా ఉన్నాయి. -
వైకల్యం ఓడింది..
వారి ధృడ సంకల్పం ముచ్చట గొలిపింది.. వారి పట్టుదల ఆశ్చర్యం కలిగించింది.. వారి గెలుపు ఏ ప్రపంచ కప్పుకూ తీసిపోనిది.. వారి ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది. ఔను.. వారి మనోశక్తి ముందు వైకల్యం ఓడింది.. విధి వెక్కిరించినా వారిని విజయం వరించింది.. ఆదివారం నగరంలో జరిగిన దివ్యాంగుల క్రికెట్ రసవత్తరంగా సాగింది.. శరీరం సహకరించకపోయినా పట్టుదలగా ఆడిన ప్రతి ఒక్కరూ విజేతగా నిలిచారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానం వేదికగా ఆదివారం జిల్లాస్థాయి ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 30 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు, గతంలో అంతర్‌జిల్లాల క్రికెట్ టోర్నీలో రాణించిన క్రికెటర్లను తుది జట్టుకు పరిగణనలోకి తీసుకున్నారు. 15 మంది సభ్యులతో కూడిన జాబితాను జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, జి.అర్జున్‌రావురెడ్డి వెల్లడించారు. ఆటతీరు అదుర్స్.. సకలాంగులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆకట్టుకునే ఆటతీరుతో దివ్యాంగ క్రికెటర్లు రాణించారు. తమకే సాటివచ్చిన ఆటతీరుతో అలరించారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మంత్రముగ్ధులను చేసి భళా అనిపించారు. ఫీల్డింగ్‌లో మెరికల్లా కదిలారు. సిక్కోలు వేదికగా నార్త్‌జోన్ పోటీలు.. నార్త్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 12 నుంచి 14 వరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ టోర్నమెంట్ కోసం జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మైదానాన్ని పోటీలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెస్సార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సంఘ కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి పేర్కొన్నారు. నార్త్‌జోన్ దివ్యాంగుల సంఘం హెడ్ మధుసూదన్ ఇప్పటికే జిల్లా చేరుకున్నారు. జిల్లా జట్టు ఇదే.. బగ్గు రామకృష్ణ (కెప్టెన్– బలగ), సీహెచ్ అప్పలరాజు, ఐ.దిలీప్ (బలగ), బి.హిమగిరి (చిన్నకిట్టాలపాడు), ఎం.రాజు (సంతకవిటి), పి.రాజు, ఎం.ప్రసాద్ (రాజాం), ఎన్.నరేష్ (నరసన్నపేట), కె.రవి (పలాస), ఎ.సాయికుమార్, ఎస్.సాయిశేఖర్ (శ్రీకాకుళం), కె.శ్రీను (భామిని), కె.రాముజ (రణస్థలం), పి.తిరుపతిరావు, కె.నాగరాజు. స్టాండ్‌బైగా మోహనరావు, ఎం.ప్రసాద్ ఎంపికైనవారిలో ఉన్నారు. -
అండర్–19 మహిళల జట్టు కెప్టెన్‌గా త్రిష
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర అండర్–19 మహిళల వన్డే టోర్నమెంట్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా జి. త్రిష ఎంపికవగా... సువర్ణ లక్ష్మి కోచ్‌గా వ్యవహరించనున్నారు. వడోదరలో ఫిబ్రవరి 10 నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. రాష్ట్రజట్టుకు ఎంపికైన క్రీడాకారులందరూ ఫిబ్రవరి 1న మధ్యాహ్నం గం.2:30లకు జింఖానా గ్రౌండ్స్‌లో కోచ్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా హెచ్‌సీఏ పేర్కొంది. జట్టు వివరాలు: జి. త్రిష (కెప్టెన్), లక్ష్మి ప్రసన్న (వైస్ కెప్టెన్), జి.కె.శ్రావ్య, ఎం. మమత, వై. త్రిష పూజిత, కీర్తి రెడ్డి, హెన్రిత ఫ్లేవియా పెరీరా, మెర్లిన్ జాన్, పి. అలివేలు, పి. సువార్త, ఎన్. క్రాంతిరెడ్డి, ఫాతిమా, ఇషిత కోడూరి, బి. పరిమళ, సాక్షి రావు, సువర్ణ లక్ష్మి (కోచ్), అనా మరియా (మేనేజర్), జెస్సి (ఫిజియో). స్టాండ్ బైస్: లిఖిత నందిని, అద్వైత, శ్రీవల్లి, పూజశ్రీ, సౌమ్య. -
కొత్తపేట క్రికెట్‌కు 50 వసంతాలు
తూర్పుగోదావరి, కొత్తపేట: కొత్తపేటలో క్రికెట్ జట్టు ఏర్పడి, తొలిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. రిటైర్డ్ వీఆర్ఓ సలాది బ్రహ్మానందరావు (మునసబు బాబ్జి), రిటైర్డ్ పీఈటీ ముగ్గళ్ల గోపీనాథ్, సీడీ ప్రేమ్‌నాథ్ తదితరుల ఆధ్వర్యంలో మొదటి తరం క్రికెట్ జట్టు ఏర్పడింది. తద్వారా క్రికెట్ పోటీలు ప్రారంభమై, అంచెలంచెలుగా ఇక్కడ రూపుదిద్దుకున్న క్రీడా మైదానం క్రీడా పోటీలకు జిల్లా స్థాయిలోనే ప్రసిద్ధి గాంచింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం విశాలంగా ఉండేది. ఎత్తు పల్లాలు లేకుండా ఈ మైదానం పచ్చని తివాచీ పరిచినట్టుగా ఉండేది. అప్పట్లో ఈ గ్రౌండ్‌ను లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంతో పోల్చేవారు. ఆ బ్యాచ్ తరువాతి తరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ గౌస్, దేశవ్యాప్తంగా స్థిరపడిన విశ్రాంత ఉద్యోగులు, వివిధ హోదాల్లో ఉన్న చిర్రావూరి సత్యనారాయణ (ఐటీడీఏ అధికారి), ఉప్పులూరి కృష్ణమూర్తి (ఐఆర్ఎస్ అధికారి), విస్సాప్రగడ సూర్యనారాయణమూర్తి (సీఏ), దెందులూరి ప్రసాద్ (ఎస్బీఐ ఏజీఎం), కోటిపల్లి నటరాజ్ (రిటైర్డ్ హెచ్ఎంసీ అధికారి), భమిడిపాటి నరీన్ (రిటైర్డ్ హెచ్ఎం), భమిడిపాటి పాపయ్యశాస్త్రి (ఏబీఎం), భమిడిపాటి కొప్పయ్య (సైంటిస్ట్), కముజు సత్యనారాయణమూర్తి (వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి), విస్సాప్రగడ పేర్రాజు (ఏబీ బీఎం), బలుసు సాంబమూర్తి (ఖమ్మం భద్రాద్రి బ్యాంక్ ఎండీ), మిద్దే ఆదినారాయణ (టీడీపీ నాయకుడు) తదితరులు ఉండేవారు. మూడో తరం క్రీడాకారులు కూడా కొత్తపేటలో క్రికెట్ ఆటను కొనసాగించారు. దాంతో ఇక్కడ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. కాలక్రమేణా ఇక్కడి క్రికెట్ క్రీడాకారులు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట వలసలు పోయారు. మరికొందరు స్థానికంగా ఉన్నా యాంత్రిక జీవనంలో సమయం లేక ఈ ఆటకు దూరమయ్యారు. దాంతో ఇక్కడ క్రికెట్ క్రీడాకారుల సంఖ్య తగ్గిపోయింది. ఉన్న వారు కూడా టీవీలు, సెల్ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు అతుక్కుపోతున్నారు. కొందరు యువకులు అప్పుడప్పుడూ ఆడుతూ, స్థానిక స్థాయిలోనే పోటీలు నిర్వహిస్తున్నారు. నేడు మూడు తరాల క్రీడాకారులు ఆత్మీయ కలయిక కొత్తపేటలో క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో నాటి మూడు తరాల క్రికెట్ క్రీడాకారులందరూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14న కొత్తపేటలో కలుసుకుంటున్నారు. ‘కొత్తపేట క్రికెట్ స్వర్ణోత్సవ వేడుకలు’ నాటి క్రీడాకారుల ‘ఆత్మీయ కలయిక’ పేరుతో సుమారు 100 మందిని సమీకరించనున్నట్టు పూర్వ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ గౌస్ ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చామని, కొత్తపేట క్రీడా మైదానాన్ని వేదికగా చేసుకుని కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించనున్నామని చెప్పారు.1983లో అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన కొత్తపేట టీమ్ ఫొటోను ప్రదర్శించనున్నామని గౌస్ తెలిపారు. -
రోహిత్ కెప్టెన్.. కోహ్లికి నో ఛాన్స్
న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడల వెబ్సైట్ ఈఎస్పీఎన్ 2017 సంవత్సరానికి క్రికెట్ జట్లను ప్రకటించింది. గతేడాది గొప్పగా రాణించిన క్రికెటర్లతో మూడు ఫార్మాట్లకు టీమ్‌లను ఎంపిక చేసింది. ఆయా ఆటగాళ్లకు ఓట్లు వేయాలని వీక్షకులకు సూచించింది. ఈఎస్పీఎన్ ఎంపిక వన్డే జట్టుకు విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా పెట్టింది. టెస్టు టీమ్‌కు స్టీవ్ స్మిత్, టి20 జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అనూహ్యంగా టి20 టీమ్‌లో కోహ్లికి చోటు దక్కలేదు. టెస్టు జట్టులో కోహ్లి, చతేశ్వర్ పుజారా మాత్రమే ఉండగా, మన బౌలర్లు చోటు సంపాదించలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. వన్డే, టి20లోనూ చోటు దక్కించుకున్నాడు. వన్డే టీమ్‌లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. టెస్ట్ టీమ్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, పుజారా, విరాట్ కోహ్లి, షకీల్ అల్, ముషాఫిర్ రహీం, లియన్, రబడ, ఆండర్సన్, నీల్ వాగ్నర్ వన్డే జట్టు: కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, డీ కాక్, జోయ్ రూట్, బాబర్ అజామ్, హార్దిక్ పాండ్యా, స్టోక్స్, హసన్ అలీ, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ టి20 టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), లూయిస్, మెక్కల్లమ్, హాషిమ్ ఆమ్లా, బట్లర్, క్రిస్టియాన్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, హసన్ అలీ, జస్ప్రీత్ బుమ్రా -
చె(కొ)త్త రికార్డు సృష్టించారు
సాక్షి, స్పోర్ట్స్ : గత కొంత కాలంగా పరాజయాలతోపాటు సొంత ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న శ్రీలంక జట్టు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఒకే ఏడాది అన్ని ఫార్మట్లలో అత్యధిక ఓటములను మూటగట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ కేలండర్ ఇయర్లో మొత్తం 33 పరాజయాలను లంక జట్టు చవిచూసింది. వీటిలో 21 వన్డేలు ఉండటం విశేషం. గతంలో ఈ రికార్డు జింబాబ్వే పేరుపై ఉండగా, శ్రీలంక ఇప్పుడు ఆ స్థానంలో వచ్చి చేరింది. పాకిస్థాన్-శ్రీలంక మధ్య శుక్రవారం దుబాయ్‌లో జరిగిన రెండో టీ20 శ్రీలంక ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 124 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 125 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పాక్ ఓ బంతి మిగిలి ఉండగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఇదే మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాక్ సరికొత్త రికార్డును లిఖించింది. టీ20 చరిత్రలో వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కింది. కాగా, ఇదే జట్ల మధ్య ఇది వరకు జరిగిన వన్డే సిరీస్‌ను 5-–0 తేడాతో పాక్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. -
‘అనంత’కు చేరిన న్యూజిలాండ్ జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : న్యూజిలాండ్ జూనియర్స్ క్రికెట్ జట్టు అనంతకు చేరుకుంది. శనివారం నుంచి అనంత వేదికగా అనంతపురం, న్యూజిలాండ్ జట్ల మధ్య సన్నాహక క్రికెట్ పోటీలు జరగనున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన క్రికెట్ హాక్స్ క్లబ్, అనంతపురం జట్లు పోటీల్లో తలపడనున్నాయి. ఈ పోటీలు నేటి నుంచి 13 వరకు సాగనున్నాయి. అనంతపురం క్రీడాకారులతో స్నేహబంధం పెరిగేందుకు ఈ టోర్నీ తోడ్పడుతుందని న్యూజిలాండ్ జూనియర్స్ జట్టు కెప్టెన్ ఫ్రేజర్ మెక్ హాల్ తెలిపారు. శుక్రవారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో అనంతపురం జట్టు కెప్టెన్ వినీల్‌కుమార్, న్యూజిలాండ్ జట్టు మరో కెప్టెన్ జోష్ మెక్ ఆడ్లెతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ దేశంలో ఇండోర్ స్టేడియంలోనే క్రికెట్ పోటీలను నిర్వహిస్తారన్నారు. ఈ టోర్నీ ముగిసిన తరువాత కూడా తమ బంధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తామన్నారు. ఈ క్రికెట్ సీజన్లోనే అనంత జట్టును తమ దేశంలో క్రికెట్ పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు జట్టు కోచ్ రవి తెలిపారు. రాబోయే సీనియర్ జట్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు టామ్ బ్లాండర్, ఉడ్‌కుక్, రచిన్ రవీంద్ర (అండర్ 19 జట్టు కెప్టెన్)లు పాల్గొంటారన్నారు. ఆర్డీటీ హెడ్ కోచ్ షాహబుద్దీన్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం దొరికిందన్నారు. అంతర్జాతీయ క్రికెట్ జట్లను జిల్లాకు రíప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, న్యూజిలాండ్ కోచ్ నీరజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
భార్య డ్రెస్ వివాదంపై స్పందించిన షమీ!
దుస్తుల విషయంలో తన భార్య, కూతురికి భారత క్రికెటర్ మహమ్మద్ షమీ అండగా నిలిచాడు. ఈ నెల 23న తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను షమీ ఫేస్బుక్లో పోస్టు చేయగా.. దానిపై కొందరు విద్వేషం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకోగా.. కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. అసలు నువ్వు ముస్లింవేనా, ఇలాంటి దుస్తులు ఎలా వేసుకుంటావు? నీకు సిగ్గు లేదా? నీ భార్య బురఖా ఎందుకు ధరించలేదు? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో క్రికెటర్ మహ్మద్ కైఫ్ షమీకి అండగా నిలిచాడు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ స్పందిస్తూ.. 'ఈ ఇద్దరే నా జీవితం. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. (ఇతరులను వేలెత్తి చూపేముందు) మనలో మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో మొదట చూసుకోవాలి' అని షమీ పేర్కొన్నాడు. 'జీవితంలో అందరికీ కోరుకున్నది దొరకదు. అదృష్టవంతుల నుదుటన అది రాసిపెట్టి ఉంటుంది. లోలోపల కాలిపోయేవాళ్లు కాలిపోని' అంటూ విద్వేషకారులకు చురకలు అంటించారు. తన భార్య వేసుకున్న దుస్తులు ఇస్లాం మతానికి విరుద్ధమైనవి కావని పేర్కొన్నాడు. -
క్రికెట్ జట్టుకు తప్పిన ప్రమాదం!!
