క్రికెట్ జట్టుకు తప్పిన ప్రమాదం!! | Pakistan Cricket Team Shocked But Safe After Christchurch Earthquake | Sakshi

క్రికెట్ జట్టుకు తప్పిన ప్రమాదం!!

Nov 14 2016 12:39 PM | Updated on Sep 4 2017 8:05 PM

క్రికెట్ జట్టుకు తప్పిన ప్రమాదం!!

క్రికెట్ జట్టుకు తప్పిన ప్రమాదం!!

పాకిస్తాన్ క్రికెటర్లు భూకంప ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

కరాచీ:పాకిస్తాన్ క్రికెటర్లు భూకంప ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ కు వచ్చిన పాక్ క్రికెటర్లకు భూకంపం తీవ్రమైన షాక్ గురి చేసింది. నీల్సన్లోని ఓ హోటల్లో క్రికెటర్లు బస చేస్తున్న సమయంలో స్థానికంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటు సునామీ వచ్చే అవకాశం కూడా ఉందనే హెచ్చరికలు పాక్ క్రికెటర్లను కలవరపెట్టాయి. అయితే ఆ హోటల్ సిబ్బంది హుటాహుటీనా ఆ క్రికెటర్లను అక్కడ నుంచి వేరే చోటకి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


'మా టూర్ మ్యాచ్ లో భాగంగా నీల్సన్ లోని ఓ హోటల్ ఉన్నాం. ఆ సమయంలో భూకంపం వార్త మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అయితే ఆ  హోటల్ స్టాఫ్ మా జట్టుకు అత్యంత రక్షణగా నిలిచారు. భూకంపం వార్త తెలిసే సమయానికి మేము ఏడో అంతస్తులో ఉన్నాం. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది మమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చింది. సునామీ ప్రమాదం లేదనే వార్త తెలిసే వరకూ మమ్మల్ని సురక్షిత జోన్ లో ఉంచారు' అని బారీ తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

క్రిస్ట్చర్చ్ నగరాన్ని ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం వచ్చింది. ఆ తీవ్రత రిక్టార్ స్కేలుపై 7.4 గా నమోదైంది. దాంతో సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement