Ajit Agarkar
-
‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.జట్టులో అవకాశాలు కరువుకాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్‌కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. ఐపీఎల్‌లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్‌గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్‌తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్మెంట్తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడుఅందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్‌లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్‌లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాను. ఐపీఎల్లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.రీఎంట్రీ ఇస్తాఅయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్‌కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
ఆ ఇద్దరి విషయంలో అగార్కర్‌తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటుఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది. మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదనఅదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్‌కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా ఈ సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.రిషభ పంత్‌కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూఇక కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్‌ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.ఏది ఏమైనా ఇంగ్లండ్‌తో వన్డేలో సిరీస్‌లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్‌తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!? -
చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే నిర్ణయం: అగార్కర్
విరాట్ కోహ్లి(Virat Kohli).. రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గత కొంతకాలంగా టెస్టుల్లో తేలిపోతున్నారు. తొలుత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో విఫలమైన ‘విరాహిత్’ ద్వయం.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచారు. గత ఎనిమిది టెస్టు మ్యాచ్‌లలో కలిపి రోహిత్ చేసిన పరుగులు 164. తీవ్ర స్థాయిలో విమర్శలు ఇక కోహ్లి విషయానికొస్తే.. గత పది మ్యాచ్‌లలో అతడు 382 పరుగులు చేయగలిగాడు. కివీస్ చేతిలో 3-0తో టెస్టుల్లో వైట్‌వాష్.. ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి.. ఫలితంగా రోహిత్- కోహ్లి ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, తాను ఇప్పట్లో రిటైర్ కానని 37 ఏళ్ల రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు సందర్భంగా కుండబద్దలు కొట్టగా.. 36 ఏళ్ల కోహ్లి అసలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లుగా మిన్నకుండిపోయాడు. కానీ ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లపై విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి భవితవ్యం ఏమిటన్న అంశం, జట్టులో మార్పులపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతేఇందుకు బదులిస్తూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) మొదలుకావడానికి నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ ఇద్దరు వన్డే క్రికెట్లో అత్యద్భుతమైన ప్రదర్శన కలిగి ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే మేము దీనిపై దృష్టి సారిస్తాం. మెగా టోర్నీ పూర్తయిన తర్వాత.. ఆటగాళ్ల ప్రదర్శన, భవితవ్యంపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది.ఒకరిద్దరు అని కాదు.. ప్రతి ఆటగాడిపై మా దృష్టి ఉంటుంది. ఆ తర్వాతే జట్టులో ఎలాంటి మార్పులు చేయాలో ఆలోచిస్తాం. అయితే, ఇప్పుడు మాత్రం మా ఫోకస్ మొత్తం వన్డే క్రికెట్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించిన సందర్భంగా శనివారం ఈ వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ వేదికగాకాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.ఇక ఈ ఐసీసీ టోర్నీలో గనుక కోహ్లి- రోహిత్ విఫలమైతే.. వారికి కష్టాలు తప్పకపోవచ్చు. అదే జరిగితే.. తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జట్టులో ఈ దిగ్గజ ద్వయానికి చోటు దక్కడం కష్టమే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్అయితే, చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే కోహ్లి- రోహిత్ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గనుక సత్తా చాటితే.. అభిమానులను ఖుషీ చేయడంతో పాటు.. ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలుకానుంది. అనంతరం ఇరుజట్లు ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పోటీపడతాయి. చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్‌కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
ఇదేమీ స్కూల్ కాదు.. సూపర్స్టార్లు అయినా తప్పదు: చీఫ్ సెలక్టర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవేశపెట్టిన ‘పటిష్ట జట్టుకు పది సూత్రాల’ అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు ప్రయోజనాల కోసమే నిబంధనలు కఠినతరం చేశామే తప్ప.. ఇవేమీ స్కూలు పిల్లలకు ఇచ్చే పనిష్మెంట్లు కావని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి సభ్యుడు పరిణతి గలిగిన వ్యక్తులేనని.. సూపర్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారన్నాడు.అయితే, జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు ప్రతి ఒక్కరు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అగార్కర్ స్పష్టం చేశాడు. ప్రతి టీమ్‌లోనూ రూల్స్ ఉంటాయని.. జట్టు అభివృద్ధి, ప్రయోజనాలు మాత్రమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు రోజురోజుకు మరింత మెరుగుపడటానికి మాత్రమే నిబంధనలు విధించినట్లు తెలిపాడు.బీసీసీఐ ప్రవేశపెట్టిన పది సూత్రాల పాలసీదేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందే ‘స్టార్ హోదాతో దేశవాళీ క్రికెట్‌ను అటకెక్కించిన ఆటగాళ్లు ఇకపై బరిలోకి దిగాల్సిందే. టీమిండియాకు ఎంపిక కావాలంటే రంజీ మ్యాచ్‌లు, ఇతర దేశవాళీ టోర్నీలలో ఆటగాళ్లంతా వారి వారి రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండాలి. సహేతుక కారణం ఉంటే తప్ప... తప్పుకోవడానికి యువ ఆటగాళ్లకే కాదు సీనియర్లకు ఇకపై వీలుండదు’బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవు టోర్నీలు, సిరీస్‌లు జరుగుతుంటే ఇకపై ‘బ్రాండింగ్’ షూటింగ్‌ల్లో పాల్గొనడం కుదరదు. ఆటగాళ్లు కుదుర్చుకున్న ఎండార్స్మెంట్ ఒప్పందాల కోసం సిరీస్ మధ్యలో ఫొటో షూట్స్ నిషిద్ధం.కుటుంబసభ్యుల అనుమతికి ఓ పరిమితి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఆ ద్వైపాక్షిక సిరీస్ 45 రోజులకు మించి సుదీర్ఘంగా సాగితే క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా అసాంతం ఉంటామంటే ఉండనివ్వరు. 45 రోజులు ఆ పైన పర్యటనల కోసం ఇకపై రెండు వారాలపాటే కుటుంబసభ్యుల్ని అనుమతిస్తారు. స్వల్పకాల పర్యటనలకు మాత్రం వారం పరిమితే ఉంటుందిక! జట్టుతో పాటే పయనం ఇప్పటి వరకు ఆటగాళ్లు విడతల వారీగా, పర్యటన షెడ్యూల్‌కు ఉన్న సమయానికి అనుకూలంగా ఆటగాళ్లు ఆయా దేశాలకు వేర్వేరుగా పయనమయ్యేవారు. కానీ ఇక మీదట ఓ జట్టుగా సహచరులతో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తద్వారా జట్టులో అను‘బంధం’ బలపడేందుకు దోహదం చేస్తుంది. అనివార్య కారణాలు లేదంటే తప్పనిసరై ఫ్యామిలీతో ప్రయాణించాలంటే మాత్రం బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి! వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు జట్టులో ఎంత సీనియరైనా, దిగ్గజమైనా తమ వెంట వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్తామంటే అనుమతించరు. సదరు సిబ్బంది అవసరమనుకుంటే ఆ ఆటగాడు కచి్చతంగా బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటుంది.‘అదనపు’ లగేజీ భారం ప్లేయర్లపైనే... విమాన ప్రయాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఆటగాళ్ల లగేజీపై ఎలాంటి ఆంక్షలు, పరిమితుల్లేవు. ఎన్ని కేజీలు తీసుకెళ్లినా ఆ భారాన్ని బోర్డే భరించేది. కానీ ఇకపై ఒక ఆటగాడు 150 కేజీలకు మించి లగేజీ తీసుకెళితే ఆ భారం ఆటగాళ్లే మోయాలి.కలసికట్టుగా ప్రాక్టీస్ సన్నాహాలకు ఆటగాళ్లంతా సమయానికి అందుబాటులో ఉండాలి. నెట్స్‌లో శ్రమించేందుకు వెళ్లే సమయంలో తమకు వీలుచిక్కిన సమయంలో స్టేడియానికి చేరకుండా... అంతా కలిసి ఒకే బస్సులో ప్రాక్టీసుకు బయలు దేరాలి.బోర్డు కార్యక్రమాలకు హాజరు బీసీసీఐ నిర్వహించే సమావేశాలు, ఈవెంట్లు, కార్యక్రమాలకు భారత ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలి. ఇది క్రికెట్ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది.మ్యాచ్‌లు ముగిశాక... ఏదైనా పర్యటన, సిరీస్, టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇష్టారీతిన ఎవరికివారు హోటల్ గదులకు వెళతామంటే కుదరదు. అందరు కలిసి జట్టుగా వెళ్లాలి. జట్టుతో పాటే పయనించాలి. గదుల్లోనూ కలిసిమెలిసే బస స్టార్ ఆటగాళ్లకు విడిగా ప్రత్యేక గదులిస్తున్నారు. ఇకపై రెండు వారాలు, ఒక వారం కుటుంబసభ్యుల పరిమితికి లోబడి మాత్రమే ప్రత్యేక గదుల్ని కేటాయిస్తారు. మిగతా సమయంలో సహచర ఆటగాళ్లతో గదుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. చదవండి: అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ -
కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్ నాయర్(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్ నాయర్ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(sachin Tendulkar) కూడా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాటు... చాంపియన్స్ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్ నాయర్‌కు మాత్రం చోటు దక్కలేదు.కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?ఈ విషయం గురించి అగార్కర్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్‌లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కాగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.ఇక రాజస్తాన్‌లో జన్మించిన కరుణ్ నాయర్.. దేశవాళీ క్రికెట్లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్‌గా ఆకట్టుకుంటూ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్‌కు చేరేలా చేశాడు. అందుకే వాళ్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశంఇంగ్లండ్తో టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్, వన్డే సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్ లేదంటే వైస్ కెప్టెన్ ఆప్షన్ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్ల పేర్ల((India Squad For Champions Trophy 2025)ను శనివారం వెల్లడించింది.సిరాజ్, సంజూకు మొండిచేయిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్టు వివరాలను మీడియాకు తెలిపాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి మాత్రం ట్రావెలింగ్ రిజర్వ్స్లో చోటు దక్కింది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా అతడిని ఎంపిక చేశారు.బుమ్రా ఫిట్నెస్ సాధిస్తాడా? మరోవైపు.. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఈ టోర్నీలో ఆడేది లేనిది తేలుతుంది. పేసర్ల విభాగంలో షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించాడు. అయితే, అందరూ ఊహించినట్లుగా సంజూ శాంసన్‌కు మాత్రం ఈసారి ఈ జట్టులో చోటు దక్కలేదు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు ఐసీసీని బీసీసీఐ ఒప్పించగా.. ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మేరకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఎనిమిది జట్లుఇక ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించగా.. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టిన ఏడు జట్లు తమ ప్రదర్శన ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. వరల్డ్‌కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాలతో పాటు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఉన్నాయి.ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టీ20తో మెగా సమరం మొదలుకానుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టీమిండియా- ఇంగ్లండ్‌కు ఈ వన్డే సిరీస్ ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డేలలో కూడా ఇదే జట్టు ఆడనుండగా.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్‌లోకి వస్తాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనబోయే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత్. -
చాంపియన్స్ ట్రోఫీ: భారత జట్టు ప్రకటన తేదీ ఖరారు!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నీకి శనివారం టీమిండియాను ప్రకటించనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి మీడియా ముఖంగా జట్టు వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) చివరగా 2017లో జరిగింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. దుబాయ్లోఇక మెగా ఈవెంట్‌కు వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై కాగా.. ఆతిథ్య జట్టు హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను కూడా ఒప్పించింది. ఈ క్రమంలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ మెగా టోర్నీకి ప్రొవిజనల్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13ను డెడ్‌లైన్‌గా విధించగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే తమ టీమ్‌ల వివరాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్ మాత్రం గడువు పొడిగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.అదే రోజు ఇంగ్లండ్‌తో వన్డేలకు జట్టు ప్రకటనఈ నేపథ్యంలో శనివారం(జనవరి 18)న తమ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇక అదే రోజు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కూడా టీమ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.ఇక ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుండగా.. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన దాయాదుల పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టు (అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ సాధిస్తే), మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం! ఆమె ఎవరంటే? -
గంభీర్, రోహిత్‌తో అగార్కర్ భేటీ!.. గుర్రుగా ఉన్న యాజమాన్యం!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) గురించే చర్చ. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత ఈమేర ఘోర పరాభవం ఎదుర్కోవడం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ జట్టు లోని అగ్రశ్రేణి క్రికెటర్లయిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఆస్ట్రేలియా గడ్డపై మునుపెన్నడూ లేని రీతిలో ఘోరంగా విఫలమవడం అందుకు ప్రధాన కారణం. ఈ సిరీస్ ముగించి భారత్ కి తిరిగిరాక ముందే జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. భారత్ క్యాంప్‌లో విభేదాలు ఉన్నాయని, జట్టు ఓటమికి ఇదే ముఖ్య కారణమని విమర్శలు వచ్చాయి. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ టీం మేనేజిమెంట్ జట్టు కూర్పులో సరైన నిర్ణయాలు తీసుకోలేదనేది ఈ విమర్శల సారాంశం.గుర్రుగా ఉన్న అగార్కర్!ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా జట్టు వైఫల్యాన్ని సమీక్షించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలవడానికి సిద్దమౌతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో సెలెక్టర్లు, బోర్డులోని ప్రధాన అధికారుల మధ్య అనేక అధికారిక, అనధికారిక సమావేశాలు జరుగుతాయని.. భారత్ టెస్ట్ క్యాలెండర్, జట్టు ఆస్ట్రేలియాలో పేలవమైన ప్రదర్శన గురించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గంభీర్ బాధ్యత ఎంత?భారత్ జట్టు వైఫల్యానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు ఒక కారణమని, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత భారత్ జట్టు పతనం ప్రారంభమైందని భజ్జీ వ్యాఖ్యానించాడు. భారత్ జట్టు టి 20 ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం ద్రావిడ్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు. 'గత ఆరు నెలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. భారత్ T20 ప్రపంచ కప్ చేజిక్కించుకుంది. అయితే గంభీర్ పదవిని చేప్పట్టినుంచే భారత్ జట్టు పతనం ప్రారంభమైంది," అని భజ్జీ వ్యాఖ్యానించాడు.'ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి'జాతీయ సెలెక్టర్లు ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని హర్భజన్ కోరుతున్నాడు. “మీరు పేరు ప్రతిష్టల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటే, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఇతర మ్యాచ్ విన్నర్లను జట్టులో చేర్చుకోండి. బీసీసీఐ, సెలక్టర్లు సూపర్ స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలి' అని భజ్జీ హితవు పలికాడు. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందనేది భజ్జీ వాదన.సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. "అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు తీసుకెళ్లారు, కానీ అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే కదా సరైనా రీతిలో రాణిస్తున్నాడో లేదో తెలుస్తుంది. సర్ఫరాజ్ విషయంలోనూ అదే తప్పిదం జరిగిందని," హర్భజన్ పేర్కొన్నాడు.ఇక ఇంగ్లండ్ పర్యటన(టెస్టులు)కు ఏడు నెలల వ్యవధి ఉన్నందున భారత్ జట్టు పునర్నిర్మాణానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. "బంతి ఇప్పుడు సెలెక్టర్ల కోర్టులో ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా" అని హర్భజన్ ముగించాడు.చదవండి: ‘బుమ్రాను అస్సలు కెప్టెన్ చేయకండి.. కెప్టెన్సీకి వాళ్లే బెటర్ ఆప్షన్’ -
మెల్‌బోర్న్‌లోనే అగార్కర్?.. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) త్వరలోనే రిటైర్ కానున్నాడా? బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక భారత జట్టు ఓడిపోతే.. అతడు టెస్టుల నుంచి కూడా తప్పుకుంటాడా?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ప్రధానంగా నడుస్తున్న చర్చ ఇదే!వరుస వైఫల్యాలుగతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు రావడానికి కారణం అతడి పేలవ ఫామ్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆటగాడిగా.. కెప్టెన్‌గా రోహిత్ విఫలమయ్యాడు. సొంతగడ్డపై కివీస్‌తో సిరీస్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా.. 2, 52, 0, 8, 18, 11.ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో.. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలిసారి ఇంతటి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరాలంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో కచ్చితంగా నాలుగు టెస్టులు గెలవాల్సిన స్థితిలో నిలిచింది.చావో- రేవోఅయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో టీమిండియాను ముందుకు నడిపించిన జస్ప్రీత్ బుమ్రా భారీ విజయం అందించాడు. ఇక రెండో టెస్టు నుంచి రోహిత్ జట్టుతో చేరినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.రోహిత్ కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో పింక్‌బాల్ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. మూడో టెస్టులోనూ విఫలమై.. వర్షం కారణంగా అదృష్టవశాత్తూ డ్రా చేసుకోగలిగింది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలోనూ రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు ఇన్నింగ్స్ ఆడి 3, 6, 10 పరుగులు చేశాడు.ఓపెనర్‌గా వచ్చినా నో యూజ్!ఇక మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులోనూ రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు, మూడు టెస్టుల్లో మిడిలార్డర్లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ టెస్టులో మాత్రం తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. కానీ.. ఈసారి కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు.ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో మరో పేసర్ స్కాట్ బోలాండ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. నిజానికి అనవసరపు షాట్‌కు యత్నించి అతడు వికెట్ పారేసుకోవడంతో విమర్శలు మరింత పదునెక్కాయి.మెల్‌బోర్న్‌లోనే అగార్కర్?.. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో గనుక భారత జట్టు ఓడిపోతే.. రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.రోహిత్ మనసులో ఏముందో?అదే విధంగా.. రోహిత్ సైతం ఈసారి తన సారథ్యంలో భారత్ డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైతే.. రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. 37 ఏళ్ల హిట్‌మ్యాన్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాగా డబ్ల్యూటీసీ మొట్టమొదటి సీజన్ 2019-21లో కోహ్లి కెప్టెన్సీలో ఫైనల్ చేరిన టీమిండియా.. న్యూజిలాండ్‌కు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక 2021-23 సీజన్లో రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకున్నా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఫైనల్‌కు చేరేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మపై మునుపెన్నడూ లేని విధంగా ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా కెప్టెన్ హోదాలో టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత రోహిత్ కేవలం టెస్టు, వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం Indian skipper Rohit Sharma is gone for just three runs! #AUSvIND pic.twitter.com/m1fLiqKLO7— cricket.com.au (@cricketcomau) December 27, 2024 -
BCCI: గంభీర్‌ను ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపకండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడిని మరోసారి మీడియా సమావేశానికి పంపవద్దంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశాడు. గంభీర్‌కు బదులు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌నే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపాలని సూచించాడు.టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాతకాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో సోమవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్న గౌతీ.. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.నష్టమేమీ లేదుఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఫామ్ గురించి తమకు ఆందోళన లేదంటూ.. వారిని విమర్శిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌కు గౌతీ కౌంటర్ ఇచ్చాడు. ఇక కివీస్ చేతిలో పరాభవం నుంచి పాఠాలు నేర్చకుంటామని.. విమర్శలను స్వీకరిస్తూనే ముందడుగు వేస్తామని పేర్కొన్నాడు. అంతేకాదు.. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చాడు. అయితే, కొన్నిసార్లు మీడియా ప్రశ్నలకు గంభీర్ దూకుడుగా.. మరికొన్నింటికి దాటవేత ధోరణి అవలంబించినట్లుగా కనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘‘ఇందాకే గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అతడిని ఇలాంటి పనులకు దూరంగా ఉంచితేనే బీసీసీఐకి మంచిది.అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయం. మీడియాతో మాట్లాడేటపుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి పదాలు వాడాలో అతడికి తెలియదు. రోహిత్, అగార్కర్ అతడి కంటే చాలా బెటర్. వాళ్లిద్దరినే మీడియా ముందుకు పంపిస్తే మంచిది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నాలుగు గెలిస్తేనేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో చివరగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. ఇందులో భాగంగా భారత్- ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల🗣️ We are absolutely keen to go out there, perform, and try and win the seriesHead Coach Gautam Gambhir ahead of #TeamIndia's departure to Australia for the Border-Gavaskar Trophy.#AUSvIND | @GautamGambhir pic.twitter.com/MabCwkSPGL— BCCI (@BCCI) November 11, 2024 -
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్..