కరాచీ:పాకిస్తాన్ క్రికెటర్లు భూకంప ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ కు వచ్చిన పాక్ క్రికెటర్లకు భూకంపం తీవ్రమైన షాక్ గురి చేసింది. నీల్సన్‌లోని ఓ హోటల్లో క్రికెటర్లు బస చేస్తున్న సమయంలో స్థానికంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటు సునామీ వచ్చే అవకాశం కూడా ఉందనే హెచ్చరికలు పాక్ క్రికెటర్లను కలవరపెట్టాయి. అయితే ఆ హోటల్ సిబ్బంది హుటాహుటీనా ఆ క్రికెటర్లను అక్కడ నుంచి వేరే చోటకి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 'మా టూర్ మ్యాచ్ లో భాగంగా నీల్సన్ లోని ఓ హోటల్ ఉన్నాం. ఆ సమయంలో భూకంపం వార్త మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అయితే ఆ హోటల్ స్టాఫ్ మా జట్టుకు అత్యంత రక్షణగా నిలిచారు. భూకంపం వార్త తెలిసే సమయానికి మేము ఏడో అంతస్తులో ఉన్నాం. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది మమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చింది. సునామీ ప్రమాదం లేదనే వార్త తెలిసే వరకూ మమ్మల్ని సురక్షిత జోన్ లో ఉంచారు' అని బారీ తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. క్రిస్ట్‌చర్చ్ నగరాన్ని ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం వచ్చింది. ఆ తీవ్రత రిక్టార్ స్కేలుపై 7.4 గా నమోదైంది. దాంతో సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
కబడ్డీ పోటీకి క్రికెట్ జట్టు
కబడ్డీ పోటీల్లో గెలవడానికి సిద్ధమైన క్రికెట్ టీమ్.కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ. ఇలాంటి విభిన్న కథాంశంతో తెరకెక్కితున్న చిత్రం ధోని కబడ్డీ కుళు.మనిదం తిరైక్కళం పతాకంపై ఎస్.నందన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే.మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేశ్ శిష్యుడు పి.అయ్యప్పన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బుల్లితెరలో మైడియర్ భూతం అనే సీరియల్లో బాల నటుడిగా నటించిన అభిలాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. అరియన్ అనే నటి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో టీకడై అనే ముఖ్య పాత్రలో సీజీ.ప్రభాకరన్ నటిస్తుండగా ఇతర పాత్రల్లో కాంత, నవీన్, శంకర్, శక్తివేల్ మురుగన్, తెనాలి, ప్రభాకర్, పీటర్, సుజన్ సౌందర్‌రాజన్, ఏఆర్.పుగళ్కుమార్వేల్, శరత్, విజయ్గౌతమ్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక గ్రామంలో హీరో మిత్ర బృందం క్రికెట్ క్రీడే శ్వాసగా ఆడుతుంటారన్నారు.అలాంటిది ఒక సమయంలో ఆ గ్రామానికి అనూహ్యంగా ఒక సమస్య వచ్చి పడుతుందన్నారు. దాన్ని పరిష్కరించడానికి డబ్బు అవసరం అవుతుందని తెలిపారు. అరుుతే అదే సమయంలో పక్క గ్రామంలో కబడ్డీ పోటీలు జరుగుతుంటాయని, ఈ క్రికెట్ టీమ్ తమ గ్రామ సమస్యను తీర్చడానికి పక్క ఊరిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకంటారన్నారు.అయితే ఆ పోటీల్లో గెలిచి నగదు బహుమతి పొందారా? తమ గ్రామ సమస్యను పరిష్కరించుకున్నారా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన జనరంజక కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్ర దోని కబడ్డీ కుళు అని తెలిపారు. ఇందులో కబడ్డీ సన్నివేశాలను మాత్రమే 20 రోజులు చిత్రీకరించినట్లు, అందుకు హీరో మిత్ర బృందం నెల రోజుల పాటు శిక్షణ పొందినట్లు తెలిపారు.చిత్ర షూటింగ్ పూర్తి అయిందని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు. -
అందరివాడికే అందలం
► భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే ► స్పిన్ దిగ్గజానికే ఓటేసిన బీసీసీఐ పదవీకాలం ఏడాది అనూహ్యం ఏమీ జరగలేదు... భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరి అంచనాల ప్రకారమే అర్హుడైన వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చింది. టి20 ప్రపంచ కప్ ముగిసిన నాటినుంచి కొనసాగుతున్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోచ్‌గా నియమించింది. పారదర్శకత కోసం దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బోర్డు హడావిడి చేసినా... కుంబ్లే అడుగు పెట్టడంతోనే ఈ ప్రక్రియ లాంఛనమేనని అర్థమైంది. ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ఆటగాడిగా గుగ్లీలు, ఫ్లిప్పర్లతో ప్రత్యర్థుల పని పట్టిన ఇంజినీరింగ్ మేధావి ఇప్పుడు శిక్షకుడిగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ధర్మశాల: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా 46 ఏళ్ల అనిల్ కుంబ్లేను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రాథమికంగా కోచ్ పదవి కోసం అందిన 57 దరఖాస్తులను వడబోసి, ఆ తర్వాత అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ, సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు. కుంబ్లేను ప్రస్తుతం ఏడాది కాలానికే నియమించారు. వచ్చే నెలలో జరగనున్న వెస్టిండీస్ పర్యటనతో ఆయన బాధ్యతలు చేపడతారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న అడ్వైజరీ కమిటీ ముందు కుంబ్లే మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయనతో పాటు మరో మాజీ ఆటగాడు రవిశాస్త్రి చివరి వరకు రేసులో నిలిచినా... స్పిన్ దిగ్గజంవైపే బోర్డు మొగ్గు చూపింది. కోచ్‌గా ఎలాంటి గతానుభవం, సర్టిఫికెట్లు లేకపోయినా 18 ఏళ్ల కెరీర్లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రికార్డే కుంబ్లేకు అండగా నిలిచింది. మరో వైపు అసిస్టెంట్ కోచ్‌లు, సహాయక సిబ్బందిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే వారినీ ఎంపిక చేస్తామని బోర్డు ప్రకటించింది. సమర్థుడు కాబట్టే: భారత కోచ్ ఎంపికలో తాము పారదర్శకంగా వ్యవహరించామని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కుంబ్లేపై నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘కోచ్ ఎంపిక కోసం మేం కొన్ని నిబంధనలు విధించాం. అడ్వైజరీ కమిటీని కూడా ఇందులో భాగం చేశాం. ఈ ప్రక్రియలో అన్ని అంశాలు పరిశీలించి, ఇంటర్వ్యూల తర్వాత కుంబ్లేనే సరైన వ్యక్తిగా మేం భావించాం. కోచ్ స్వదేశీయా, విదేశీయా అన్నది కాదు. సమర్థుడైతే చాలు. అది జట్టుకు మేలు చేస్తుంది’ అని ఆయన చెప్పారు. రవిశాస్త్రి పనితీరుపై కూడా తాము సంతృప్తిగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు క్రికెట్ టెక్నాలజీ, ప్లేయర్ మేనేజ్మెంట్కు సంబంధించి కంపెనీని కుంబ్లే నిర్వహిస్తుండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే అన్నారు. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేది ఇక్కడ కుంబ్లేకు వర్తించదు. ఎంపికకు ముందు ఆ అంశంపై కూడా చర్చించాం. దానిపై ఎలాంటి సమస్యా లేదు. బోర్డులో అన్ని అంశాల్లో ప్రొఫెషనలిజం తీసుకు వస్తున్నాం కాబట్టి అదే తరహాలో ఏడాది కాలానికే అవకాశమిచ్చాం’ అని షిర్కే పేర్కొన్నారు. ► భారత్ తరఫున టెస్టులు, వన్డేలు కలిపి అత్యధిక వికెట్లు (956) తీసిన ఘనత కుంబ్లే సొంతం ఎలాంటి సవాలుకైనా సిద్ధం: కుంబ్లే కోచ్ పదవి చాలా పెద్ద బాధ్యత. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. కోచ్ పాత్ర తెరవెనుక ఉంటుంది. ఆటగాళ్లు మాత్రమే ముందు కనిపిస్తారు. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. భిన్నమైన పాత్రలో భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తిరిగి రావడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఏ వ్యూహమైనా గెలవడానికే. దీని గురించి ఆలోచించడానికి ఇంకాస్త సమయం ఉంది. విండీస్‌తో రాబోయే సిరీస్‌కు నా వద్ద స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఆటగాళ్లను కూడా భాగస్వాములుగా చేయాలనుకుంటున్నా. భారత క్రికెట్‌కు ఇదో గొప్ప సమయం. సచిన్, సౌరవ్, లక్ష్మణ్, ద్రవిడ్‌లతో చాలాకాలం కలిసి ఆడా. మైదానం లోపల, బయట వీళ్లతో మంచి అనుబంధం ఉంది. భారత క్రికెట్‌కు మంచి చేసేందుకు ఈ నలుగురితో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. కోచ్ పదవి గురించి కుటుంబంతోనూ మాట్లాడా. బాగా మద్దతిచ్చారు. అన్నీ ఇచ్చిన క్రికెట్‌కు ఎంతో కొంత తిరిగి ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ‘భారత క్రికెట్‌కు మంచి రోజులు రాబోతున్నాయి. చీఫ్ కోచ్‌గా అనిల్ జట్టులో అంకితభావం, అనుభవం, నైపుణ్యతను తీసుకొస్తాడని భావిస్తున్నా. ఇందుకు ఏడాది కాలం సరిపోతుంది. కుంబ్లే ఆటగాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే అతని నుంచి వాళ్లు ఎంతో కొంత నేర్చుకుంటారు. తన అభిప్రాయాలను కూడా కచ్చితంగా వెల్లడించాలి.’ - గావస్కర్ ‘కుంబ్లేను మళ్లీ మిస్ కాబోతున్నాం. అయినప్పటికీ సంతోషంగానే ఉంది. భారత క్రికెట్‌కు ఇంతకంటే నమ్మకమైన కోచ్ దొరకడు.’ -కుంబ్లే భార్య చేతన -
గాంధీ - మండేలా సిరీస్
-
భారత మహిళల ఓటమి
తొలి టి20లో కివీస్ విజయం బెంగళూరు: వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలి టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ షాకిచ్చింది. కెప్టెన్ సోఫీ డివైన్ (22 బంతుల్లో 70; 5 ఫోర్లు; 8 సిక్సర్లు) తుఫాన్ ఆటతీరుతో చెలరేగడంతో శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 19.5 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ప్రదర్శించిన కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ మిథాలీ రాజ్ (23 బంతుల్లో 35; 6 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. నీల్సన్, బ్రాడ్మోర్లకు మూడేసి వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కివీస్ డివైన్ జోరుతో.... 12.3 ఓవర్లలో రెండు వికెట్లకు 126 పరుగులు చేసి గెలిచింది. మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా అర్ధసెంచరీ (18 బంతుల్లో) సాధించిన క్రికెటర్‌గా డివైన్ రికార్డు సృష్టించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టి20 ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది. -
ధోని జట్టుదే హాకీ టైటిల్
హెచ్ఐఎల్ ఫైనల్లో నెగ్గిన రాంచీ న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు దుమ్ము రేపుతుంటే... స్వదేశంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లోనూ ధోని జట్టు అదరగొట్టింది. ధోని సహ యజమానిగా ఉన్న రాంచీ రేస్ జట్టు హెచ్ఐఎల్ మూడో సీజన్లో విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాంచీ జట్టు షూటవుట్స్లో 3-2తో పంజాబ్ వారియర్స్‌పై నెగ్గింది. మ్యాచ్ 39వ నిమిషంలో కీరన్ గోవర్స్ (పంజాబ్) గోల్ చేయగా... రాంచీ తరఫున స్టాన్లీ మింజ్ 42వ నిమిషంలో గోల్ సాధించాడు. క్రిస్టఫర్ సిరియెట్లో (56 వ ని.) గోల్‌తో పంజాబ్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి నిమిషంలో మిడిల్టన్ గోల్‌తో రాంచీ ఊపిరి పీల్చుకుంది. స్కోరు 2-2తో సమం కావడంతో... మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. ఇందులో రాంచీ 3-2తో గెలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ 2-1తో యూపీ విజార్డ్స్‌ను ఓడించింది. -
విజయం..పరాభవం..వివాదం
2014లో భారత క్రికెట్ ప్రస్థానం టెస్టు సిరీస్ గెలుచుకోని సంవత్సరం నాలుగు వన్డే సిరీస్‌లు సొంతం రోహిత్ శర్మ చిరస్మరణీయ రికార్డు గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత క్రికెట్ జట్టుకు 2014 మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. విజయాలతో పోలిస్తే వివాదాలు కూడా వెంట రావడంతో జట్టు ప్రభ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. లార్డ్స్ టెస్టు విజయం మినహా జట్టు పరంగా గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు కాలేదు. వన్డేల్లో వ్యక్తిగతంగా రోహిత్ శర్మ రికార్డు ఊరటనిచ్చింది. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్రదర్శన భారత అభిమానులు మరచిపోలేని చేదు జ్ఞాపకంగా మారింది. ఆటకు సంబంధం లేని అంశాల్లో నాటింగ్‌హామ్‌లో జడేజా, అండర్సన్ గొడవ, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ ఈ సారి మన క్రికెట్ జట్టును వార్తల్లో నిలిపాయి. ఏడాది చివర్లో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి, ధావన్ అంశం కూడా సంచలనం రేపింది. వీటన్నింటికి తోడు పాతికేళ్ల తర్వాత తొలిసారి సచిన్ టెండూల్కర్ పేరు లేకుండా భారత క్రికెట్ స్కోరు కార్డు కనిపించింది. (సాక్షి క్రీడా విభాగం) 2014లో భారత్ మూడు టెస్టు సిరీస్‌లలోనే పాల్గొంది. న్యూజిలాండ్‌లో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో 0-1తో ఓడింది. తొలి టెస్టులో పోరాడి విజయానికి చేరువగా వచ్చినా ఫలితం దక్కకపోగా...రెండో టెస్టులో మంచి అవకాశం ఉన్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చి ‘డ్రా’తో సరిపెట్టింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత టెస్టు నెగ్గి సంచలనం సృష్టించింది. ఇషాంత్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను 95 పరుగులతో చిత్తు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక వరుసగా మూడు టెస్టుల్లో పరాజయంపాలైంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి రెండు టెస్టులూ ఇప్పటికే ఓడింది. ఈ ఏడాది మెల్బోర్న్లో మరో టెస్టు మిగిలి ఉంది. ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో చూడాలి. మరో వైపు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఈ సారి సొంతగడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. విండీస్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఇక్కడ జరగాల్సిన సిరీస్ రద్దయింది. సొంతగడ్డపై సూపర్ ఈ ఏడాది భారత్ ఐదు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లతో పాటు ఆసియా కప్‌లో పాల్గొంది. సొంతగడ్డపై 5-0తో శ్రీలంకను, 2-1తో వెస్టిండీస్‌ను ఓడించింది. బంగ్లాదేశ్ వెళ్లి 2-0తో విజయం సాధించింది. వీటితో పాటు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో 3-1తో అద్భుత విజయం సాధించి దీటైన బదులిచ్చింది. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం ఐదు వన్డేల సిరీస్‌ను 0-4తో చిత్తుగా ఓడింది. ఆసియా కప్‌లో కూడా ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. వీడని నీడ స్పాట్ ఫిక్సింగ్ 2013లో వెలుగులోకి వచ్చినా సుప్రీంకోర్టులో తాజాగా సాగుతున్న విచారణ బీసీసీఐలో ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా బోర్డు అధికారుల తీరును పదే పదే కోర్టు తప్పుబట్టడం ఇబ్బందిగా మారింది. అరణ్య రోదన నాటింగ్‌హామ్ టెస్టులో జడేజాను దూషించాడంటూ భారత మేనేజ్మెంట్ అండర్సన్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో పాటు విచారణాధికారులు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఫలితం జట్టుకు ప్రతికూలంగానే వచ్చింది. అండర్సన్‌కు ఎలాంటి శిక్ష పడకపోగా, భారత్ ఏకాగ్రత చెదిరి అది సిరీస్‌పై ప్రభావం చూపించింది. వ్యక్తిగతంగా... టెస్టుల్లో భారత్ తరఫున మురళీ విజయ్ 18 ఇన్నింగ్స్‌లలో 42.94 సగటుతో 773 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. వన్డేల్లోనైతే 20 ఇన్నింగ్స్‌లలో 58.55 సగటుతో విరాట్ కోహ్లి 1054 పరుగులు సాధించి తన నిలకడ ప్రదర్శించాడు. టెస్టు బౌలింగ్‌లో భారత్ తరఫున 12 మ్యాచ్‌లలో 36 వికెట్లతో ఇషాంత్ శర్మ అగ్రస్థానంలో నిలిస్తే, వన్డేల్లో మొహమ్మద్ షమీ 16 మ్యాచుల్లో 38 వికెట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో స్టువర్ట్ బిన్నీ 4 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి భారత తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. యువీపై ఆగ్రహం బంగ్లాదేశ్‌లో జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. పరాజయంకంటే స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రదర్శన సగటు అభిమానిని బాధపెట్టింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయడాన్ని ఎవరూ మరచిపోలేరు. చిరస్మరణీయం అన్నింటికి మించి వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పడం ఈ ఏడాది హైలైట్‌గా చెప్పవచ్చు. కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. భవిష్యత్తులో వన్డేల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా ఇది చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. మాటలకందని విషాదం ప్రపంచ క్రికెట్లో మాటలకందని విషాద సంఘటనకు 2014 సాక్షిగా నిలిచింది. సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి గాయపడిన 25 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి చెందడం క్రీడాభిమానులను కలచివేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు హ్యూస్కు నివాళులు అర్పించారు. అండర్సన్ దూకుడు... న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ అండర్సన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. క్వీన్స్‌టౌన్‌లో జనవరి 1న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 12 సిక్సర్లతో శతకం బాది షాహిద్ అఫ్రిది పేరిట 17 ఏళ్లుగా ఉన్న రికార్డును (37 బంతులు; 1996లో శ్రీలంకపై) బద్దలు కొట్టాడు. 2014 రికార్డులు (ఇప్పటివరకు) టెస్టుల్లో అత్యధిక పరుగులు : కుమార సంగక్కర (11 టెస్టుల్లో 1486) వికెట్లు : రంగన హెరాత్ (10 టెస్టుల్లో 60) అత్యధిక వ్యక్తిగత స్కోరు : కుమార సంగక్కర (319) అత్యుత్తమ బౌలింగ్ : రంగన హెరాత్ (9/127) వన్డేల్లో అత్యధిక పరుగులు : కుమార సంగక్కర (28 వన్డేల్లో 1256) వికెట్లు : అజంతా మెండిస్ (17 వన్డేల్లో 38) అత్యధిక వ్యక్తిగత స్కోరు : రోహిత్ శర్మ (264) అత్యుత్తమ బౌలింగ్ : స్టువర్ట్ బిన్నీ (6/4) -
సమయం వచ్చేసింది... డీఆర్‘ఎస్’కు
పెరుగుతున్న మాజీల మద్దతు ఆసీస్ పర్యటనలో నష్టపోతున్న భారత్ న్యూఢిల్లీ: తన దాకా వస్తే కానీ అసలు బాధేమిటో తెలియదంటారు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు పరిస్థితి అలాగే ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనకు తోడు అంపైరింగ్ తప్పుడు నిర్ణయాలతో జట్టు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరుసగా రెండు ఓటములతో ఆటగాళ్ల స్థైర్యం దెబ్బతింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగినా అక్కడ అంపైర్ నిర్ణయ పునఃస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఉంటోంది. కానీ ఎందుకో ఆది నుంచీ డీఆర్ఎస్కు భారత క్రికెట్ బోర్డు బద్ద వ్యతిరేకి. రెండు దేశాలకు సమ్మతి అయితేనే ఈ పద్ధతి అమల్లో ఉంటుంది. కాబట్టి భారత్ ఆడే టెస్టు సిరీస్‌ల్లో డీఆర్ఎస్ కనిపించదు. అయితే తాజా పర్యటనలో పలు నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. జరిగిన రెండు టెస్టుల్లో కనీసం ఐదు సార్లు డీఆర్ఎస్ లేని కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో మాజీ ఆటగాళ్లు కొందరు ఈ పద్ధతికి మద్దతుగా గళం విప్పుతున్నారు. ఎంతగా పోరాడినప్పటికీ అంపైరింగ్ తప్పిదాలతో జట్టు ఓడిపోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. కాబట్టి ఈ పద్ధతిని అమలు పరిచేందుకు ఇదే సరైన సమయమని వారు అంటున్నారు. ఇక అంగీకరించాల్సిందే ‘జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం కూడా డీఆర్ఎస్ పద్ధతికి మద్దతు ఇవ్వక తప్పదు. ఓసారి రెండు టెస్టులను గమనించండి. భారత్ పోరాడినా కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లు వెనుదిరగాల్సి వచ్చింది. ధావన్, పుజారా, అశ్విన్ నిర్ణయాల్లో డీఆర్ఎస్ ఉండి ఉంటే తప్పకుండా రెండు టెస్టుల్లోనూ విజయం సాధించే అవకాశం ఉండేది. అయితే వ్యక్తిగతంగా ఈ పద్ధతిలో వంద శాతం కచ్చితత్వం ఉంటుందని చెప్పలేను. అయినా 90 శాతం ఉన్నా ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కదా.’ -హర్భజన్ సింగ్ (స్పిన్నర్) నేను వ్యతిరేకం కాదు ‘సాంకేతికంగా ఎలాంటి పద్ధతితోనైనా కచ్చిత నిర్ణయాలు వస్తే వాటిని స్వాగతించాల్సిందే. నేను డీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు. అయితే వంద శాతం కచ్చిత నిర్ణయాలు రావాలంటే ఈ పద్ధతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. హాట్‌స్పాట్ లేక హాక్ఐ ద్వారా ఎల్బీను పరిశీలించడంపై నమ్మకం ఉంచలేకపోతున్నాను. ఈ రెండు విషయాలు డీఆర్ఎస్ పద్ధతిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది.’ -వీవీఎస్ లక్ష్మణ్ (మాజీ టెస్టు ఆటగాడు) భారత్‌కే ఎందుకు అభ్యంతరం ‘డీఆర్ఎస్కు ఐసీసీ గుర్తింపునిచ్చింది. అన్ని జట్లూ దీన్ని అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక్క భారత్ మాత్రమే ఎందుకు దూరంగా ఉంటున్నట్టు? బ్రిస్బేన్ టెస్టులో చాలా నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. డీఆర్ఎస్ ఉంటే కచ్చితంగా అవి మనకు అనుకూలంగానే వచ్చేవి’-అజహరుద్దీన్ (మాజీ కెప్టెన్) -
సారీ... మీరొద్దు!
