పాకిస్థాన్‌లోని పెషావర్ ప్రాంతంతోపాటూ, ఆఫ్ఘనిస్థాన్‌లోని జుర్మ్, కాబూల్‌లో ఆదివారం భూమి కంపించింది.
పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ ప్రాంతంతోపాటూ, ఆఫ్ఘనిస్థాన్‌లోని జుర్మ్, కాబూల్‌లో ఆదివారం భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంపాల ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.