త్వరలోనే భారత జట్టుకు సరికొత్త చీఫ్ సెలెక్టర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ కొత్త చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. కాగా గత రెండు సార్లు కూడా ఛీప్ సెలక్టర్ రేసులో అగార్కర్ పేరు వినిపించినప్పటికి.. అతడు ఈ పదవిని చేపట్టేందుకు సుముఖత చూపలేదు.
అయితే ఈ సారి మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టేందుకు అజిత్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ జూలై మొదటి వారంలో అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో అప్పటి సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ భారత జట్టుకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేసి దొరికిపోవడంతో రాజీనామా చేశాడు.
ఈ క్రమంలో చేతన్ శర్మ స్థానంలో సెలక్షన్ ప్యానల్‌లో సభ్యుడైన శివ్‌సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛీప్ సెలెక్టర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే త్వరలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లు జరగనుండంతో పూర్తి స్థాయి ఛీప్ సెలెక్టర్‌ను ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ పడింది.
ఈ క్రమంలోనే కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూలై 1 నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి.
చదవండి: #ICCWorldCup2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment