సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర అండర్–19 మహిళల వన్డే టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా జి. త్రిష ఎంపికవగా... సువర్ణ లక్ష్మి కోచ్‌గా వ్యవహరించనున్నారు. వడోదరలో ఫిబ్రవరి 10 నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. రాష్ట్రజట్టుకు ఎంపికైన క్రీడాకారులందరూ ఫిబ్రవరి 1న మధ్యాహ్నం గం.2:30లకు జింఖానా గ్రౌండ్స్‌లో కోచ్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా హెచ్‌సీఏ పేర్కొంది.
జట్టు వివరాలు: జి. త్రిష (కెప్టెన్), లక్ష్మి ప్రసన్న (వైస్ కెప్టెన్), జి.కె.శ్రావ్య, ఎం. మమత, వై. త్రిష పూజిత, కీర్తి రెడ్డి, హెన్రిత ఫ్లేవియా పెరీరా, మెర్లిన్ జాన్, పి. అలివేలు, పి. సువార్త, ఎన్. క్రాంతిరెడ్డి, ఫాతిమా, ఇషిత కోడూరి, బి. పరిమళ, సాక్షి రావు, సువర్ణ లక్ష్మి (కోచ్), అనా మరియా (మేనేజర్), జెస్సి (ఫిజియో). స్టాండ్ బైస్: లిఖిత నందిని, అద్వైత, శ్రీవల్లి, పూజశ్రీ, సౌమ్య.
Comments
Please login to add a commentAdd a comment