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మయాంక్.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను మెయిడెన్ ఓవర్‌తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్ సాధించాడు. -
ఆ ముగ్గురి సహకారంతోనే టీ20 వరల్డ్‌కప్ గెలిచాం: రోహిత్
నిన్న (ఆగస్ట్ 21) జరిగిన సియెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి జై షా, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని అన్నాడు. ఈ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు. జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు. నేను నా టీమ్ వరల్డ్‌కప్ సాధించడానికి ఈ ముగ్గురే కీలకమని ఆకాశానికెత్తాడు. జట్టుగా మేం రాణించడానికి ఆ ముగ్గురు ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని తెలిపాడు.తన కెప్టెన్సీ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. తాను ఆషామాషీగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవలేదని, కెప్టెన్‌గా ఇంతటితో ఆగేది లేదని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు. కాగా, నిన్న జరిగిన ఫంక్షన్లో రోహిత్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు లభించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టీమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. -
పంత్‌కు నో ఛాన్స్!.. టీమిండియా భవిష్య కెప్టెన్ అతడే
టీమిండియా భవిష్య కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చాడు. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా చూసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.అయితే, ఏ విషయంలోనూ గ్యారెంటీ ఇవ్వలేమని.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం గిల్‌కే తమ ఓటు అని అగార్కర్ పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు.కెప్టెన్‌గా అలరించిన గిల్కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టు స్వదేశానికి తిరిగి రాగా.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.తొలిసారిగా కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించిన గిల్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాను 4-1తో విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా గిల్ పేరును ప్రకటించింది బీసీసీఐ.సీనియర్లను కాదనివన్డేల్లో రోహిత్ శర్మ సారథిగా కొనసాగనుండగా.. టీ20 రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. వీళ్లిద్దరికి డిప్యూటీగా శుబ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చింది.అయితే, కెప్టెన్సీ రేసులో ఉన్న సీనియర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలను కాదని బీసీసీఐ గిల్‌ను వైస్ కెప్టెన్ చేయడం విశేషం.ఈ విషయంపై సోమవారం నాటి మీడియా సమావేశంలో ప్రస్తావనకు రాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘రిషభ్ చాలా కాలంగా ఆటకు దూరమయ్యాడు. వికెట్ కీపర్‌గా అతడి సేవలు మాకు చాలా అవసరం.అందుకే పంత్‌కు నో ఛాన్స్దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన ఆటగాడిపై భారం మోపాలని మేము భావించడం లేదు. ఇక కేఎల్ రాహుల్ చాలా కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు.ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మేము సిద్ధమయ్యాం. టీ20 కెప్టెన్ విషయంలో గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.రోహిత్ లేనపుడు హార్దిక్ పాండ్యా గాయపడితే పరిస్థితి గందరగోళంగా ఉండేది. అయితే, అదృష్టవశాత్తూ వరల్డ్‌కప్ నాటికి రోహిత్ తిరిగి రావడం మంచిదైంది. కానీ మరోసారి రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేము.రిస్క్ చేయలేంశుబ్మన్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఏడాది కాలంగా అద్బుతంగా ఆడుతున్నాడు. సూర్య, రోహిత్ ఉన్నపుడే అతడిని నాయకుడిగా నైపుణ్యాలు మెరుగుపరచుకునేలా గిల్‌కు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.అకస్మాత్తుగా కొత్త కెప్టెన్‌ను ట్రై చేయాలంటే రిస్కే. అందుకే ఇప్పటి నుంచే అతడిని భవిష్య కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. కెప్టెన్‌గా తను అనుభవం గడిస్తే మాకు తలనొప్పులు తగ్గుతాయి.ఇప్పుడే కాదు అయితే, ఇందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏదీ కచ్చితంగా చెప్పలేము. రెండేళ్లపాటు అతడిని గమనిస్తూనే ఉంటాం’’ అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకతో సిరీస్ మొదలుపెట్టనుండగా.. హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో గౌతీతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫన్స్‌లో అగార్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు: అగార్కర్ -
టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు: అగార్కర్!
టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీకి ముహర్తం ఖారరైనట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కాలి మడమ గాయం కారణంగా షమీ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లండన్‌లో తన మడమ గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న షమీ.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీలో పునరావసం పొందుతున్నాడు.అయితే షమీ తన గాయం నుంచి శర వేగంగా కోలుకుంటున్నాడు. షమీ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం నెట్స్‌లో జాగ్రత్తగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పూర్తిస్థాయి తీవ్రతతో బౌలింగ్ చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది.ఇక షమీ రీ ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం తాజాగా స్పందించాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సమయానికి షమీ పునరాగమనం చేసే ఛాన్స్ ఉందని అగార్కర్ తెలిపాడు."ప్రస్తుతం భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు గాయాలతో సతమతవుతున్నారు. అందులో ఒకరు మహ్మద్ షమీ. షమీ ప్రస్తుతం తిరిగి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికం. సెప్టెంబరు 19నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనున్నాం.ఆ సమయానికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాము. షమీ బంగ్లా సిరీసే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను. ఎన్సీఏ ఆధికారులను అడిగి అప్డేట్ తెలుసుకోవాలి. మాకు బంగ్లాతో సిరీస్ తర్వాత చాలా టెస్టులు ఉన్నాయి. కాబట్టి షమీ లాంటి బౌలర్ కచ్చితంగా మాకు అవసరం. గత కొంత కాలంగా టెస్టుల్లో బుమ్రా, షమీ, సిరాజ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్లగా కొనసాగుతున్నారు. టెస్టు ఫార్మాట్‌కు సెట్ అయ్యేలా బౌలర్లను తయారు చేయాల్సిన సమయం వచ్చింది. త్వరలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ప్రారంభం కాబోతంది. అక్కడ మెరుగ్గా రాణించే వారికి భారత జట్టులోకి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగర్కార్ పేర్కొన్నాడు. -
జడేజాను ఎంపిక చేయకపోవడంపై వివరణ ఇచ్చిన అగార్కర్
శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లకు సంబంధించి అభిమానుల్లో నెలకొని ఉన్న పలు అనుమానాలను సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇవాళ (జులై 22) నివృత్తి చేశాడు. టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అగార్కర్.. లంక పర్యటన కోసం కొందరు ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ఫిట్నెస్ కారణంగా హార్దిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ అప్పగించలేదని చెప్పిన అగార్కర్.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించలేదని వివరణ ఇచ్చాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జడ్డూకు విశ్రాంతి కల్పించినట్లు తెలిపాడు. ఒకవేళ అక్షర్‌తో పాటు జడేజాను కూడా ఎంపిక చేసినా.. తుది జట్టులో ఒక్కరికే అవకాశం దక్కుతుందని తెలిపాడు. టీమిండియా సమీప భవిష్యత్తులో చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటం జడ్డూకు విశ్రాంతినివ్వడానికి మరో కారణమని అన్నాడు. వన్డేల్లో జడ్డూ ఇప్పటికీ కీలక ఆటగాడేనని వివరణ ఇచ్చాడు. అగార్కర్-గంభీర్ ప్రెస్ మీట్లో హార్దిక్, జడ్డూ అంశాలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.టీ20 వరల్డ్‌కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలకు 2027 వన్డే వరల్డ్‌కప్ ఆడగలే సత్తా ఉందని గంభీర్, అగార్కర్ అభిప్రాయపడ్డారు.కోహ్లితో తన మంచి సత్సంబంధాలు ఉన్నాయని గంభీర్ వివరణ ఇచ్చాడు.శుభ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్ల ప్లేయర్ అని గంభీర్-అగార్కర్ ద్వయం అభిప్రాయపడింది.షమీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తాడని గంభీర్-అగార్కర్ జోడీ ఆశాభావం వ్యక్తిం చేసింది.రుతురాజ్, అభిషేక్ శర్మలను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. బాగా ఆడినా కొన్ని సార్లు అందరికీ అవకాశం ఇవ్వలేమని అగార్కర్ తెలిపాడు.హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోయినా ఇప్పటికీ అతను కీలక ఆటగాడని గంభీర్ అన్నాడు.కాగా, గంభీర్-అగార్కర్ ప్రెస్ మీట్ అనంతరం భారత బృందం శ్రీలంక పర్యటనకు బయల్దేరింది. శ్రీలంకతో టీ20 సిరీస్ జులై 27న మొదలవుతుంది. 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. -
అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించకపోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. హార్దిక్ మెరుగైన నైపుణ్యాలున్న ఆల్‌రౌండర్ అని.. అయితే, అతడి ఫిట్నెస్ విషయంలో మాత్రం క్లారిటీ లేదన్నాడు.అలాంటి ఆటగాడిని జట్టుకు ఎంపిక చేసేటపుడే కోచ్, సెలక్టర్ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుందన్న అగార్కర్.. మరి ఏకంగా కెప్టెన్‌గా ఎలా నియమించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా జట్టులో అతడు కీలక ఆటగాడని.. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నాడు.పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకున్న ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్.. భారత్ ఈ ఐసీసీ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. టీ20 వరల్డ్‌కప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియామకం ఖరారు అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది బీసీసీఐ.శ్రీలంక పర్యటన నుంచి సూర్య పగ్గాలు చేపడతాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌కు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి ముంబైలో సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన అగార్కర్.. ‘‘అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండి.. అన్నింటిలోనూ చురుగ్గా ఆడగల కెప్టెన్ కావాలని మేము కోరుకుంటున్నాం.అలాంటి కెప్టెన్ మాత్రమే మాకు కావాలిహార్దిక్ విషయంలో ఈ అంశంపై స్పష్టత లేదు. అతడి విషయంలో ఫిట్నెస్ అతి పెద్ద సవాలు. అదే కోచ్, సెలక్టర్లను ఇబ్బంది పెడుతోంది. తదుపరి టీ20 ప్రపంచకప్ దాకా మాకు సమయం ఉంది.హార్దిక్ విషయంలో ఫిట్నెస్ ఒక్కటే ప్రామాణికం. జట్టుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కెప్టెన్ మాత్రమే మాకు కావాలి. ఇక సూర్య.. కెప్టెన్ కావడానికి గల అన్ని అర్హతలు, నైపుణ్యాలు అతడికి ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రాణించగల సత్తా సూర్యకు ఉందని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అదే విధంగా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అవసరం జట్టుకు ఎంతగానో ఉందని తెలిపాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. -
'అదే హార్దిక్ కొంపముంచింది'.. అగార్కర్ అస్సలు ఒప్పుకోలేదంట!?
టీమిండియా నూతన టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టీ20ల్లో రోహిత్ శర్మ వారుసుడిగా సూర్యకుమార్ భారత జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా సూర్య ప్రస్ధానం మొదలు కానుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌లోనూ, భారత జట్టు తత్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటకి కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేయలేదన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.ఇందుకు ఒక్కొక్కరు ఒక్క కారణం చెబుతున్నారు. కొంత మంది ఫిట్నెస్ వాళ్లే అతడిని ఎంపిక చేయలేదని, మరికొంత మంది శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను తప్పించడం అందరని విస్మయానికి గురిచేసింది.ఒప్పుకోని అగార్కర్..కాగా హార్దిక్ పాండ్యాకు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ ఒప్పుకోలేదంట. పాండ్యా కెప్టెన్సీపై తనకు నమ్మకం లేదంటూ అగార్కర్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అందుకు ఐపీఎల్లో పాండ్యా కెప్టెన్సీనే కారణమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేర్చినప్పటకి.. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఐపీఎల్-2024లో అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అగార్కర్ అండ్ కో సైతం పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌పై సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి. మరోవైపు భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపినట్లు తెలుస్తోంది. -
Ind vs SL: అగార్కర్‌తో గంభీర్ భేటీ అప్పుడే! ఆ ఇద్దరి రీ ఎంట్రీ!
టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం జూలైలో ఆరంభం కానుంది. ఈనెల చివర్లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే విడుదల చేసింది.రెండు వేదికల్లో 13 రోజులపాటు జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది. పల్లెకెలో మైదానంలో జూలై 26, 27, 29వ తేదీల్లో వరుసగామూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.అనంతరం ఆగస్టు 1, 4, 7 తేదీల్లో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక గురించి హెడ్ కోచ్ గౌతం గంభీర్ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో వచ్చే వారం భేటీ కానున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌లకు కూడా మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో లంకలో పర్యటించే జట్ల ఎంపిక కూర్పుపై.. ముఖ్యంగా కెప్టెన్ల విషయంలో గౌతీ అజిత్‌తో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. కాగా కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో పునరాగమనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ లంకతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ గురించి కూడా ఈ భేటీలో గంభీర్ అజిత్‌తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.ఇక ఒకవేళ హార్దిక్ విశ్రాంతి కోరుకోనట్లయితే అతడికి టీ20 పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి.అదే విధంగా సీనియర్ల గైర్హాజరీలో శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,ఆవేశ్ ఖాన్, అభిషేక్ శర్మ తదితర యువ ఆటగాళ్లు లంకతో టీ20 సిరీస్ ఆడబొయే జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీళ్లంతా జింబాబ్వే పర్యటనలో ఉన్నారు.ఇక ఈసారి టీమిండియా- శ్రీలంక సిరీస్‌కు మరో ప్రత్యేకత ఏర్పడింది. రెండు జట్లూ ఈసారి కొత్త హెడ్ కోచ్‌ల పర్యవేక్షణలో ద్వైపాక్షిక సిరీస్‌లో పోటీపడనున్నాయి. టీమిండియాకు గౌతం గంభీర్... శ్రీలంకకు సనత్ జయసూర్య హెడ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.గందరగోళంగా శ్రీలంక జట్టు పరిస్థితిగత నెలలో వెస్టిండీస్–అమెరికాలలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్ బాటనే కెప్టెన్ కూడా అనుసరించాడు. శ్రీలంక టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ వైదొలిగాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌ను శ్రీలంక కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడనుంది. -
T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయడం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి అతడిని ఏకంగా వైస్ కెప్టెన్‌గా ప్రకటించడానికి కారణం ఏంటి?..ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా ప్రకటించింది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి మరీ పగ్గాలు అతడికి అప్పగించింది.అయితే, పాండ్యా యాజమాన్యం అంచనాలు అందుకోలేకపోయాడు. అంతేకాదు జట్టులో సీనియర్లు అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లతో పాండ్యాకు సఖ్యత లేనట్లు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వర్గాలుగా విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పేలవంగా సాగడం, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలవడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. కెప్టెన్‌గా విఫలమైన పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ చెప్పుకోగదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 144.93 స్ట్రైక్‌రేటుతో 200 పరుగులు స్కోరు చేయడంతో పాటు 10.59 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. అయితే, ఆరంభంలో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో ఫామ్‌లో లేకున్నా పాండ్యాకు చోటు ఇవ్వడం పట్ల బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమాధానిమిస్తూ.. తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో పాండ్యా మాదిరి బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమర్థవంతమైన పేస్ ఆల్‌రౌండర్ లేనందు వల్లే అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ ఆసక్తికర కథనం వెలువరించింది. రోహిత్, అగార్కర్‌లకు ఇష్టం లేకపోయినా.. ఒత్తిడిలో కూరుకుపోయినందు వల్లే పాండ్యాను సెలక్ట్ చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేనందు వల్లే వైస్ కెప్టెన్‌గా ప్రకటించినట్లు వెల్లడించింది. -
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
టీ20 వరల్డ్‌కప్-2024కు ప్రకటించిన భారత జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వని సెలక్టర్లు.. నామమాత్రంగా స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అద్బుత ఫామ్‌లో రింకూను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టులో అదనపు బౌలర్ అవసరం ఉండటంతోనే రింకూను సెలక్ట్ చేయలేదని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్ట్రా స్పిన్నర్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. -
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
ఐపీఎల్-2024 ముగియగానే టీ20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ మొదలుకానుంది. మే 26న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ షురూ కానుంది. ఇక టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఈవెంట్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఈ రన్‌మెషీన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లలో కలిపి 147.49 స్ట్రైక్‌రేటుతో 500 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, టీ20లలో కోహ్లి స్ట్రైక్‌రేటు టీమిండియాకు ఇబ్బంది కానుందంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా.. ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు.అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరంఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించాడు. ‘‘కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి మేము చర్చించలేదు. ఐపీఎల్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరం. మా జట్టు ప్రస్తుతం పూర్తి సమతూకంగా ఉంది. ఐపీఎల్ నుంచి సానుకూల అంశాలను మాత్రమే మనం స్వీకరించాలి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడేటపుడు ఒత్తిడిని జయించే అనుభజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా కోహ్లి కోసం యువ ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ వేశాడు అగార్కర్. రోహిత్ శర్మతో కలిసి గురువారం నాటి మీడియా సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగానే రోహిత్ శర్మ మాత్రం నవ్వేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అందుకే రాహుల్‌ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్ -
అందుకే రాహుల్‌ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్‌ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్‌ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు."రాహుల్ టీ20ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఎంపిక చేయాలనకున్నాం. అందుకే రాహుల్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లకు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లగా ఎంపిక చేశాము. వీరిద్దరికి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని" ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
టీ20 ప్రపంచకప్-2022 తర్వాత తాను అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. నాడు టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలోనే పొట్టి ఫార్మాట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నట్లు తెలిపాడు.కాగా వరల్డ్‌కప్-2022లో భారత జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన బీసీసీఐ నాటి సెలక్షన్ బోర్డును రద్దు చేసింది. అయితే, చీఫ్ సెలక్టర్‌గా తిరిగి చేతన్ శర్మనే కొనసాగిస్తూ సభ్యులను మాత్రం మార్చింది. ఈ క్రమంలో చేతన టీమిండియాపై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడగా.. అతడిని తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను నియమించింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి దాదాపు ఏడాది కాలం పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై చర్చ నడిచింది. టీ20 ప్రపంచకప్-2024లో వీరిద్దరు ఆడతారా లేదా అనే సందేహాల నడుమ అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది కూడా. అదే విధంగా హిట్‌మ్యాన్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి గురువారం మీడియా ముందుకు వచ్చిన రోహిత్ శర్మ టీ20లలో తన గైర్హాజరీ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ‘‘టీ20 ప్రపంచకప్ జరుగుతుందన్న సమయంలో మేము చాలా వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు మిస్సయ్యాం.టెస్టు ఫార్మాట్లో మ్యాచ్‌లను మిస్ చేసుకోవాలని ఎవరూ భావించరు. నిజానికి ఈ ఫార్మాట్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి కూడా. ఈ విషయం గురించి నేను సహచర ఆటగాళ్లు, కోచ్‌లతో చర్చించాను.ఆ తర్వాత అజిత్ వచ్చాడు. మేము చర్చించిన అంశాల గురించి అప్పుడు అతడికి తెలియదు. ఎప్పుడు ఏ ఫార్మాట్‌కు సంబంధించి కీలక ఈవెంట్ ఉంటుందో అదే ఫార్మాట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని భావించాం.తొలుత టీ20 ప్రపంచకప్, తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్.. అనంతరం 50 ఓవర్ల క్రికెట్లో వరల్డ్‌కప్.. ఈ క్రమంలోనే చాలా వరకు టీ20లు నేను మిస్సయ్యాను’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుండగా.. జూన్ 5 టీమిండియా తమ తొలిమ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. -
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్‌గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్‌లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
T20 World Cup 2024: ఓ ఆటగాడి కోసం చీఫ్ సెలెక్టర్‌కు రెకమండ్ చేసిన రైనా
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఓ ఆటగాడిగా కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు రెకమండ్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను టీ20 వరల్డ్‌కప్ 2024కు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. శివమ్ దూబే కోసం వరల్డ్‌కప్ లోడ్ అవుతుంది. అగార్కర్ భాయ్.. దయ చేసి దూబేని సెలెక్ట్ చేయండని రైనా ట్వీట్ ద్వారా అగార్కర్‌ను కోరాడు.ఓ మాజీ ఆటగాడు ఓ ఆటగాడి కోసం రెకమండ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా పేరున్న ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడు. అయితే రైనా మాత్రం తన ఇగోను, ఇతర విషయాలను పక్కన పెట్టి భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను వరల్డ్‌కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని చీఫ్ సెలక్టర్‌ను కోరాడు. ఏప్రిల్ నెలాఖరులోపు వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైనా ప్రతిపాదన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. World Cup loading for Shivam dube ! @imAagarkar bhai select karo please 🇮🇳🙏 https://t.co/b7g0BxHRSp— Suresh Raina🇮🇳 (@ImRaina) April 23, 2024 కాగా, మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివమ్ దూబే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో ఆల్‌రౌండర్ స్థానానికి దూబే పర్ఫెక్ట్ సూట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా చెత్త ప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో దూబే భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.దూబేకు బంతితోనూ సరైన అవకాశాలు లభిస్తే.. వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. దూబే బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ దూబే వరుస అర్దశతకాలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో దూబే బ్యాటింగ్ మెరుపులు పతాక స్థాయిలో ఉన్నాయి.ప్రస్తుత సీజన్లో అతను ఇప్పటికే మూడు అర్దసెంచరీలు చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇరదీశాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వల్ల దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. దూబే ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బంతితో రాణిస్తే వరల్డ్‌కప్ బెర్త్ దక్కడం ఖాయం. -
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్‌గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్‌లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్‌పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్, ఆడం గిల్‌క్రిస్ట్‌లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్‌గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్‌మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్‌తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్‌లో కోహ్లి తను రెగ్యులర్‌గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్‌కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్‌లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: రోహిత్‌తో ద్రవిడ్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్‌ను ఫైనల్‌కు తీసుకువచ్చాడు. కలిసిరాని కాలం కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ విఫలం ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? లేడా? ఆల్‌రౌండర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పాండ్యా హిట్టింగ్‌కు తోడు అదనపు సీమర్‌గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయం అతడే! ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా హిట్టింగ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్‌కు చోటిచ్చేస్తారా? Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్ -
తెలివి తక్కువ వాళ్ల జోక్యం వద్దు.. కోహ్లి విషయంలో పట్టుబట్టిన రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో విరాట్ కోహ్లికి స్థానం ఉండబోదన్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కీర్తి ఆజాద్ ఘాటుగా స్పందించాడు. జట్టు ఎంపిక విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకపోతేనే బాగుంటుందని హితవు పలికాడు. ఎవరేమనుకున్నా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. కోహ్లి వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు కీర్తి ఆజాద్ వెల్లడించాడు. కాగా యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో విరాట్ కోహ్లిని పక్కనపెట్టాలని టీమిండియా సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాల మేరకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ మేరకు గత వారం టెలిగ్రాఫ్ కథనం ప్రచురించగా.. బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ఐసీసీ ఈవెంట్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విజేత జట్టులోని సభ్యుడు కీర్తి ఆజాద్ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా తన కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జై షా సెలక్టర్ కాదు కదా! కోహ్లికి టీ20 జట్టులో చోటు ఇవ్వకుండా అతడెందుకు అజిత్ అగార్కర్‌ను.. మిగతా సెలక్టర్లను కూడా ఇందుకు ఒప్పించమని అడుగుతాడు? జట్టు ఎంపిక కోసం మార్చి 15 వరకు సమయం ఇచ్చారట. సోర్సెస్ చెప్పినవే నిజమనుకుంటే.. కోహ్లి విషయంలో అజిత్ అగార్కర్ మిగతా సెలక్టర్లతో పాటు తనను తాను కూడా కన్విన్స్ చేయలేకపోయాడు. జై షా రోహిత్ శర్మను ఈ విషయం గురించి అడుగగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లి జట్టులో ఉండాల్సిందే అని రోహిత్ స్పష్టం చేశాడు. ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి కచ్చితంగా ఆడతాడు. జట్టు ఎంపిక ప్రకటన కంటే ముందే అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుంది. జట్టు ఎంపిక ప్రక్రియ విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకూడదు’’ అని కీర్తి ఆజాద్ పేర్కొన్నాడు. కాగా జూన్‌లో వెస్టిండీస్-అమెరికా వేదికగా ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కుమారుడు అకాయ్ జననం(ఫిబ్రవరి 15) నేపథ్యంలో విరాట్ కోహ్లి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన అతడు.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లి ఐపీఎల్-2024 బరిలో దిగనున్నాడు. గత సీజన్లో ఈ రన్‌మెషీన్ 14 మ్యాచ్‌లు ఆడి 639 పరుగులు చేశాడు. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్! Why should Jay Shah, he is not a selector, to give responsibility to Ajit Agarkar to talk to the other selectors and convince them that Virat Kohli is not getting a place in the T20 team. For this, time was given till 15th March. If sources are to be believed, Ajit Agarkar was… pic.twitter.com/FyaJSClOLw — Kirti Azad (@KirtiAzaad) March 17, 2024 -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్‌లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్‌గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్‌దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్‌ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జురెల్‌ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్‌ను ఆడించడంలో అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్‌పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్‌లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల
BCCI Men's Senior Selection Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి మెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీలోని ఓ సభ్యుడిపై వేటు పడింది. అతడి స్థానంలో కొత్త మెంబర్‌ను నియమించేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అతడిపై వేటు అయితే, అనేక చర్చల అనంతరం మళ్లీ చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్‌గా నియమించిన బోర్డు.. సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శివ్ సుందర్ దాస్, ఎస్.శరత్‌లకు కమిటీలో సభ్యులుగా చోటిచ్చింది. అయితే, ఓ వార్తా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వేటు వేసింది బీసీసీఐ. చాలాకాలం పాటు చీఫ్ సెలక్టర్ పోస్టు ఖాళీగా ఉన్న తరుణంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆ పదవిని చేపట్టేలా బోర్డు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ పనిచేస్తోంది. త్యాగం చేయాల్సి వస్తోంది అయితే, ఇందులో భాగమైన సలీల్ అంకోలా తన పదవిని త్యాగం చేయాల్సి వస్తోంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ సహా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల నుంచి ఒక్కో సభ్యుడు ఉండాలి. ప్రస్తుతం ఉన్న కమిటీలో అగార్కర్, సలీల్ వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. శివ సుందర్ ఈస్ట్, శరత్ సౌత్, సుబ్రతో బెనర్జీ సెంట్రల్ జోన్ నుంచి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అగార్కర్‌ను కొనసాగించేందుకు నిర్ణయించిన బీసీసీఐ వెస్ట్ నుంచి అదనపు సభ్యుడిగా ఉన్న సలీల్ అంకోలాను తప్పించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త మెంబర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సెలక్షన్ కమిటీ మెంబర్ కావాలంటే అర్హతలు ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. 10 అంతర్జాతీయ వన్డేలు లేదంటే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అదే విధంగా ఆట నుంచి రిటైర్ అయ్యి ఐదేళ్లు పూర్తై ఉండాలి. అదే విధంగా.. గత ఐదేళ్లకాలంలో ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. కాగా బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు జనవరి 25, సాయంత్రం ఆరు లోగా తమ అప్లికేషన్ సమర్పించాలి. -
T20: రోహిత్ ఒక్కడే రీఎంట్రీ.. కోహ్లికి నో ఛాన్స్? అగార్కర్ ఆలోచన?!
అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనం చేస్తారా? లేదంటే ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే అంతర్జాతీయ టీ20లలో వాళ్ల రీఎంట్రీ ఉంటుందా? ఒకవేళ అఫ్గన్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నా.. ఐపీఎల్లో తమను తాము నిరూపించుకుని తిరిగి జట్టుతో చేరతారా? టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో టీమిండియా సగటు అభిమానులను గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ప్రశ్నలు ఇవి!! పొట్టి ఫార్మాట్లో 2022 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఇంతవరకు ఒక్క ఇంటర్నేషనల్ టీ20 కూడా ఆడలేదు. హార్దిక్ పాండ్యా పేరు దాదాపుగా ఖరారు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వివిధ సిరీస్‌లలో టీమిండియా టీ20 కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా పాండ్యా పేరు దాదాపుగా ఖాయమైపోగా.. సూర్య వైస్ కెప్టెన్ పదవిని దక్కించుకోవడం లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సహా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, పీయూశ్ చావ్లా తదితరులు రోహిత్, కోహ్లిలాంటి సీనియర్లు లేకుండా టీ20 ప్రపంచకప్ బరిలో దిగితే జట్టుకు నష్టమేనని వాదిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించగల సత్తా ఇంకా వీరిలో మిగిలే ఉందని.. కాబట్టి విరాహిత్ ద్వయం సిద్ధంగా ఉంటే టీ20లలో కొనసాగించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరో ఒక్కరే రీఎంట్రీ? ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉంటామని చెప్పిన రోహిత్- కోహ్లి ఇంకా ఈ విషయంపై స్పష్టతకు రాలేదన్నది దాని సారాంశం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సైతం వీరిద్దరిలో ఎవరో ఒకరినే ఆడిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జట్టు కూర్పు విషయంలో ఎటూ తేల్చుకోకపోవడం వల్లే ఇంకా జట్టును ప్రకటించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగార్కర్ అంతటి సాహసం చేస్తాడా? ఈ క్రమంలో బీసీసీఐ మాజీ సెలక్టర్ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ జట్టులో రోహిత్, శుబ్‌మన్ గిల్, విరాట్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తమ టాప్-5 స్థానాలను నిలబెట్టుకుంటే.. లెఫ్టాండర్‌ను ఎక్కడ ఆడిస్తారు? ఒకవేళ ఎడమ చేతి వాటం బ్యాటర్ కోసం కోహ్లిని తప్పించి.. అతడి స్థానంలో గిల్‌ను వన్‌డౌన్‌లో ఆడించి.. రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తే... ఎలా ఉంటుంది??.. అయితే, అజిత్ కోహ్లిని డ్రాప్ చేయగల సాహసం చేయగలడా??’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గాయాల కారణంగా హార్దిక్, సూర్య అందుబాటులో లేకుంటే రోహిత్ కెప్టెన్‌గా తిరిగి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉంటే ఇద్దరూ ఉంటారు.. లేదంటే ఇద్దరూ ఉండరు కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి వస్తే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ, ఫినిషర్‌గా రింకూ సింగ్ మాత్రం తన స్థానాలు నిలబెట్టుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా పూనుకుంటే తప్ప రోహిత్- కోహ్లి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కోహ్లి- రోహిత్‌లలో తీసుకుంటే ఇద్దరినీ తీసుకుంటారని.. లేదంటే ఇద్దరినీ డ్రాప్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఐపీఎల్-2024 ముగిసిన తర్వాతే వీరిద్దరు టీ20 ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అన్నది తేలుతుందని జోస్యం చెబుతున్నారు. మరోవైపు.. టీమిండియాతో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ 19 మంది సభ్యులతో జట్టును శనివారం ప్రకటించింది. -
Rohit- Kohli: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం!
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు టీమిండియాకు కేవలం మూడే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్ ఆడతారా? లేదా? స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు వీరు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న విషయం గురించి క్లారిటీ తీసుకోవాలని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా టోర్నీకి ముందు జరుగనున్న ఈ సిరీస్‌కు జట్టును ప్రకటించే అంశంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోనూ చర్చలు జరిపేందుకు.. అజిత్ అగార్కర్‌తో పాటు శివ్ సుందర్ దాస్, సలీల్ అంకోలా సౌతాఫ్రికాకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే. అఫ్గన్‌తో సిరీస్‌లో కెప్టెన్ ఎవరు? ఈ నేపథ్యంలో ఈ ఏడాది విరాహిత్ ద్వయం వరల్డ్‌కప్-2024 ఆడతారా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో వీరు ఫామ్‌లోనే ఉన్న కారణంగా 2024 సీజన్ తర్వాత భారత టీ20 జట్టుతో చేరతారా? లేదంటే అంతకంటే ముందే అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీ20 సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. వరల్డ్‌కప్‌నకు ఆఖరి సన్నాహకంగా భావిస్తున్న అఫ్గన్‌తో సిరీస్ నాటికి వీరిద్దరు గాయాల బారి నుంచి కోలుకోకపోతే జట్టును ముందుకు నడిపించేది ఎవరన్న సందేహాల నడుమ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో తాజాగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సఫారీ పర్యటనలో టీమిండియా కాగా టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టెస్టులో ఓడిపోయిన భారత జట్టు.. బుధవారం నుంచి మొదలుకానున్న రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లు ముగిసిన తర్వాతే టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో 25- 30 మంది క్రికెటర్లను ప్రస్తుతం మానిటర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జూన్ 4 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా అభిమానులకు శుభవార్త: హార్దిక్ పాండ్యా వీడియో వైరల్ -
బీసీసీఐ కసరత్తు.. ఆరోజే రోహిత్, కోహ్లి టీ20 భవితవ్యం తేలేది!
టీమిండియా ఈ ఏడాది చివరి విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. ప్రొటిస్ గడ్డపై డిసెంబరు 10 నుంచి దాదాపు నెల రోజుల పాటు సుదీర్ఘ పర్యటన కొనసాగించనుంది. టీ20 సిరీస్‌తో మొదలుపెట్టి టెస్టు సిరీస్‌తో జనవరిలో ఈ టూర్‌ను ముగించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. వచ్చే వారం ఇందుకు సంబంధించి జట్టు ఎంపికను పూర్తి చేయన్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా సెలక్షన్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023కి సన్నద్ధమయ్యే క్రమంలో గతేడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇకపై వారిద్దరు పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో ఉంటారో లేదోనన్న విషయంపై అజిత్ అగార్కర్ బృందం తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్-2024కి షెడ్యూల్ ఖరారైన తరుణంలో ‘విరాహిత్’ ద్వయం కొనసాగుతారా లేదోనన్న అంశంపై తేల్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు గనుక వీరిద్దరు అందుబాటులో ఉంటే ప్రపంచకప్ ఆడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇక ఇంటర్నేషనల్ టీ20లలకు 36 ఏళ్ల రోహిత్, 35 ఏళ్ల కోహ్లి వీడ్కోలు పలికినట్లే అర్థమంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు వెల్లడించాయి. కాగా రోహిత్ టీ20లతో పాటు వన్డేలకూ దూరం కానుండగా.. కోహ్లి చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సౌతాఫ్రికా టూర్ సందర్భంగా ఈ ఇద్దరిని టీమిండియా తరఫున టీ20లలో చూస్తామా లేదా అన్నది తేలే ఛాన్స్ ఉంది. చదవండి: సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు.. -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్‌పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్‌లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్‌లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్‌లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్‌లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్‌లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్‌లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్‌లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్‌లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్‌లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్‌లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
అందుకే అక్షర్‌ను తీసుకున్నాం..ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు! మేము క్లియర్‌గానే ఉన్నాం!
India World Cup 2023 squad: ‘‘జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో కొందరికి నిరాశ కలగడం సహజం. సమతూకం కోసమే శార్దుల్, అక్షర్‌లను తీసుకున్నాం. గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్లో బలహీన బ్యాటింగ్‌తో సమస్య ఎదుర్కొన్నాం. 8వ, 9వ స్థానాల్లో ఆడేవారు కూడా కొన్ని పరుగులు చేయడం అవసరం. వారికి ఆ విషయం స్పష్టంగా చెప్పాం కూడా. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ ఆట చూస్తే అతను ఎంత కీలకమో అర్థమవుతుంది. ఫైనల్‌తో కలిపితే 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టి20లతో పోలిస్తే వన్డేల్లో కోలుకునేందుకు, వ్యూహాలు రూపొందించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. అందుకే అక్షర్‌కు చోటు అన్ని రకాలుగా ఈ టీమ్ అత్యుత్తమం అని మేం భావిస్తున్నాం. టీమ్ ప్రకటించేందుకు ముందు ఎంతో చర్చించి, ఎంతో ఆలోచింతాం. ఎంపికతో ఎంతో సంతృప్తిగా ఉన్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టు సమతూకం కోసం ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ పేరును చేర్చినట్లు వెల్లడించాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ మంగళవారం.. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టును ప్రకటించాడు. నాడు రోహిత్‌ను కాదన్న ధోని ఈ సందర్భంగా టీమ్‌లో స్థానం దక్కదని వాళ్ల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్న హిట్‌మ్యాన్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. కాగా 2011 వరల్డ్‌కప్ సమయంలో రోహిత్ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లు సూచించినప్పటికీ.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పీయూశ్ చావ్లా కోసం అతడిని పక్కన పెట్టాడని ఇటీవలే మాజీ సెలక్టర్ రాజా వెంకట్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే ఆఫ్ స్పిన్నర్ ఆలోచన విరమించుకున్నాం: అగార్కర్ జట్టులో ఇప్పుడు ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేవు. అందరూ పూర్తిగా కోలుకున్నారు. ఎన్సీఏలో జరిగిన క్యాంప్‌లో రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు కీపింగ్ కూడా చేశాడు. కాబట్టి అతని గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆఫ్స్పిన్నర్పై చర్చ జరిగింది. అయితే జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థంగా బౌలింగ్ చేయగలరని నమ్ముతున్నాం. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టి ఆఫ్‌స్పిన్నర్ ఆలోచనను పక్కన పెట్టాం’’ అని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ ఎంపికలను సమర్థించుకున్నాడు. కాగా 2011 నాటి వరల్డ్‌కప్ జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అదే విధంగా సచిన్ టెండుల్కర్, సురేశ్ రైనా రూపంలో మంచి ఆప్షన్లు ఉండేవి. ఇక 2019 నాటికి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఆఫ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈసారి మాత్రం ఉపఖండ పిచ్‌పై ఆఫ్ స్పిన్నర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుండటంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్ -
WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
India Playing XI- KL Rahul vs Ishan Kishan: ప్రపంచకప్-2023 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్.. ఇద్దరికీ చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆసియా కప్ వన్డే ఈవెంట్‌తో జట్టులోకి పునరాగమనం చేశాడు కేఎల్. జాతీయ క్రికెట్ అకాడమీలో నెలలపాలు పునరావాసం పొంది రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. కేఎల్ రాహులా? లేదంటే ఇషాన్? అయితే, గాయం వెంటాడటంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ కర్ణాటక బ్యాటర్ సూపర్-4 మ్యాచ్‌తో మైదానంలో దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే.. సదరు మ్యాచ్‌లో తుదిజట్టులో కేఎల్ రాహుల్‌కు చోటిస్తే ఇషాన్ పరిస్థితి ఏమిటన్న చర్చలు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ రాహుల్ కోసం... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసిన ఇషాన్‌ను పక్కనపెడితే అంతకంటే మూర్ఖత్వం ఉండదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్ జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇలాంటి తలనొప్పి మంచిదే కదా! ఇందుకు స్పందనగా.. ‘‘ఇలాంటి తలనొప్పి మంచిదే? కాదంటారా? ఇషాన్ గత మ్యాచ్‌లో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సాధారణంగా అతడు ఓపెనర్‌గా వస్తాడు. అలాంటిది మిడిలార్డర్లో గొప్పగా రాణించాడు. కాబట్టి కేఎల్ జట్టులో ఉంటే ఇద్దరిలో ఎవరిని ఆడించాలన్న తలనొప్పి తప్పదు. ఇషాన్ కిషన్ ఇద్దరూ ఉన్నా.. వన్డే క్రికెట్లో కేఎల్ రికార్డు అద్భుతమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు వచ్చాడంటే ఇలాంటి సందిగ్దం ఉండటం సహజం. అయినా.. ఇద్దరు ఉన్నారే అని బాధపడే బదులు మన ముందు రెండు మంచి ఆప్షన్లు ఉన్నాయని సంతోషించవచ్చు కదా!’’ అని అజిత్ అగార్కర్ బదులిచ్చాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ఆటగాళ్ల ఫిట్నెస్ను బట్టే తుదిజట్టు కూర్పు ఉంటుందని.. అందులో ఇద్దరు ఒకే రకమైన ప్లేయర్లు ఉండటం అసాధ్యమేమీ కాదని పేర్కొన్నాడు. చదవండి: వన్డే వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్ -
అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్
India's ODI World Cup 2023 Squad: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై హర్భజన్ సింగ్ స్పందించాడు. మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడం ఏమిటంటూ ‘ఎక్స్’ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం ప్రపంచకప్ జట్టును ప్రకటించాడు. ఈసారి కూడా మొండిచేయి! ఇందులో.. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్రౌండర్లకు చోటు దక్కింది. అయితే, ఆసియా కప్ జట్టులో స్థానం లేనప్పటికీ అనుభవం దృష్ట్యానైనా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఈసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. చహల్ కానీ.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా.. ఇకపై రిస్ట్ స్పిన్నర్లు కుల్-చా ద్వయాన్ని ఒకే జట్టులో చూడలేమన్న మాటలను నిజం చేస్తూ అగార్కర్.. చహల్‌పై వేటు పడటానికి కారణాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో చైనామన్ స్పిన్నర్‌కు చోటు దక్కగా.. చహల్‌కు భంగపాటు తప్పలేదు. ఆశ్చర్యం వేసింది ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ప్రపంచకప్ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్యూర్ మ్యాచ్ విన్నర్ తను’’ అని ట్వీట్ చేశాడు.ఘీ క్రమంలో నెటిజన్లు సైతం యుజీకి మద్దతు తెలుపుతూ భజ్జీని సమర్థిస్తున్నారు. చహల్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా అన్యాయం జరిగిందని మరికొంత మంది వాపోతున్నారు. అక్షర్ వద్దు.. ఎందుకంటే! తన వరల్డ్‌కప్ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటిచ్చిన హర్భజన్ సింగ్.. అక్షర్ పటేల్‌ను విస్మరించిన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘రవీంద్ర జడేజా.. అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు. చహల్ బౌలింగ్ శైలి వేరు. అతడు మ్యాచ్ విన్నర్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి గణాంకాలు గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వన్డే, టీ20లలో చహల్ లాంటి ప్రభావంతమైన స్పిన్నర్ లేడనే చెప్పాలి. జడ్డూ ఎలాగో జట్టులో ఉంటాడు కాబట్టి.. అక్షర్‌ను పక్కనపెట్టి యుజీని తీసుకుంటే బాగుంటుంది అని వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు భజ్జీ తన అంచనా తెలియజేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023కి హర్భజన్ ఎంచుకున్న జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్. చదవండి: తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్ Surprise not to see @yuzi_chahal in the World Cup squad for Team India. pure Match winner — Harbhajan Turbanator (@harbhajan_singh) September 5, 2023 -
WC 2023: వాళ్లే బెస్ట్.. ఇకపై నేను మీకు జవాబు ఇవ్వను: రోహిత్ శర్మ
India's ODI World Cup 2023 Squad- Rohit Sharma Comments: ‘‘మా దృష్టి మొత్తం ట్రోఫీ గెలవడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇక నుంచైనా బయట వాగే చెత్త గురించి వరల్డ్‌కప్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో నన్ను ప్రశ్నించరని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇకపై నేను అలాంటి కామెంట్లపై మీకు సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదు. మేము ప్రొఫెషనల్స్. మేమేం చేయాలో నాతో పాటు మా ఆటగాళ్లకు కూడా తెలుసు’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. దయచేసి అనవసర విషయాల గురించి ప్రస్తావించవద్దని విజ్ఞప్తి చేశాడు. అత్యుత్తమైన వాళ్లనే సెలక్ట్ చేసుకుంటాం టీమిండియాకు ఆడుతున్న క్రికెటర్ల నుంచి అత్యుత్తమైన 15 మందిని మాత్రమే తాము ఎంచుకోగలమని నొక్కివక్కాణించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి బీసీసీఐ జట్టును మంగళవారం ప్రకటించింది. ఆసియా కప్-2023 ప్రధాన జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణ మినహా మిగతా వాళ్లనే ఐసీసీ ఈవెంట్‌కు సెలక్ట్ చేసింది. ఈ క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల అభిప్రాయాలు.. జట్టుపై విమర్శల నేపథ్యంలో విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందుకు స్పందించిన రోహిత్ ఈ మేరకు కాస్త గట్టిగానే బదులిచ్చాడు. ఆసీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్ అదే విధంగా జట్టు గురించి చెబుతూ... ‘‘అందుబాటులో ఉన్న వాళ్ల నుంచి అత్యుత్తమ టీమ్‌ను ఎంపిక చేసుకున్నాం. మా బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది. మా దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు. ఇతర బౌలింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి’’ అని రోహిత్ పేర్కొన్నాడు. జట్టుకు మేలు చేసే విధంగానే తమ నిర్ణయాలు ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా అక్టోబరు 5న చెన్నైలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్-2023 టోర్నీకి తెరలేవనుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. చదవండి: తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్ కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు -
తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అగార్కర్
India's ODI World Cup 2023 Squad- Ajit Agarkar Comments: సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడనున్న 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించాడు. అగార్కర్ ముందుగా చెప్పినట్లుగానే ఆసియా వన్డే కప్ ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేశారు. ఊహించినట్లుగానే యువ ఆటగాళ్లు పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కలేదు. ఇక యజువేంద్ర చహల్‌కు కూడా ఈ వరల్డ్‌కప్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇదే ఫైనల్.. మార్పుల్లేవు.. కానీ కాగా ఈ ప్రొవిజినల్ జట్టే ఫైనల్ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కుండబద్దలు కొట్టాడు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానుంది. టైటిల్ వేటలో పది జట్లు ఆతిథ్య టీమిండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. నాడు ధోని సిక్సర్‌తో.. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు నాటి కెప్టెన్ ధోని. తద్వారా 28 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం కావాలని.. రోహిత్ సేన వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ODI WC 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. వారిద్దరూ ఔట్ కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు "Dhoni finishes off in style!" 🇮🇳🏆 Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp — ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018 -
Ind Vs Pak: కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? పాక్ క్రికెటర్ రియాక్షన్..