యువరాజ్, సెహ్వాగ్‌లకు మొండిచెయ్యి హర్భజన్, గంభీర్, జహీర్లకూ నిరాశే ప్రపంచకప్‌కు 30 మంది భారత ప్రాబబుల్స్ ఎంపిక జనవరి 7లోగా 15 మందితో జట్టు ప్రకటన ముంబై: గత వైభవం, జ్ఞాపకాలను పట్టించుకోనే లేదు... వర్తమానానికే విలువ, గుర్తింపు... భవిష్యత్తుపై, ముందుకు వెళ్లటంపైనే దృష్టి... భారత క్రికెట్ జట్టును ఎంపిక చేయడంలో సెలక్టర్లు పాటించిన సూత్రం ఇది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం గురువారం 30 మంది సభ్యుల ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. చాలా రోజులుగా నిలకడగా రాణిస్తున్న, ఇటీవల అవకాశం దక్కిన ప్రతి చోటా తమ ప్రతిభను ప్రదర్శించిన యువ ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. 2011 ప్రపంచకప్ విజయంలో భాగమైన సీనియర్ ఆటగాళ్లు ఐదుగురికి ఇందులో స్థానం లభించలేదు. నాడు కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ఖాన్లను ఎంపిక చేయలేదు. వీరంతా తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు ఏడాది కావస్తున్నా... ఆసీస్ గడ్డపై అనుభవం అక్కరకు వస్తుందనే కారణంతో ఏదో మూల ఒక ఆశ ఉండేది. కానీ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆ ఆశలకు తెర దించింది. సీనియర్లకన్నా కొత్త కుర్రాళ్లపైనే నమ్మకం ఉంచడం ఉత్తమమంటూ తమ మనోభావాన్ని బయట పెట్టింది. ప్రాబబుల్స్ నుంచి 15 మంది సభ్యుల తుది జట్టును ప్రకటించేందుకు జనవరి 7 వరకు గడువు ఉంది. ఊహించినట్లుగానే... 2011లో జగజ్జేతగా నిలిచిన జట్టులో భాగమైన ధోని, కోహ్లి, రైనా, అశ్విన్ మాత్రమే ఇప్పుడు టీమ్‌లో ఉన్నారు. మిగతా 11 మంది ఈ సారి జట్టుకు దూరమయ్యారు. యువ క్రికెటర్లను ఎంపిక చేయడంలో కూడా ఎలాంటి సంచలనాలు లేవు. ఇటీవల జాతీయ జట్టు తరఫున, దేశవాళీలో కూడా రాణించిన ఆట గాళ్లకే అవకాశం దక్కింది. పుజారాను ఇంకా సెలక్టర్లు వన్డే ఆటగాడిగా గుర్తించకపోగా, కర్ణాటకకు దేశవాళీలో వరుసగా నాలుగు టైటిల్స్ అందించినా...వినయ్ కుమార్‌కు నిరాశ తప్పలేదు. ధోనితో పాటు మరో ముగ్గురు కీపర్లు అందుబాటులో ఉండటంతో దినేశ్ కార్తీక్, నమన్ ఓజాలను కూడా పక్కన పెట్టారు. ఎంపికలో ప్రస్తుత ఫామ్‌నే పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా సీనియర్లకు ప్రతికూలంగా మారింది. ‘సెలక్షన్ కోసం సీనియర్ల పేర్లు కూడా పరిశీలించాం. ప్రతీ ఒక్కరి గురించి చర్చ జరిగింది. అయితే బాగా ఆడుతున్నవారినే ఎంపిక చేయాలని అందరం నిర్ణయించాం. కుర్రాళ్లు దేశవాళీలో చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి వారిని పక్కన పెట్టలేము. ఏవైనా తీవ్ర గాయాలు అయితే తప్ప ఈ జాబితానుంచే ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తాం. సెలక్షన్లో కెప్టెన్ సూచనలను కూడా పరిశీలనలోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. భారత ప్రాబబుల్స్ బ్యాట్స్‌మెన్: ధావన్, రోహిత్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారి, మనీశ్ పాండే, మురళీ విజయ్ పేస్ బౌలర్లు: ఇషాంత్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్, ఆరోన్, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, అశోక్ దిండా స్పిన్నర్లు: అశ్విన్, రసూల్, కరణ్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వికెట్ కీపర్లు: ఎంఎస్ ధోని, ఉతప్ప, సంజు శామ్సన్, వృద్ధిమాన్ సాహా ఖేల్ ఖతం..! నేను భవిష్యత్తులో భారత్‌కు ఆడతానో, లేదో... నెల క్రితం యువరాజ్ సింగ్ సంశయం, ఆపై వెంటనే మళ్లీ వస్తానంటూ ఆత్మవిశ్వాసం. ప్రపంచ కప్‌కు ఎంపికవుతానని నాకు ఇంకా నమ్మకముంది...మూడు రోజుల క్రితం సెహ్వాగ్ మనసులో మాట. ఐపీఎల్లో నేనే భారత అత్యుత్తమ స్పిన్నర్‌ను...ఈ ప్రదర్శన నన్ను కాపాడుతుందంటూ కొన్నాళ్ల క్రితం హర్భజన్ ఆశతో చేసిన వ్యాఖ్య. ఇక ఆటతోనే తన విలువ చూపాలని ప్రతీ దేశవాళీ మ్యాచ్ బరిలోకి దిగిన గంభీర్...ఆస్ట్రేలియాలో అనుభవమే తనకు కలిసొస్తుందనే విశ్వాసంతో జహీర్ ఖాన్. సాక్షి క్రీడావిభాగం: ఇప్పటి వరకు ఏదో ఒక ఆశ, నమ్మకం వీరి ఆలోచనలను ప్రపంచ కప్ వైపు నడిపించింది. అయితే భారత సెలక్టర్లు వీరి అన్ని కోరికలకు అడ్డుకట్ట వేశారు. ఇక మీరు అవసరం లేదంటూ తలుపులు మూసేశారు. ప్రపంచ కప్ కోసమే కాదు ఆ తర్వాతి భవిష్యత్తు కోసమే కుర్రాళ్లను ఎంపిక చేశామంటూ బోర్డు కుండబద్దలు కొట్టింది. ఈ ఐదుగురికి కనీసం ప్రాబబుల్స్‌లో చోటు దక్కినా ఆశ పడేందుకు అవకాశం ఉండేది. ఎందుకంటే ఇక్కడ దేశవాళీలో అద్భుతంగా ఆడితే, అక్కడ ఆస్ట్రేలియాలో కుర్రాళ్లు విఫలమైతే...అప్పుడైనా సీనియర్ల అవసరం గుర్తుకు వచ్చి ఎంపికయ్యేవారేమో! ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఏదైనా ‘మర్యాదపూర్వక వీడ్కోలు’ కోసం ప్రత్యేకంగా బీసీసీఐ మరో మ్యాచ్‌కు అవకాశం ఇస్తే తప్ప ఇకపై వీరు భారత్ తరఫున ఆడటాన్ని మనం చూడకపోవచ్చు. 2011 ప్రపంచ కప్ విజయంలో భాగమై ఇప్పుడు ప్రాబబుల్స్‌లో స్థానం లభించని (11 మంది) ఆటగాళ్లను చూస్తే... యువరాజ్ సింగ్: గత వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యువరాజ్ పాత్రను 1983లోని మొహిందర్ అమర్నాథ్తో పోల్చారు. ఇప్పుడూ అదే పోలిక చెప్పవచ్చేమో. ఎందుకంటే అమర్నాథ్కు కూడా 1987 ప్రపంచ కప్‌లో చోటే దక్కలేదు. ఇప్పడు యువీ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది! 