India Vs Pakistan- "Bolne se kuch nahi hota": దాయాదులు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు ఇలాంటి హై వోల్టేజ్ తాజా మ్యాచ్ కి శ్రీలంక లోని పల్లకెలే వేదిక కానుంది గెలుపే లక్ష్యంగా ఆసియా కప్-2023 లో భాగంగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ పోటీ పడనున్నాయి. ఈ వన్డే కప్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా దాయాదిపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పూనకాలు వస్తాయని తెలిసిందే. గతేడాది ఐసీసీ T20 టోర్నీలో ఈ విషయాన్నీ మరోసారి నిరూపించాడు. పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించాడు. కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో .. కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులే అని తేలింది. పాక్ స్టార్ రియాక్షన్ ఇదే! ఇదే విషయాన్నీ కొంతమంది రిపోర్టర్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దగ్గర ప్రస్తావించారు. అజిత్ అగార్కర్ ఆ మాటలు అన్నారా లేదా అన్నది పక్కన పెడితే .. ఇలాంటి కామెంట్లపై మీరేమంటారు అని ప్రశ్నించారు. అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో గెలుపు తర్వాత ప్రెస్ మీట్ సందర్భంగా షాదాబ్ ఈ ప్రశ్నలకు బదులిస్తూ అందరికి ఆట తోనే సమాధానం ఇస్తామని పేర్కొన్నాడు. ప్రగల్బాలు మ్యాచ్ రోజు ఏం జరుగుతుందనే దాని పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనైనా మా జట్టు లో ఎవరైనా.. లేదంటే ప్రత్యర్థి టీం లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే వాస్తవం అందరికి బోధపడుతుంది అని షాదాబ్ ఖాన్ ప్రగల్బాలు పలికాడు. కాగా లెగ్ స్పిన్నర్ అయిన షాదాబ్ ఖాన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటర్‌గానూ రాణించగలడు. ఇక పాక్ పేస్ దళంలో ఫాస్ట్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షా గత కొంత కాలంగా మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! అతడు మొదలు పెట్టేశాడు -
ఫిట్‌గా లేనప్పుడు ఎందుకు సెలక్ట్ చేశారు? వేరే వాళ్లని బలిచేసి..
'What is all this? Don't Select Him?: ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేనప్పుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుకని టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు. ఫిట్నెస్ లేని ఆటగాడి కోసం మిగతా వాళ్లను బలి చేయడం సరికాదంటూ మండిపడ్డాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ స్వయంగా చెప్పాడు ఈ క్రమంలో బీసీసీఐ.. సోమవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు సుదీర్ఘకాలం పాటు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెగా టోర్నీతో పునరాగమనం చేయనున్నట్లు వెల్లడించాడు. ఫిట్‌గా లేనివాడిని ఎందుకు ఎంపిక చేయడం? అయ్యర్ వంద శాతం ఫిట్నెస్ సాధించాడని.. రాహుల్‌ను గాయం వెంటాడుతోందని అగార్కర్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, ఈ వన్డే ఈవెంట్లో రెండు లేదంటే మూడో మ్యాచ్ నుంచి అతడు అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్ విన్నర్ శ్రీకాంతాచారి తన యూట్యూబ్ చానెల్ వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. అసలేంటి ఇదంతా? ‘‘కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేడని వాళ్లే చెప్పారు. ఒకవేళ ఆటగాడికి గాయం తాలుకు నొప్పి ఉంటే అతడిని సెలక్ట్ చేయొద్దు. సెలక్షన్ సమయంలో పూర్తి ఫిట్‌గా లేడని తెలిసినపుడు అతడిని ఎంపిక చేయొద్దనేది మన పాలసీ కదా! సెలక్షన్ నాటికి ఫిట్‌గా లేనివాడికి అవకాశం ఇవ్వడం దేనికి? ఒకవేళ వరల్డ్‌కప్ నాటికి అతడిని సిద్ధం చేయాలనుకుంటే.. అప్పుడే సెలక్ట్ చేయండి. అది వేరే విషయం. అంతేగానే ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఆడడు కానీ.. అతడిని సెలక్ట్ చేశాం. సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశాం అనడం.. అసలేంటి ఇదంతా? ఇలా చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’’ అంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేశాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ చిక్కా చురకలు అంటించాడు. ఆసియా వన్డే కప్-2023 బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. -
అందుకే తిలక్‌ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
Asia Cup 2023 India Squad: ‘‘మేం ఇప్పుడు 18 మందిని ఎంపిక చేశాం. ఈ జాబితా నుంచే వరల్డ్ కప్ టీమ్‌ను ఎంచుకోవడం ఖాయం. ఎంపికకు ముందు మన జట్టు ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. అన్నీ చూశాకే నిర్ణయం తీసుకుంటాం. రాహుల్ రెండో మ్యాచ్ వరకు పూర్తిగా కోలుకోగలడని ఆశిస్తున్నాం. రెండో మణికట్టు స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో యుజువేంద్ర చహల్‌ను పక్కన పెట్టాం. వెస్టిండీస్‌లో తిలక్ ఆట మమ్మల్ని ఆకట్టుకుంది. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే వన్డేల్లో తీసుకున్నాం. ఎడంచేతివాటం కూడా అదనపు అర్హత’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా వన్డే కప్-2023 టోర్నీకి జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ జట్టులోనూ వీళ్ల నుంచే! ఈ ఈవెంట్లో ఆడే ఆటగాళ్ల నుంచే సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2023కి కూడా జట్టును ఎంపిక చేస్తామని అగార్కర్ స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ నేపథ్యంలో జట్టుకు చాన్నాళ్లుగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా వెస్టిండీస్‌లో సత్తా చాటిన తెలుగు తేజం తిలక్ వర్మను అదృష్టం వరించింది. ఏకంగా ఆసియా కప్ వంటి మెగా టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం అతడి ముంగిట నిలిచింది. తిలక్‌కు లక్కీ చాన్స్... హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఇటీవల వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 173 పరుగులతో భారత్ తరఫున టాపర్‌గా నిలిచాడు. అయితే అతని స్కోర్లకంటే క్రీజ్‌లో అతని ఆత్మవిశ్వాసం, పోరాటతత్వం అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పటి వరకు వన్డేలే ఆడకపోయినా అతనికి అవకాశం దక్కింది. దేశవాళీ వన్డేల్లో తిలక్ రికార్డు చాలా బాగుంది. 25 మ్యాచ్‌లలో 56.18 సగటుతో అతను 1,236 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉండగా స్ట్రయిక్‌రేట్ కూడా 101.64 కావడం అతని దూకుడును చూపిస్తోంది. ఆసియా వన్డే కప్-2023కి బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్ చదవండి: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 11 బంతుల్లోనే -
అలా చేయడానికి మేమేమీ పిచ్చోళ్లం కాదు.. కోహ్లి..: రోహిత్ శర్మ కౌంటర్
"Pagalpanti Nahi" - Rohit Sharma Comments Viral: ‘‘ఓపెనర్లు వాళ్ల స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. ఇక నంబర్ 3లో విరాట్ కోహ్లి ఫిక్స్. గాయం కారణంగా జట్టును వీడకముందు కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆసియా కప్ టోర్నీలోనూ అదే చేస్తాడు. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో వస్తాడు. ఏడో స్థానం రవీంద్ర జడేజా కోసం. నంబర్ 4- 5 మధ్య కొన్నిసార్లు ఆటగాళ్ల ఆర్డర్ మారుస్తాం. దాని వల్ల ఎటువంటి సమస్యా ఉండదు. చివరాఖరికి జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాకు ముఖ్యం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మేమేమీ పిచ్చోళ్లం కాదు.. బ్యాటింగ్ ఆర్డర్లో పదే పదే ప్రయోగాలు చేయడానికి పిచ్చోళ్లమేమీ కాదని విలేకరులకు కౌంటర్ ఇచ్చాడు. కాగా పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2023కి బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాల నేపథ్యంలో విలేకరులు హిట్‌మ్యాన్‌కు ప్రశ్నలు సంధించారు. సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని అడిగారు. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో? ఇందుకు పైవిధంగా స్పందించిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి తామేమీ పిచ్చోళ్లం కాదంట తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేను వన్డే జట్టులోకి వచ్చినపుడు యువకులకు ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ లేదు. నేను లోయర్ ఆర్డర్ నుంచే మొదలుపెట్టాను. తర్వాత ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాను. అంతేగానీ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం.. ఎనిమిదో నంబర్ ఆటగాడిని ఓపెనర్‌గా పంపడం వంటి పిచ్చి పనులు చేయము’’ అని రోహిత్ పేర్కొన్నాడు. విండీస్ పర్యటనలో ప్రయోగాలు కాగా విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో యువకులను ప్రమోట్ చేసిన రోహిత్ శర్మ.. తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన రెండు వన్డేల్లో రోహిత్, విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసియా కప్-2023నకు ముందు రోహిత్, కోహ్లి వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగి కాస్త తడబడ్డా.. ఆపై నిలదొక్కుకోవడం యువ జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపింది. చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్.. అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు Rohit in Press Conferences gotta be my fav genre 🤣🤣🤣#AsiaCup2023pic.twitter.com/H6FisJ81Td — Shivani (@meme_ki_diwani) August 21, 2023 -
WC 2023: ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్
End of road for Shikhar Dhawan! Ajit Agarkar confirms: వన్డేల్లో అద్భుత రికార్డులు.. ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్‌గా టీమిండియాను ముందుకు నడిపించి చరిత్ర సృష్టించిన సందర్భాలు.. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు.. కానీ.. ఇవేమీ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ పొడిగించుకునేందుకు దోహదం చేయలేదు.. కొత్త నీరు వచ్చె.. పాత నీరు పోయె! కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్ల నుంచి ఎదురైన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్‌కు అవకాశాలు కరువయ్యాయి. వాళ్లు ముగ్గురే మా ప్రాధాన్యం అయితే.. ఇటీవల వీరిద్దరు విఫలమవుతున్న తరుణంలో ఆసియా కప్-2023 రూపంలో గబ్బర్‌కు మరో ఛాన్స్ దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు జోడీగా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్‌కు కూడా జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో గబ్బర్‌కు నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన సమయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. కానీ ప్రస్తుతం.. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు మాత్రమే ఓపెనర్లుగా మా ప్రాధాన్యం ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టాడు. ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్? ఇక ఆసియా కప్ జట్టే వన్డే వరల్డ్‌కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల నడుమ ధావన్ కెరీర్ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. ‘‘అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడు. ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. జట్టుకు అవసరమైన సమయంలో 100 శాతం కష్టపడ్డాడు. గబ్బర్ను తలచుకుంటే బాధేస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 143. చదవండి: అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! #WATCH | At the moment, Rohit Sharma, Shubman Gill and Ishan Kishan are our preferred openers...Shikhar Dhawan has been a terrific player for India, says BCCI chief selector Ajit Agarkar. pic.twitter.com/TqF6gV4869 — ANI (@ANI) August 21, 2023 -
పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! వచ్చాడనుకుంటే అంతలోనే..
India Asia Cup 2023 squad: ఆసియా కప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాక్- నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్‌నకు తెరలేవనుంది. ఇక హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న ఈ వన్డే టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనున్న విషయం తెలిసిందే. ధ్రువీకరించిన అగార్కర్ ఈ క్రమంలో సెప్టెంబరు 2న దాయాది పాకిస్తాన్‌తో పోటీతో భారత జట్టు ఈవెంట్లో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. పల్లకెలె వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ కీలక పోరుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ధ్రువీకరించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపాడు. ఓ శుభవార్త కూడా! అయితే, శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం శుభవార్త చెప్పాడు. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు డిక్లరేషన్ వచ్చింది. టీమిండియాకు ఇదొక గొప్ప వార్త. రాహుల్.. మళ్లీ అప్పుడే ఇక కేఎల్ రాహుల్‌ను మాత్రం గాయం వెంటాడుతోంది. అయితే, ఆసియా కప్‌లో టీమిండియా రెండు లేదంటే మూడో గేమ్ నాటికి అతడు అందుబాటులోకి రావొచ్చు. వీళ్లిద్దరు టీమిండియాకు అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లన్న సంగతి మనకు తెలుసు కదా!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023 ద్వితీయార్థంలో గాయపడ్డ కేఎల్ రాహుల్.. జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన రాహుల్.. ఇంకా వంద శాతం ఫిట్నెస్ పొందలేదని తాజాగా అగార్కర్ మాటల్ని బట్టి అర్థమవుతోంది. అందుకే సంజూ కూడా! మరోవైపు.. అయ్యర్ సైతం వెన్నునొప్పికి చికిత్స చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ స్టాండ్‌బైగా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, అతడు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్.. Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు ఛాన్స్ -
అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు
India Asia Cup 2023 squad: ‘‘టీమిండియా తరఫున అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. టెర్రిఫిక్ పర్ఫార్మర్. కానీ.. కొన్నిసార్లు సమతూకమైన జట్టును ఎంపిక చేసే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లలో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తను బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. నిజానికి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. 15 మందితో కూడిన జట్టు అయితే, ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరిని తప్పించాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తూ చహల్ డ్రాప్! లక్కీగా 17 మందికి చోటు ఉంది కాబట్టి.. సరిపోయింది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ అతడిని వదులుకోవాల్సి వచ్చింది. నిజానికి ప్రస్తుతం.. తన కంటే కుల్దీప్ ఓ అడుగు ముందే ఉన్నాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో మాకు మెరుగైన ఆప్షన్ అనిపించాడు. అందుకే చహల్ మిస్ అయ్యాడు’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా కప్-2023 వన్డే టోర్నీ నేపథ్యంలో.. బీసీసీఐ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై మాత్రం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అందుకే చహల్‌పై వేటు! జట్టు ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చహల్ గురించి ప్రశ్న ఎదురుకాగా అజిత్ అగార్కర్ పైవిధంగా స్పందించాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్లే చహల్‌ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆసియాకప్ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు అంటే.. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది. మరి వరల్డ్‌కప్‌లో..? ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు ఆసియా కప్ జట్టును ప్రొవిజినల్ టీమ్‌గా పరిగణిస్తున్న తరుణంలో చహల్‌పై వేటు పడటం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ కుల్దీప్‌నకు మద్దతుగా నిలవగా.. రోహిత్ శర్మ మాత్రం చోటు లేదు కాబట్టే అతడిని జట్టులోకి తీసుకోలేదన్నాడు. వరల్డ్‌కప్‌లో చహల్‌కు దారులు మూసుకుపోలేదని స్పష్టం చేయడం గమనార్హం. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో యుజీ చహల్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ గత రెండు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొడుతున్నాడు. చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! -
వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్ అగర్కార్.. ఎందుకంటే?
వెస్టిండీస్ టూర్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత జట్టు విజయ భేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్(171) సెంచరీతో చెలరేగగా.. అశ్విన్ బౌలింగ్‌లో 12 వికెట్లతో సత్తాచాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్ అగర్కార్ ఇక తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. జూలై 20 నుంచి ట్రినిడాడ్ వేదికగా రెండు టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత కొత్త సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వెస్టిండీస్‌కు వెళ్లనున్నాడు. అతడు నేరుగా ట్రినిడాడ్‌కు చేరుకుని భారత జట్టును కలవనున్నాడు. అగార్కర్ ఛీప్ సెలక్టర్‌గా ఎంపికైన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కలవలేదు. అతడు ఛీప్ సెలక్టర్‌గా ఎంపికైనప్పటికీ భారత జట్టు కరేబియన్ దీవుల్లో ఉంది. అదేవిధంగా ఐర్లాండ్ టూర్‌కు భారత జట్టు ఎంపిక గురించి రోహిత్, ద్రవిడ్‌తో అగార్కర్ చర్చించనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా విండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా అతిథ్య ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపే అవకాశం ఉంది. విండీస్‌తో టెస్టులకు భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ చదవండి: IND vs WI: 'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్ క్రికెట్‌ను ఏలుతాడు' -
భార్య ఫాతిమా ఘాడియాలితో అజిత్ అగార్కర్ అందమైన ఫొటోలు చూసేయండి
-
చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పారితోషికం ఎంతో తెలుసా?
బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం తాత్కాలిక సెలెక్టర్ శివ్‌సుందర్ దాస్ నేతృత్వంలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ప్యానెల్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విటర్లో పేర్కొంది. కాగా టీమిండియా తరపున 1998లో అరంగేట్రం చేసిన అగార్కర్ 2007 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 9 ఏళ్ల కెరీర్లో అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టి20 వరల్డ్‌కప్‌ను గెలిచిన టీమిండియా జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ముంబై జట్టుకు ప్రధాన సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటరీ ప్రొఫెషన్‌లోనూ అగార్కర్ తనదైన ముద్ర వేశాడు మరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అజిత్ అగార్కర్ పారితోషికం ఎంత ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ఇప్పటికైతే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు రూ. కోటి పారితోషికం చెల్లిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ కాకుండా మిగతా వారికి రూ.90 లక్షల చొప్పున ఏడాదికి చెల్లిస్తారు. అయితే అజిత్ అగార్కర్‌కు మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపేట్టేందుకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశం ఉంది. బీసీసీఐ కూడా చీఫ్ సెలెక్టర్ పదవికి పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అగార్కర్‌కు రూ. కోటి నుంచి మూడు కోట్ల వరకు చెల్లించే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక టీమిండియా తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇప్పటికి అజిత్ అగార్కర్ పేరిటే ఉంది. 2000వ సంవత్సరంలో జింబాబ్వేతో వన్డేలో అగార్కర్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అంతేకాదు అతి తక్కువ వన్డేల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గానూ అగార్కర్ నిలిచాడు. కేవలం 23 మ్యాచ్‌ల్లోనే అగార్కర్ ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా అగార్కర్ రికార్డు దశాబ్దం పాటు చెక్కుచెదరకుండా ఉంది. చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా Dhoni-Sakshi: 'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువయ్యాయా?' -
విండీస్‌తో టీ20 సిరీస్.. కొత్త చీఫ్ సెలక్టర్ వచ్చేశాడు! ఐపీఎల్ హీరోలకు ఛాన్స్
టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు. 45 ఏళ్ల అగార్కర్‌ను భారత జట్టు చీఫ్ సెలక్టర్‌గా నియమించినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కాగా సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ ఛేతన్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో టీమిండియా ఆటగాళ్లు, బోర్డు సభ్యులు, ఇతరత్రా వివరాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న చీఫ్ సెలక్టర్ పదవిని అగార్కర్ భర్తీ చేయనున్నాడు. శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సెలక్షన్ ప్యానల్‌కు అజిత్ అగార్కర్ చైర్మెన్‌గా ఉండనున్నాడు. ఇక సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్‌కు తొలి పరీక్ష వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయడం. ఇకఇప్పటికే విండీస్ టెస్టులకు, వన్డేలకు శివ సుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే టీ20 జట్టును మాత్రం ఎంపిక చేయలేదు. ఆ బాధ్యతను కొత్త చీఫ్ సెలక్టర్‌కు అప్పగించారు. ఈ క్రమంలో కొత్త చీఫ్ సెలక్టర్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును జూలై రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్ ఇక విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో పాటు శుబ్మాన్ గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి స్ధానంలో ఐపీఎల్లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురు కూడా ఈఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు చదవండి: టీమిండియా క్రికెటర్‌కు తప్పిన పెను ప్రమాదం -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం ఇంటర్వ్యూలు చేసింది. చివరకు అగార్కర్ పేరును ఈ పదవి కోసం సీఏసీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. అనంతరం అగార్కర్ అనుభవం దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ పదవికి కూడా సీఏసీ అతని పేరునే సూచించింది. ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది. 2000లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో అగార్కర్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్లేయర్‌గా కెరీర్ ముగిశాక అగార్కర్ ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్‌గా, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. క్రికెట్ దిగ్గజం ఒకరు అగార్కర్ పదవి చేపట్టడం వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా చీఫ్ సెలెక్టర్ జీతం విషయంలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐలో అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తికి కేవలం కోటి రూపాయల జీతం ఉండటంపై చాలా మంది ఈ పదవిపై ఆనాసక్తి చూపారు. డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే కారణంగా చీఫ్ సెలెక్టర్ పోస్ట్‌పై అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ: అజిత్ అగార్కర్ (చైర్మన్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్. -
BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్..
Virat Kohli And Rohit Sharma’s T20I Career To End?: ‘‘భవిష్యత్ ప్రణాళికల గురించి ఆటగాళ్లతో చర్చించడం చీఫ్ సెలక్టర్ ముఖ్య విధుల్లో ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుకు అతీతులు కారు. వాళ్లు కోరుకుంటే సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగవచ్చు. అయితే, ఎంతటి గొప్ప ఆటగాళ్లైనా సరే సమయం వచ్చినపుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడటంతో పాటు.. ఐపీఎల్ కూడా ఆడటం అంటే అంత తేలికేం కాదు’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20 కెరీర్‌ను ఉద్దేశించి ఇన్సైడ్ స్పోర్ట్‌తో మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ నియామకం తర్వాత పొట్టి ఫార్మాట్లో వీరిద్దరి భవితవ్యం తేలనుందనే సంకేతాలు ఇచ్చారు. కోహ్లి అలా.. రోహిత్ ఇలా కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా వైదొలగగా.. రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో కోహ్లి జట్టులో కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ కరువు తీర్చుకుంటూ ఆసియా కప్-2022 సందర్భంగా టీ20లలో తొలి శతకం బాదాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 టీ20 సెంచరీలు బాదిన రోహిత్.. ప్రస్తుతం తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తోంది బీసీసీఐ. భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహకాల్లో భాగంగా త్వరలోనే హార్దిక్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ రాజీనామా నేపథ్యంలో మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అజిత్ అగార్కర్ రాగానే ఇప్పటికే అగార్కర్ చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. త్వరలోనే అతడి నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెలక్టర్ రాగానే కోహ్లి, రోహిత్ టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత రానుందంటూ బీసీసీఐ అధికారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక వెస్టిండీస్ పర్యటనలోనూ టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్ స్వదేశానికి తిరిగి రానుండగా.. హార్దిక్ టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. చదవండి: Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి విరాట్ కోహ్లి!? CWC Qualifiers 2023: నెదర్లాండ్స్ ఆశలు సజీవం -
కోటి చాలదు! వద్దే వద్దు! ఇంకా పెంచుతాం.. బీసీసీఐ హామీ.. ఎట్టకేలకు..
BCCI New Chief Selector: టీమిండియా క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. వార్షిక వేతనం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చిన హామీ మేరకు ఈ మాజీ పేసర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చేతన్ శర్మ రాజీనామాతో కాగా ఓ ప్రైవేట్ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషరన్ వల్ల టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ పదవి ఊడిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు ఫిట్నెస్ లేకపోయినా ఇంజక్షన్లు తీసుకుని బరిలో దిగుతారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. దీంతో చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. సెహ్వాగ్ పేరు తెరపైకి! కొట్టిపడేసిన మాజీ ఓపెనర్ ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి స్టార్లను చీఫ్ సెలక్టర్‌గా నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనంటూ వీరూ భాయ్ కొట్టివేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా వ్యవహరించిన అజిత్ అగార్కర్ ఆ ఫ్రాంఛైజీతో బంధానికి వీడ్కోలు పలకడం చర్చకు దారి తీసింది. కోటి చాలదు! వద్దే వద్దు! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి చేపట్టేందుకు అగార్కర్ తొలుత సంశయించినా బోర్డు మాత్రం అతడిని ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి కోటి రూపాయాలు వేతనంగా చెల్లిస్తోంది బీసీసీఐ. కమిటీలోని మిగతా సభ్యులకు వార్షిక వేతనంగా 90 లక్షలు అందజేస్తున్నట్లు సమాచారం. ఇంకా పెంచుతాం.. బోర్డు హామీ అయితే, జీతం విషయంలో అగార్కర్ వెనకడుగు వేయగా.. వేతనం పెంచేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామెంటేటర్‌గా, కోచ్‌గా అగార్కర్ ఆర్జిస్తున్న మొత్తాన్ని భర్తీ చేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు గురువారం చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇందుకు సంబంధించి శనివారం (జూలై 1) ఇంటర్వ్యూ జరుగనుంది. ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2023 టోర్నీకి ముందు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ నియామకం ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. టీమిండియా తరఫున ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ టీమిండియా తరఫున 26 టెస్టులు, 188 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో టెస్టుల్లో 58, వన్డేల్లో 288, టీ20లలో మూడు వికెట్లు పడగొట్టి విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా పేరొందాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. చదవండి: ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది! Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!
త్వరలోనే భారత జట్టుకు సరికొత్త చీఫ్ సెలెక్టర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ కొత్త చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. కాగా గత రెండు సార్లు కూడా ఛీప్ సెలక్టర్ రేసులో అగార్కర్ పేరు వినిపించినప్పటికి.. అతడు ఈ పదవిని చేపట్టేందుకు సుముఖత చూపలేదు. అయితే ఈ సారి మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టేందుకు అజిత్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ జూలై మొదటి వారంలో అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో అప్పటి సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ భారత జట్టుకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేసి దొరికిపోవడంతో రాజీనామా చేశాడు. ఈ క్రమంలో చేతన్ శర్మ స్థానంలో సెలక్షన్ ప్యానల్లో సభ్యుడైన శివ్‌సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛీప్ సెలెక్టర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే త్వరలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు జరగనుండంతో పూర్తి స్థాయి ఛీప్ సెలెక్టర్‌ను ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ పడింది. ఈ క్రమంలోనే కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూలై 1 నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి. చదవండి: #ICCWorldCup2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం! -
మెరుగవ్వాలి కానీ దిగజారుతారా?! పాంటింగ్ హెడ్‌కోచ్ పదవి గోవిందా! వాళ్లు కూడా అవుట్!
IPL 2023- Delhi Capitals- Ricky Ponting- Sourav Ganguly: ఐపీఎల్-2023 సీజన్లో ఇంత వరకు విజయాల ఖాతా తెరవని ఒకే ఒక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 2020లో ఫైనల్ చేరిన ఢిల్లీ మళ్లీ ఆ స్థాయిలో ఇంతవరకు రాణించింది లేదు. మూడేళ్ల క్రితం ఫైనల్ వరకు వెళ్లిన ఢిల్లీ ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ మరుసటి ఏడాది ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక 2022లో మాత్రం కనీసం టాప్-4లో నిలవలేకపోయింది. 14 మ్యాచ్‌లకు గానూ ఏడింటి గెలిచిన ఢిల్లీ 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక తాజా ఎడిషన్‌లో మరీ ఘోరంగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది. దెబ్బ మీద దెబ్బ ఈ నేపథ్యంలో ఏడాదికేడాది మెరుగవ్వాల్సింది పోయి ఇలా దిగజారమేమిటని అభిమానులు మండిపడుతున్నారు. కాగా రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరం కావడం.. పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్ల వరుస వైఫల్యాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. పంత్ స్థానంలో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. సారథిగా ఆశించిన మేర రాణించలేక చతికిలపడ్డాడు. ఇక కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉండగా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందిస్తున్నాడు. మరోవైపు షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్, అజిత్ అగార్కర్, ప్రవీణ్ ఆమ్రే, బిజూ జార్జ్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. జంబో స్టాఫ్‌నకు స్వస్తి.. పాంటింగ్ పదవికి ఎసరు! తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్‌ను తగ్గించుకునే ఆలోచనలో పడిందట ఫ్రాంఛైజీ. జంబో స్టాఫ్‌ను తగ్గించడం సహా రిక్కీని హెడ్‌కోచ్‌గా కొనసాగించాలా లేదా అన్న విషయంపై కసరత్తు చేస్తోందట. ఈ మేరకు.. ‘‘కచ్చితంగా మార్పులు ఉండబోతున్నాయి. అయితే, సీజన్ మధ్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్లు జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్ సభ్యులు కలిసి కూర్చుని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ జంబో కోచింగ్ స్టాఫ్ కనుమరుగై పోవచ్చు. ముఖ్యంగా కొన్ని పెద్ద తలకాయలు ఇకపై జట్టుతో కొనసాగకపోవచ్చు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. 2018 నుంచి ఢిల్లీతో దీంతో పాంటింగ్ పదవి పోయే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆర్సీబీ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. గతంలో విజయాలకు క్రెడిట్ తీసుకున్న రిక్కీ పాంటింగ్ ఓటములకు కూడా బాధ్యత వహించాలంటూ విమర్శించిన విషయం తెలిసిందే. కాగా రిక్కీ పాంటింగ్ 2018 నుంచి ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’ చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా -
IPL: రూ. 2 కోట్లు.. సాల్ట్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే: అజిత్ అగార్కర్
IPL 2023 Mini Auction- Delhi Capitals: ‘‘ఫిల్ సాల్ట్ మంచి బ్యాటర్, వికెట్ కీపర్ కూడా! అయితే మా కెప్టెన్ రిషభ్ పంత్ రూపంలో మాకు వికెట్ కీపర్ ఉన్నాడు. కాబట్టి సాల్ట్‌ను కేవలం బ్యాటర్‌గానే ఉపయోగించుకుంటాం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అజిత్ అగార్కర్ అన్నాడు. కాగా కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో ఢిల్లీ ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. టీ20 ప్రపంచకప్-2022 గెలిచిన జట్టులో సభ్యుడైన ఈ 26 ఏళ్ల బ్యాటర్‌ను తమ సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా రాణించగల సాల్ట్ టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 167 మ్యాచ్‌లు ఆడి 3817 పరుగులు చేశాడు. అయితే, ఇంతవరకు అతడికి ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. సాల్ట్ గొప్ప బ్యాటర్ అంటూ కొనియాడాడు. అయితే, పంత్ ఉన్న కారణంగా సాల్ట్‌ను వికెట్ కీపర్‌గా చూసే అవకాశం లేదన్నాడు. ఇక ఇషాంత్ శర్మ గురించి చెబుతూ.. ‘‘అనుభవజ్ఞుడైన ఢిల్లీ ప్లేయర్ ఇషాంత్ శర్మ మాతో ఉన్నాడు. తన కెరీర్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో అందరికీ తెలుసు. అతడు మా జట్టులో ఉండటం సంతోషకరం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. 📹| Our Assistant Coach Ajit Agarkar spoke to us when we completed the signings of Phil Salt and Ishant Sharma, and his experience of being at the Auction table for the first time 🗣️#YehHaiNayiDilli #TATAIPLAuction #IPL2023Auction | @imAagarkar pic.twitter.com/IV20LRB7qi — Delhi Capitals (@DelhiCapitals) December 23, 2022 టాక్సీ డ్రైవర్ కొడుకుకు ఐదున్నర కోట్లు! కాగా.. టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్‌కు 50 లక్షలు వెచ్చించిన ఢిల్లీ యాజమాన్యం.. అన్క్యాప్డ్ స్పీడ్‌స్టర్ ముకేశ్ కుమార్ కోసం ఏకంగా ఐదున్నర కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయంపై ముకేశ్ స్పందిస్తూ.. ‘‘నా ఫ్రెండ్ ఫోన్ చేసి అభినందించే దాకా నేను వేలంలో అమ్ముడుపోయానన్న విషయం నాకు తెలియదు. అస్సలు నమ్మలేకపోతున్నా. గత సీజన్లో నెట్‌బౌలర్‌గా ఉన్నా. ఇప్పుడు జట్టుకు ఆడబోతున్నా’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఢిల్లీ ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు తెలిపాడు. బిహార్‌లో పుట్టి బెంగాల్‌కు ఆడుతున్నాడు ఈ పేసర్. ఇక టాక్సీ డ్రైవర్ కొడుకైన ముకేశ్ తొలిసారి ఇలా జాక్‌పాట్ దక్కించుకోవడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్.. వేలంలో కొన్న ఆటగాళ్లు ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు) చదవండి: IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట 🎶 𝘈𝘣 𝘮𝘶𝘴𝘩𝘬𝘪𝘭 𝘯𝘢𝘩𝘪 𝘬𝘶𝘤𝘩 𝘣𝘩𝘪, 𝘯𝘢𝘩𝘪 𝘬𝘶𝘤𝘩 𝘣𝘩𝘪 🥺🎶 A dream came true today 💙 Listen to Mukesh Kumar's story from the man himself 🤗#YehHaiNayiDilli #TATAIPLAuction #IPL2023 #IPL2023Auction pic.twitter.com/rueprZiQta — Delhi Capitals (@DelhiCapitals) December 23, 2022 -
BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలెక్షన్ కమిటీ రేసులో కొత్త పేర్లు