2011 ఫైనల్ అనంతరం ఆడిన 16 వన్డే ఇన్నింగ్స్‌లలో యువరాజ్ 18.53 సగటుతో కేవలం 278 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లే పడగొట్టడం అతని ఫామ్‌లేమిని సూచిస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ఆఖరి వన్డే ఆడిన యువీ విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 168 పరుగులే చేశాడు. యువీ శైలిలో ఆడే జడేజా, అక్షర్ నిలదొక్కుకోవడంతో అతని చోటు పోయింది. వీరేంద్ర సెహ్వాగ్: 2013 జనవరిలో ఆఖరి వన్డే. గత రెండేళ్లలో 13 వన్డేల్లో సగటు 20.23 మాత్రమే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే అర్ధ సెంచరీ. రోహిత్ నిలదొక్కుకొని భారీ స్కోరు చేస్తుండటంతో చాన్స్ పోయింది. గంభీర్: 2013 జనవరిలో ఆఖరి వన్డే. గత రెండేళ్ళలో 30 మ్యాచ్‌ల్లో సగటు 23.58 మాత్రమే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే అర్ధ సెంచరీ. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా ధావన్ దూకుడైన ఆటతో గుర్తింపు తెచ్చుకోవడం గంభీర్ అవకాశాలు దెబ్బ తీసింది. హర్భజన్ సింగ్: 2011 జూన్‌లో ఆఖరి వన్డే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. అశ్విన్ ఎలాగూ జట్టులో ఉన్నాడు. గత సారే అతనితో పోటీ పడాల్సి వచ్చింది. కాబట్టి భజ్జీకి తలుపులు మూసుకుపోయాయి. జహీర్ ఖాన్: సుదీర్ఘ కాలంగా ఫిట్నెస్ సమస్యలు. మేలో ఐపీఎల్ తర్వాత పోటీ క్రికెట్ ఆడనే లేదు. 2012 ఆగస్టులో ఆఖరి వన్డే ఆడిన జహీర్ గాయంనుంచి ఇంకా కోలుకోలేదు. జట్టులో ఉన్న భారత పేసర్లు ఇప్పటికే తమను తాము నిరూపించుకొని స్థిరపడ్డారు. ఇక గత ప్రపంచ కప్ ఆడినవారిలో సచిన్ రిటైర్ కాగా, శ్రీశాంత్‌పై నిషేధం వేటు పడింది. ఇతర ఆటగాళ్లు మునాఫ్, నెహ్రా, చావ్లా, యూసుఫ్ పఠాన్ చురుగ్గా లేకపోవడంతో పాటు వరుసగా విఫలమయ్యారు. -
ధోని సేన విజేతగా నిలుస్తుంది
వన్డే ప్రపంచకప్‌పై సచిన్ టెండూల్కర్ బ్రాడ్‌మన్ ప్రశంస గర్వకారణం ముంబై: భారత వన్డే క్రికెట్ జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పూర్తి విశ్వాసముంచాడు. అన్ని రకాలుగా సమతుల్యంతో ఉన్న ధోని సేన వచ్చే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. మరో ఐదు నెలల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వరల్డ్ కప్ జరిగే విషయం తెలిసిందే. ‘ప్రస్తుత వన్డే జట్టు బహుముఖ ప్రతిభ కలిగి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో కుడి, ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌తో సమతూకంగా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యం కనిపిస్తోంది. ఫీల్డింగ్ విషయంలోనూ లోపాలు కనిపించడం లేదు. కచ్చితంగా డిఫెండింగ్ చాంప్ భారత్ మళ్లీ విజేతగా నిలుస్తుంది. ఆసీస్, కివీస్‌లోనే 1991-92లో జరిగిన ప్రపంచకప్ నాకు కొన్ని మధుర స్మ ృతులను మిగిల్చింది’ అని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నిర్వహించిన ఈ స్పోర్టింగ్ ఈవెంట్లో ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు క్లబ్ జీవిత కాల సభ్యుడి హోదాను ఇచ్చారు. భారత్, ఆసీస్ జట్లకు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టును ఓడించడమే కోరికగా ఉందని అబాట్ సరదాగా అన్నారు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు బ్రెట్ లీ, గిల్‌క్రిస్ట్ యువ క్రికెటర్లను సన్మానించారు. క్రీడలు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతాయని, ఆరోగ్యం, ఏకాగ్రతను ఇవి పెంపొదిస్తాయని చిన్నారులకు సచిన్ వివరించాడు. ‘బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాలు అద్భుతం’ ప్రపంచ క్రికెట్లో అత్యున్నత బ్యాట్స్‌మన్‌గా కీర్తించే డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను కలుసుకున్న సంఘటన తన జీవితంలో అత్యంత సంతోషదాయకమైందని సచిన్ అన్నాడు. ‘బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. మన ఇద్దరి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉందని చెప్పిన బ్రాడ్‌మన్ కితాబు జీవితంలో నాకు దక్కిన అత్యంత గౌరవం. అలాగే ఆయన తయారుచేసిన ఆల్ టైమ్ టెస్టు ఆటగాళ్ల జాబితాలో నాపేరు ఉండడం గర్వకారణం. ఆ 11 మంది ఆటగాళ్లతో కూడిన ఫొటో ఫ్రేమ్ నా దగ్గర ఉంది. దాన్ని విలువైన సంపదగా భావిస్తాను’ అని సచిన్ చెప్పాడు. -
‘టాప్’ కమిటీలో గోపీచంద్
న్యూఢిల్లీ: భారత దేశ జనాభా వంద కోట్లకు పైగా చేరుకున్నా క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు వెళితే పట్టుమని పది పతకాలు కూడా సాధించలేని పరిస్థితి. క్రితం సారి లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతకాల సంఖ్య కేవలం ఆరు. తాజాగా ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2016, 2020 ఒలింపిక్స్ల్లో పతకాల సంఖ్య పెంచేందుకు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేయాలనే ఉద్దేశంతో క్రీడా శాఖ కొత్తగా ‘టార్గెట్ మిషన్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్)’ అనే పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీన్ని జాతీయ క్రీడా అభివృద్ధి నిధి ద్వారా ప్రమోట్ చేస్తారు. దీంట్లో భాగంగా దేశంలోని నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పి.గోపీచంద్‌లతో పాటు సాయ్ డెరైక్టర్ జనరల్, మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ సీఈవో మనీష్ మల్హోత్రా, కన్వీనర్‌గా అమ్రిత్ మాథుర్ ఉండనున్నారు. వీరికి బీజేపీ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వం వహిస్తారు. 2016లో క్రితంసారి కన్నా రెట్టింపు, 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో 20 పతకాలను సాధించే లక్ష్యంతో 75 నుంచి 100 మంది వరకు అథ్లెట్లను గుర్తించి వారికి అత్యంత ఆధునిక శిక్షణను ఇవ్వనున్నారు. ముఖ్యంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మేజర్ టోర్నీల్లో ఈ విభాగాల నుంచే భారత్ అత్యధిక పతకాలు దక్కించుకుంటోంది. -
ఇంగ్లండ్ పయనమైన భారత క్రికెట్ జట్టు
ముంబై: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఆదివారమిక్కడ నుంచి బయల్దేరింది. ఇంగ్లండ్‌లో టీమిండియా 5 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 26 నుంచి జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌తో భారత పర్యటన ఆరంభమవుతుంది. షెడ్యూల్: టెస్టు సిరీస్ మొదటి టెస్ట్- జూలై 9 నుంచి రెండో టెస్ట్- జూలై 17 నుంచి మూడో టెస్ట్- జూలై 27 నుంచి నాలుగో టెస్ట్- ఆగస్ట్ 7 నుంచి ఐదో టెస్ట్ ఆగస్టు 15 నుంచి వన్డే సిరీస్ మొదటి వన్డే ఆగస్టు 25న రెండో వన్డే ఆగస్టు 27న మూడో వన్డే - ఆగస్టు 30న నాలుగో వన్డే సెప్టెంబర్ 2న ఐదో వన్డే సెప్టెంబర్ 5న ఏకైక టీ-20 సెప్టెంబరు 7న -
ఇదీ బెట్టింగే...
గుసగుసలు: క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాదు, బెట్టింగుల జోరు రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ముఖ్యమైన నేతల్లో ఎవరికెంత మెజారిటీ వస్తుంది..? వంటి అంశాలపై బెట్టింగులకు దిగుతుంటారు. తెలంగాణలో ఒకరకంగా, సీమాంధ్రలో మరోరకంగా పార్టీల జయాపజయాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఆవరణలోనే ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ పరస్పరం బెట్టింగుకు దిగారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ, ‘సమైక్య’ చాంపియన్‌గా ప్రచారం పొందేందుకు చివరి వరకు విఫలయ్నతం చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి, విభజన నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పేరిట సొంత కుంపటి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయా? జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయా? అనే దానిపై ఇద్దరు నేతలూ మాటా మాటా పెంచుకుని లక్షల్లోనే బెట్టింగ్‌కు దిగారు. ఇదంతా గమనిస్తూ పక్కనే ఉన్న మరో ఇద్దరు నేతలు క్రికెట్ బెట్టింగుల కంటే ఇదేదో ఆసక్తికరంగా ఉందే! అంటూ వ్యాఖ్యానించారు. -
త్వరలోనే టెస్ట్ హోదా!
=వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బీసీసీఐ ప్రతినిధి బృందం =స్టేడియం వసతుల పట్ల సంతృప్తి విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇప్పటికే అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన స్టేడియంలో త్వరలోనే టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన ఈ స్టేడియాన్ని గతంలోనే ఐసీసీ ప్రతినిధి బృందం పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. వాటికి అనుగుణంగా ఏసీఏ అన్ని హంగుల్ని సమకూర్చుకున్నా ఇప్పటికీ టెస్ట్ హోదా అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీసీసీఐ ప్రతినిధి బృందం గురువారం విశాఖ చేరుకుని స్టేడియం పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో బీసీసీఐ నుంచి పచ్చజెండా రానుంది. పర్యవేక్షక కమిటీకి రంజిత్ బిస్వాల్ అధ్యక్షత వహించగా బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్ ఎం.వి. శ్రీధర్, మాజీ టెస్ట్ ఆటగాడు జి.ఆర్.విశ్వనాథ్, బీసీసీఐ టీవీ డెరైక్టర్ జేమ్స్ రెగో తదితర కమిటీ సభ్యులు వైఎస్ఆర్ స్డేడియాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏసీఏ ప్రతినిధులు డి.వి.సుబ్బారావు, డి.వి.సోమయాజులు, జి.రంగరాజు, జి.జె.జె.రాజు, అరుణ్‌కుమార్, ఎం.ఎస్.కె.ప్రసాద్, బి.జె.జె.రాజు, సి.ఆర్.మోహన్ పాల్గొన్నారు. తొలిటెస్ట్ బంగ్లాదేశ్‌తో...? ప్రస్తుత 2014 సీజన్ అంతా విదేశాల్లో భారత్ జట్టు గడపనుంది. సీజన్ అనంతరం భారత పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు రానుండడంతో సిరీస్‌లో ఓ టెస్ట్ మ్యాచ్ విశాఖలో నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతిరాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్టేడియాల రూపకల్పన , మ్యాచ్‌ల నిర్వహణ జరుగుతుండడంతో విశాఖ స్టేడియానికి టెస్ట్ హోదా వచ్చేందుకు సమయం తీసుకుంది. అయితే రొటేషన్ పద్ధతిలోనూ మ్యాచ్‌ల కేటాయింపు ఉంది. టెస్ట్ హోదా ఇవ్వాలని నివేదిస్తాం బీసీసీఐ నిర్దేశించిన అన్ని అర్హతల్ని వైఎస్ఆర్ స్టేడియం కలిగి ఉందని పర్యవేక్షక బృందానికి అధ్యక్షత వహించిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చైర్మన్, బీసీసీఐ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ రంజిత్ బిస్వాల్ తెలిపారు. గురువారం కమిటీ ప్రతినిధులు స్టేడియంలోని అన్ని వసతుల్ని పర్యవేక్షించారు. అన్ని విషయాలను నోట్ చేసుకున్నామని వాటిని రిపోర్ట్‌లో పొందుపరిచి విశాఖ స్టేడియానికి టెస్ట్ హోదా కల్పించాలని బీసీసీఐకి నివేదిస్తామని అన్నారు. విశాఖ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు తగిన వసతులను కలిగి వుందన్నారు. అందువల్ల వచ్చే ఏడో ఐపీఎల్ సీజన్లో కొన్ని మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే గవర్నింగ్ బాడీ ఎన్నికలు ఉన్నాయన్నారు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 60 మ్యాచ్లుంటాయన్నారు. -
టీమిండియా కెప్టెన్ ధోని అరుదైన రికార్డు
-
ధోనీ అరుదైన రికార్డు
-
టీమిండియాకు స్పాన్సర్ కరువు