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్‌లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు.. సౌత్ జోన్.. హేమంగ్ బదానీ కన్వల్జిత్ సింగ్ వెస్ట్ జోన్.. మణిందర్ సింగ్ నయన్ మోంగియా సలీల్ అంకోలా సమీర్ దీఘే సెంట్రల్ అండ్ నార్త్ జోన్.. అజయ్ రాత్రా గ్యాను పాండే అమయ్ ఖురాసియా అతుల్ వాసన్ నిఖిల్ చోప్రా రితేందర్ సింగ్ సోధి ఈస్ట్ జోన్.. శివ్ సుందర్ దాస్ ప్రభంజన్ మల్లిక్ ఆర్ఆర్ పరిడా శుభోమోయ్ దాస్ ఎస్ లహిరి -
BCCI: కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2022, అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం విధితమే. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా, హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. సెలక్షన్ కమిటీ రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామకృష్ణన్‌కు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా శివరామకృష్ణన్ పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. రేసులో ఉన్న అజత్ అగార్కర్‌కు కూడా బోర్డులోని పలువురు ప్రముఖుల మద్దతు ఉండటంతో అతని అభ్యర్ధిత్వాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు.. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యి ఉండాలి ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు -
Ind Vs Eng: అరంగేట్రంలోనే అర్ష్‌దీప్ అదుర్స్.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
India Vs England 1st T20- Arshdeep Singh: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కల నెరవేరింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్‌తో అతడు అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకుని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక మొదటి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు 23 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్. అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసి 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. భారత మహిళా జట్టు బౌలర్ ఝులన్ గోస్వామి, అజిత్ అగార్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. 2006లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఝులన్.. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అగార్కర్ టీ20 ఫార్మాట్లో ఈ ఫీట్ నమోదు చేశారు. FIRST wicket for @arshdeepsinghh in International cricket 🙌 #ENGvIND pic.twitter.com/irEjeZeHz5 — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 రెండు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 3.3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రీస్ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్‌లను అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్‌పై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘టీమిండియాకు ఆడగల అన్ని అర్హతలు ఉన్న ఆటగాడివి. నీ ఎంట్రీ అదిరిపోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. WICKET!! Moeen Ali gone for 36 🙌 #ENGvIND pic.twitter.com/7Huolk9wu8 — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్‌దీప్ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత జట్టు సెలక్టర్ల దృష్టి ఆకర్షించి జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ 50 పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని మట్టికరిపించింది. చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు! Fantastic first over at the international level by Arshdeep singh. Way to go buddy. — Irfan Pathan (@IrfanPathan) July 7, 2022 -
'బుమ్రాకు టెస్టు క్రికెట్ ఆడటం ఈజీగా ఉన్నట్టు ఉంది'
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేసిన బుమ్రా... బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో బుమ్రాపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ కూడా చేరాడు. కెప్టెన్‌గా బమ్రా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించడాని అగార్కర్ కొనియాడాడు. "ఇదే సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో బుమ్రా, షమీ భాగస్వామ్యమే భారత్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ మెరుగ్గా బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాడు. దానిని జస్ప్రీత్ చక్కగా అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం బుమ్రాకు వైట్ బాల్ క్రికెట్ కంటే టెస్టు క్రికెట్ ఆడడం సులభంగా"ఉన్నట్టు ఉంది అని అగార్కర్ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. చదవండి: ENG vs IND: 19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. అభినందించిన బ్రియాన్ లారా -
IPL 2022: కీలక బాధ్యతల్లో అజిత్ అగార్కర్
Ajit Agarkar Announced DC Assistant Coach: టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. అగార్కర్‌ను జట్టు అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తూ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్‌తో కలిసి అగర్కార్ కోచింగ్ బాధ్యతలను షేర్ చేసుకుంటాడని డీసీ మేనేజ్మెంట్ పేర్కొంది. ఢిల్లీ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ నిమిత్తం ఇదివరకే ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లను నియమించుకుంది. హెడ్ కోచ్ పాంటింగ్ సిఫార్సు మేరకు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను, టీమిండియా మాజీ మిడిలార్డర్ ప్లేయర్ ప్రవీణ్ ఆమ్రేను డీసీ కోచింగ్ స్టాఫ్‌లో జాయిన్ చేసుకుంది. తాజాగా అజిత్ అగార్కర్ చేరికతో డీసీ అసిస్టెంట్ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గతేడాది నుంచి అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్న మహ్మద్ కైఫ్, అజయ్ రాత్రాలు కోచింగ్ టీమ్‌లో కొనసాగుతారని డీసీ స్పష్టం చేసింది. ఇక అగార్కర్ విషయానికొస్తే.. 44 ఏళ్ల ఈ టీమిండియా మాజీ బౌలర్.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడినప్పటికీ.. చేతన్ శర్మను ఆ పదవి వరించింది. 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అగార్కర్ 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్! -
ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్!
ICC World Cup 2023- Team India: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఈ బాధ్యతను తలకెత్తుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాలో కీలక సభ్యుడైన ఓ ఆటగాడు ఈ మేరకు అగార్కర్ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023 సన్నాహకాల్లో భాగంగా ఈ చర్చ తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది. ఈ మేరకు... ‘‘ప్రస్తుతం భారత క్రికెట్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్ ఆటగాడు... వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో అగార్కర్ వంటి అనుభవజ్ఞుడు.. టీమిండియా బౌలర్లకు మార్గనిర్దేశకుడిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. నిజానికి మాంబ్రే మంచి బౌలింగ్ కోచ్. అతడు ఇండియా ఏ, అండర్ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో తలమునకలై ఉంటే... అగార్కర్ సీనియర్లను చూసుకోవాలని భావిస్తున్నాడు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. కాగా భారత మాజీ సీమర్ పారస్ మాంబ్రే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అగార్కర్ విషయానికొస్తే.. 44 ఏళ్ల ఈ టీమిండియా మాజీ బౌలర్.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్‌గా ఉన్నాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడగా.. చేతన్ శర్మను ఆ పదవి వరించింది. కాగా 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అగార్కర్ 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గరం -
IND Vs WI: ఓపెనర్‌గా పంత్.. మిడిలార్డర్లో కేఎల్ రాహుల్..!
first ODI against the West Indies: ఫిబ్రవరి 6 నుంచి విండీస్‌తో ప్రారంభంకావాల్సి ఉన్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పలు మార్పులు అవసరమంటున్నాడు భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్. ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్లో ఆడించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా టీమిండియాను వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ సమస్యకు చెక్ పెట్టవచ్చని సూచిస్తూ.. వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు ప్రమోషన్ కల్పించి ఓపెనర్ పంపాలని జట్టు యాజమాన్యాన్ని కోరాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్ రాహుల్.. కెప్టెన్‌గానే కాకుండా ఓపెనర్‌గా కూడా తీవ్రంగా నిరాశపర్చాడని ప్రస్తావించాడు. శిఖర్ ధవన్ కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఓపెనర్ల సమస్య మరింత జటిలమవుతుందని, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో జట్టు యాజమాన్యం పునరాలోచించి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్లో పంపితే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్‌ను 4 లేదా 5 స్ధానాల్లో పంపించడం ద్వారా మిడిలార్డర్ డెప్త్ పెరుగుతుందని, ఇది కచ్చితంగా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా(12 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 613 పరుగులు) రాహుల్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన అగార్కర్.. వన్డే ప్రపంచకప్ 2023ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు. కాగా, ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగాల్సి ఉంది. చదవండి: హైదరాబాద్‌లో ధోని క్రికెట్ అకాడమి ప్రారంభం -
T20 WC: పాకిస్తాన్ గట్టి పోటీనివ్వలేదు... కానీ..
Ajit Agarkar Comments: టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్.. టీమిండియాకు గట్టి పోటీనిచ్చే అవకాశం లేదని భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అన్నాడు. అయితే, దాయాది జట్టును తక్కువగా అంచనా వేయకూడదని, ఏ నిమిషంలో మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమన్నాడు. ఏదేమైనా గత అనుభవాలు, గణాంకాల ఆధారంగా టీమిండియా విజయం ఖాయమని అభిప్రాయపడ్డాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత అక్టోబరు 24న దుబాయ్ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ముఖాముఖి తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎల్లప్పుడూ అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే, ప్రస్తుత ఫామ్, గణాంకాలు పరిశీలిస్తే.. పాక్‌తో భారత్‌కు పెద్దగా పోటీ ఉంటుందని చెప్పలేం. అలాగని ఆ జట్టును మరీ అంత తేలికగా కొట్టిపారేయలేం. క్రికెట్ ఓ ఫన్నీ గేమ్. ముఖ్యంగా టీ20 ఫార్మా ట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007 నాటి అనుభవాలను అగార్కర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ‘‘వరల్డ్‌కప్-2007 టూర్ మాకెంతో ప్రత్యేకం. యువ ఆటగాళ్లతో నిండిన ఆనాటి జట్టు... పాకిస్తాన్ మీద ఘన విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇండో- పాక్ మ్యాచ్ అంటే... భావోద్వేగాల సమాహారం. వరల్డ్‌కప్ అంటే అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి’’ అని పేర్కొన్నాడు. కాగా ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్‌కప్-2007 ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: T20 WC: అతడు ఫామ్‌లో లేనంత మాత్రాన.. ఆందోళన అవసరం లేదు: కోహ్లి -
T20 World Cup 2021: భారత జట్టులో మార్పులు చేయనవసరం లేదు..
Ajit Agarkar Comments on India T20 Worldcup Team: రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో మార్పులు చేయాలని పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ జట్టు మార్పులపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గాయాలు కారణంగా జరిగే మార్పులను మినహాయించి, సెలెక్టర్లు మొదట ఎంపిక చేసిన జట్టుకే కట్టుబడి ఉండాలని అతడు అభిప్రాయపడ్డాడు. టీమిండియా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వారి ఎంపిక చేసిన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అగార్కర్ తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్ ఆధ్బతమైన ఆటగాళ్లు. ఐపీఎల్ 14 వ సీజన్ ముగిసేలోపు వారు తిరిగి ఫామ్ పొందుతారని అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ దీపక్ చాహర్ రిజర్వ్ ఆటగాళ్లతో కూడిన 15 మంది సభ్యుల భారత బృందాన్ని గత నెలలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఐసీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. జట్లు అక్టోబర్ 10 లోపు తమ జట్టులో మార్పులు చేయవచ్చు. ప్రపంచకప్ జట్టులో స్ధానం దక్కని శిఖర్ ధావన్ ,యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లు ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో ఎంపికైన కొంతమంది ఆటగాళ్లు ఫామ్‌లో లేనందున చాహల్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లను జట్టులో తీసుకోవాలని మాజీలు సెలెక్టర్లను కోరుతున్నారు. చదవండి: Viral Video: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. -
ధావన్ కంటే అతడికే ఎక్కువ ప్రాధాన్యం: అగార్కర్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021కు ఇప్పటికే పలు జట్లు తమ అత్యుత్తమ కాంబినేషన్లను ఎంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, కొన్ని జట్లు ఆటగాళ్ల(ఫామ్ ఆధారంగా) కొరతతో తుదిజట్టును ఎంపిక చేసే విధానంపై తర్జనభర్జన పడుతుంటే, టీమిండియాకు మాత్రం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలక్ట్ చేయడం సవాలుగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ టీమిండియా ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్ కంటే కూడా కేఎల్ రాహుల్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు మాజీ పేసర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ... ‘‘ఓపెనింగ్ జోడీపై చర్చ ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కేఎల్ రాహుల్, రోహిత్ శిఖర్ ధావన్ కంటే ముందే ఉంటారని చాలా మంది అభిప్రాయం. కాబట్టి, ధావన్ పోటీలో నిలవాలంటే మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. వారిపై ఒత్తిడి పెట్టాలంటే.. శ్రీలంక సిరీస్‌లో తప్పకుండా రాణించాల్సి ఉంటుంది. నాకు తెలిసి, వన్డే సిరీస్‌లో రాణింపు.. టీ20 వరల్డ్ కప్ తుదిజట్టు ఎంపికలో ఎంత వరకు ప్రభావం చూపుతుందో చెప్పలేం.. కానీ... కచ్చితంగా ధావన్ మాత్రం అక్కడ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహిత్ వైస్ కెప్టెన్ కాబట్టి తప్పకుండా జట్టులో ఉంటాడు. ఇక రాహుల్ ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో తన సత్తా ఏంటో అనేకమార్లు నిరూపించుకున్నాడు. కాబట్టి... అత్యుత్తమ ఫాం కనబరచకపోతే ధావన్‌కు తుదిజట్టులో చోటు సంపాదించడం కాస్త కష్టమే’’ అని పేర్కొన్నాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా... కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2021 సీజన్లో జరగాల్సిన మిగతా 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో సత్తా చాటడం ద్వారా సెలక్షన్ టీం దృష్టిని ఆకర్షించేందుకు భారత క్రికెటర్లు సిద్ధమవతున్నారు. -
Ajit Agarkar: కనీసం ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి
అహ్మదాబాద్: వరుస ఓటములతో డీలా పడిన కేకేఆర్ నేడు పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కోనుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కేకేఆర్ పంజాబ్‌తో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ కేకేఆర్ ఫ్రాంచైజీకి ఒక కీలక సూచన చేశాడు. ''కేకేఆర్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా.. మ్యాచ్‌లోకి వచ్చేసరికి మాత్రం తడబాటు కొనసాగుతూనే ఉంది. లోకీ ఫెర్గూసన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌కు కేకేఆర్ ఇప్పటివరకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలనుకుంటే కెప్టెన్ మోర్గాన్, నరైన్, కమిన్స్ స్థానంలో అతనిని తీసుకునే అవకాశం ఉంది. పూర్ ఫామ్‌లో ఉన్న మోర్గాన్ తనకు తాను తప్పుకొని లోకికి అవకాశం ఇవ్వాలి లేదా నరైన్ స్థానంలో ఆడించాలి. లోకీ ఫెర్గూసన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానం చేయగలడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ఫెర్గూసన్ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. కాబట్టి ఇప్పటికైనా అతనికి అవకాశం ఇస్తే మంచిది. ఇప్పటివరకు చెన్నై, ముంబై వేదికల్లో మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఇకపై అహ్మదాబాద్, ఢిల్లీ వేదికల్లో ఆడనుంది. నేడు పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇక్కడ 200 పై చిలుకు స్కోరు వస్తుందని గ్యారంటీ లేదు.. కానీ సరిగ్గా ఆడితే మాత్రం 160 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఫెర్గూసన్ గతేడాది కేకేఆర్ తరపున ఐపీఎల్లో 5 మ్యాచ్‌లాడి 43 పరుగులతో పాటు 6 వికెట్లు తీశాడు. -
‘పిచ్‌లు తయారుచేసే టైమ్ లేదు.. ఇది బాధాకరం’
చెన్నై: పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్‌లో పిచ్ చాలా పేలవంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ విమర్శించాడు. చిన్న చిన్న స్కోర్లు నమోదు చేయడమే ఇక్కడ కష్టమైపోతుందని, ఈ తరహా పిచ్‌ల వల్ల ఉపయోగం లేదన్నాడు. కనీసం బోర్డుపై 150 నుంచి 160 పరుగులు చేయలేని పిచ్‌లు ఎందుకని ప్రశ్నించాడు. ఇది చాలా తేలికపాటి వికెట్ అని, చాలా అధ్వానంగా ఉందన్నాడు. ఇక్కడ గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌లు తయారుచేయడానికి సమయం దొరక్కపోవడం బాధాకరమన్నాడు. ప్రత్యామ్నాయ రోజుల్లో కూడా గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌ను తయారు చేసే అవకాశమే లేదన్నాడు. మ్యాచ్‌లు చాలా వేగవంతంగా జరుగుతున్న క్రమంలో గ్రౌండ్స్‌మెన్‌కు సవాల్‌గా మారిందన్నాడు. ఇది చాలా బాధకరమని అగార్కర్ విచారం వ్యక్తం చేశాడు. ముంబై నిర్దేశించిన 132 పరుగులు చేసేటప్పుడు కూడా పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో కాస్త ఆందోళన కనబడిందన్నాడు. ప్రత్యేకంగా మధ్య ఓవర్లలో ఈ పిచ్ దారుణంగా మారిపోతుందని విమర్శించాడు. అటు తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించక, ఇటు ఛేజింగ్‌కు అనుకూలించని పిచ్‌లు వల్ల ఉపయోగం లేదన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్పోతో మాట్లాడిన అగార్కర్.. ‘ నాకు క్లిష్టమైన పిచ్ వల్ల ఇబ్బందేమీ లేదు. నేను ఎన్నో పిచ్‌లపై ఆడాను. ఒక మాజీ బౌలర్‌గా కనీసం 150-160 పరుగులు చేసే పిచ్‌లైనా ఉండాలి. ఆ స్కోరును ఛేజింగ్ చేసే టీమ్ సాధిస్తుందా.. లేదా అనేది వేరే అంశం. ముందు పిచ్‌పై కనీసం పరుగులు రానప్పుడు ఎందుకు’ అని నిలదీశాడు. ఇక్కడ చదవండి: రోహిత్.. సెహ్వాగ్‌ను ఓపెనింగ్ వద్దనగలమా? వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి: రసెల్ రాజస్తాన్ రాయల్స్‌కు కొత్త ఆటగాడు.. రాత మారుతుందా! -
సెలక్షన్ ప్యానెల్; రేసులో అగార్కర్, మోంగియా
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరి కమిటీ (సీఏసీ) వేగవంతం చేసింది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ నాయకత్వంలోని సీఏసీ.. సెలక్షన్ ప్యానెల్(పురుషుల క్రికెట్) నియామక ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ మేరకు అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మనీందన్ సింగ్, నయన్ మోంగియా, ఎస్ఎస్ దాస్ పేర్లను షార్ట్‌లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అభయ్ కురువిల్లా, అజయ్ రత్రా, నిఖిల్ చోప్రా, దేవాశిష్ మహంతి, రణదేవ్ బోస్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారిని వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.(చదవండి: 'నీకు చాన్స్ ఇద్దామనే అలా చేశా') కాగా స్క్రూటినీ అనంతరం సీఏసీ ఎంపిక చేసిన పేర్లను బీసీసీఐకి పంపిస్తుంది. ఇక గురువారం బీసీసీఐ జనరల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన నేడే వెలువడే అవకాశం ఉంది. జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీ, సరణ్దీప్ సింగ్ పదవీకాలం సెప్టెంబరులో పూర్తైన నేపథ్యంలో బీసీసీసీ దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా సెలక్టర్‌గా ఎంపిక అయ్యేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడినవాళ్లు మాత్రమే అర్హులు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. వయోపరిమితి 60 ఏళ్లు. -
చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్!
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు నిన్నటితో ముగిసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సౌత్‌జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌లను మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది. మిగతా ముగ్గురు సభ్యుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్‌తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నవారిలో అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మహిందర్ సింగ్, ఎస్ఎస్ దాస్‌లలో ముగ్గురు సెలెక్టర్లుగా ఎంపికవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక అజిత్ అగార్కర్, మహిందర్ సింగ్ గత మార్చిలోనే అప్లై చేయగా.. వారికి అవకాశం రాలేదు. ఆ దరఖాస్తులనే సీఏసీ మళ్లీ పరిగణించనుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా సరిపోతాడని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మాజీ పేస్ బౌలర్ దేవాశిష్ మహంతిని జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని చెప్తున్నారు. గత సెలక్షన్ కమిటీ భర్తీ ప్రక్రియలో జోన్లవారీగా సభ్యులను ఎంపిక చేసుకుని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. తాజాగా ఆ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
‘ఈ సీజన్లో ఆ రెండు జట్లే అత్యుత్తమం’
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ ప్రారంభమై 25 రోజులైంది. ఇంకా సుమారు నెల రోజుల ఆటే మిగిలి ఉండటంతో ఆయా జట్లపై తమ తమ అంచనాలను వెల్లడిస్తారన్నారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. ఈ క్రమంలోనే తన అత్యుత్తమ జట్లను ప్రకటించాడు టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఎనిమిది ఫ్రాంచైజీలో కనబరుస్తున్న ఫామ్‌ను బట్టి ఒక అంచనాకు వచ్చాడు. వాటిలో తన రెండు బెస్ట్ జట్లను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్లే ఈ సీజన్ బెస్ట్ టీమ్స్ అని అభిప్రాయపడ్డాడు. ఈ రెండు జట్లు కచ్చితంగా ప్లేఆఫ్ రేసులో ఉంటాయని జోస్యం చెప్పాడు. వీటితో పాటు కేకేఆర్‌కు ప్లేఆఫ్ అవకాశం ఉందన్నాడు. ఈ సీజన్లో కేకేఆర్ మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు వెళుతుందని పేర్కొన్నాడు. ఇక నాల్గో స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య పోటీ ఉంటుందన్నాడు. (నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి) కాగా, వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీపై తనకు ఇంకా నమ్మకం ఏర్పడలేదన్నాడు. ఆ జట్టు ప్లేఆఫ్‌కు వెళుతుందని తాను విశ్వసించడం లేదన్నాడు. ఈ మేరకు ఏఎన్ఐతో మాట్లాడిన అగార్కర్.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంచితే, ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లను బట్టి చూస్తే ముంబై ఇండియన్స్(7 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు) తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్(7 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు ఐదు విజయాలు) రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ కూడా(7 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు) మూడో స్థానంలో ఉంది. ఇక కేకేఆర్( 7 మ్యాచ్‌లకు గాను నాలుగు విజయాలు) నాల్గో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్‌లు ఏడేసి మ్యాచ్‌లు ఆడి తలో మూడేసి విజయాలతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక సీఎస్కే రెండు విజయాలతో ఏడో స్థానంలో ఉండగా, కింగ్స్ పంజాబ్ ఒకే ఒక్క విజయంతో ఆఖరి స్థానంలో ఉంది. ఫలితంగా సీఎస్కే, కింగ్స్ పంజాబ్‌లు ప్లేఆఫ్స్‌కు చేరడం దాదాపు కష్టమే.ఏమైనా అద్భుతాలు జరిగితే తప్పితే ఇవి ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం అంత ఈజీ కాదు. ఇక అన్ని జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడేసి రెండో అంకంలోకి అడుగుపెడుతున్నాయి. (కోహ్లి.. ఇది ఓవరాక్షన్ కాదా?) -
కోహ్లి.. ఆ తప్పిదాలు ఎందుకు చేశావ్?
న్యూఢిల్లీ: ఐపీఎల్-13లో సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పూర్తిగా చేతులెత్తేసింది. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ మొత్తం విఫలం కావడంతో ఆర్సీబీ 97 పరుగుల తేడాతో చిత్తయ్యింది. కోహ్లి అండ్ గ్యాంగ్ 17 ఓవర్లలో 109 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచి కింగ్స్ పంజాబ్ స్కోరు రెండొందలు దాటించి ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనిపై టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. కోహ్లి చేసిన ఆ రెండు ప్రధాన తప్పిదాలతోనే కింగ్స్ పంజాబ్ విజయం సాధించిందన్నాడు. (చదవండి:సీఎస్కేపై సెహ్వాగ్ సెటైర్లు) ‘ శివం దూబే అప్పటివరకు కొన్ని మంచి ఓవర్లు వేశాడు. పెద్దగా అనుభవం లేని బౌలర్‌కు చివరి ఓవర్ ఎలా ఇస్తావ్. అప్పటికే క్రీజ్‌లో ఒక సెట్ బ్యాట్స్‌మన్ ఉండి, అతను సెంచరీ సాధించినప్పుడు ప్రధాన బౌలర్‌కు బౌలింగ్ వేయించాలి. టీ20 క్రికెట్లో చివరి ఓవర్ అనేది చాలా కీలకం. ఈ ఫార్మాట్లో ఎప్పుడూ కూడా ఆఖరి ఓవరే విజయంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇది కోహ్లి చేసిన తొలి తప్పింది. ఇక బ్యాటింగ్ విషయంలో కోహ్లి ఎప్పుడూ మూడో స్థానం కంటే కింద వరుసలో బ్యాటింగ్ ఎప్పుడూ రావు. మరి అటువంటిది కింగ్స్ పంజాబ్ మ్యాచ్‌లో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు?, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు రానట్లు. అరోన్ ఫించ్ ఓపెనింగ్ ఉన్న కారణంగా ఓపెనింగ్ రావడం లేదు. అంతవరకూ ఓకే. మరి మూడో స్థానాన్ని వదిలి పెట్టి, నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ మ్యాచ్‌లో నాల్గో స్థానంలో కోహ్లి బ్యాటింగ్‌కు రావడం సరైన నిర్ణయం కాదు’ అని అగార్కర్ తెలిపాడు. -
నెగిటివ్ వుంటే సలైవా వాడొచ్చుగా!
న్యూఢిల్లీ : బంతిని షైన్ చేసే విషయంలో ఇన్నాళ్లు ఉమ్ముకు ప్రత్యామ్నాయంపై చర్చ జరిగింది. కానీ భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ మరో కొత్త తరహా సూచన చేశాడు. కరోనా నేపథ్యంలోనే సలైవా (ఉమ్ము)ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్‌కు ముందు జరిపిన పరీక్షల్లో ఆటగాళ్లెవరికీ కరోనా లేదని తేలితే అప్పుడు లాలాజలాన్ని బంతిపై రుద్దేందుకు అనుమతించాలన్నాడు. బౌలింగ్‌కు ఉమ్ముతోనే పని వుంటుందని చెప్పాడు. ('ఐదు సార్లు వదిలేస్తే సెంచరీ సాధించా') ‘ప్రతి సిరీస్‌కు, మ్యాచ్‌కు ముందు ఆడే ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలు చేస్తారు. అందులో నెగెటివ్ అని వస్తే సలైవా వాడితే ముప్పేమీ ఉండదుగా! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిపై వైద్యరంగానికి చెందిన వారు పరిశీలించి లోటుపాట్లు వివరించాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నాడు. అసలే క్రికెట్... బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్‌గా మారిపోయిందని, ఇలాంటి తరుణంలో బౌలర్లకు ఎంతో ఉపయుక్తమైన ఉమ్మును వాడొద్దంటే అది కచ్చితంగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషించాడు. -
అగార్కర్‌కు మరో చాన్స్?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సెలక్టర్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయిన మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు మరో చాన్స్ ఉన్నట్లే కనబడుతోంది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్‌జోన్)ని ఎంపిక చేయడంతో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. జోనల్ పద్ధతిని పాటించడంతో అగార్కర్ అసలు సెలక్టర్ల రేసులోనే లేకుండా పోయాడు.(ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి) రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహాన్లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోనల్ ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్ ఖోడా సెంట్రల్ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఇక్కడ సునీల్ జోషి, హర్విందర్ సింగ్‌లను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే సునీల్ జోషి చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేశారు. అగార్కర్‌కు మరో చాన్స్ ఎలా? సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)ల పదవీ కాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనుంది. దాంతో ప్రస్తుతం దరఖాస్తుకు చేసుకుని నిరాశకు గురైన అగార్కర్, నయాన్ మోంగియా, మణిందర్ సింగ్ తదితరులు మళ్లీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం లేకుండానే రేసులో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా జతిన్ పరంజపే ముంబైకు చెందిన వాడు కావడంతో అతని స్థానంలో అగార్కర్‌కు చాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే దానికి మరో ఆరు నుంచి ఏడు నెలలు నిరీక్షించాల్సి ఉంటుంది. సెలక్టర్‌గా అగార్కర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. ‘భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాలు అగార్కర్‌కు ఉన్నాయి. సెలక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకున్న జాబితా ప్రకారం చూస్తే అతనే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ జోనల్ పద్ధతిని అనుసరించడంతో అగార్కర్ చాన్స్ మిస్సయ్యాడు. అదే సమయంలో ముంబై నుంచి పరంజపే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దాంతో అగార్కర్‌కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ముగ్గురు మరో ఆరు-ఏడు నెలల్లో వీడ్కోలు చెప్పనున్నారు. అప్పుడు అగార్కర్‌ను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం’ అని గంగూలీ తెలిపాడు. -
అజిత్ అగార్కర్‌కు నిరాశ
ముంబై: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో అందరి కంటే ముందున్నాడనుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) షాకిచ్చింది. మంగళవారం సమావేశమైన మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన సీఏసీ... అగార్కర్ దరఖాస్తును తిరస్కరించింది. రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహాన్లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోన్ల ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్ ఖోడా సెంట్రల్ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: పాండ్యా సూపర్ ఇన్నింగ్స్) -
రేసులో మిగిలింది వీరే.. చీఫ్ సెలక్టర్ ఎవరో?
ముంబై: మార్చి మొదటి వారంలో టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి బీసీసీఐ అప్పగించింది. కొత్త సెలక్టర్లను ఎప్పుడు ప్రకటించాలన్న విషయంలో నిర్దిష్ట సమయం ఏదీ లేదన్న మదన్ లాల్.. మార్చి 1, 2 నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల స్థానం కోసం పోటీపడుతున్న వారిలో చివరి దశ ఇంటర్వ్యూలకు మొత్తం నలుగురు మిగిలారు. వీరిలో మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మరో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్లు ఉన్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ పోస్టు కోసం అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల మధ్య పోటీ ఉండవచ్చు. అత్యంత అనుభవజ్ఞుడినే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తామన్న బీసీసీఐ చీఫ్ గంగూలీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవర్ని చీఫ్ సెలక్టర్‌గా చేస్తారో వేచిక చూడక తప్పదు. టెస్టుల పరంగా వెంకటేశ్ ప్రసాద్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే, వన్డేలు పరంగా అజిత్ అగార్కర్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. వెంకటేశ్ ప్రసాద్‌కు 33 టెస్టులు ఆడిన అనుభవం ఉంటే, అగార్కర్‌కు 26 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. వన్డేల్లో వెంకటేశ్ ప్రసాద్ 161 మ్యాచ్‌లు ఆడితే, అగార్కర్ 191 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు అంతర్జాతీయ టీ20లు కూడా అగార్కర్ ఆడాడు. దీన్ని బట్టి చూస్తే చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్‌కు చాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. (ఇక్కడ చదవండి: ఆడకుండా.. నన్ను కిడ్నాప్ చేశారు: అశ్విన్) -
అతనికే చీఫ్ సెలక్టర్‌గా అవకాశం: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ బౌలర్ ఆర్పీ సింగ్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో చోటు దక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం సౌరవ్ గంగూలీ అధ్యక్షతన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన ముగ్గురు సభ్యుల సీఏసీలో ఆర్పీ సింగ్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. ఈ జాబితాలో మాజీ ఆటగాడు మదల్‌లాల్, సులక్షన్ నాయక్‌తో పాటు ఆర్పీ సింగ్‌లు ఉన్నారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉండనుంది. మరొకవైపు సెలక్షన్ కమిటీలోకి ఇద్దరు సభ్యులను తీసుకోనున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో సందీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో ఏడాది కొనసాగనుండగా, పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), సెలెక్టర్ గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుంది. చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ పదవీ కాలం గత సెప్టెంబర్‌తోనే ముగియగా, అతనికి మరో కొన్నినెలలు పని చేయడానికి అవకాశం కల్పించారు. (ఇక్కడ చదవండి: పంత్ తోపన్నారు.. మరి ఎందుకు తీసుకోరు?) సెలక్షన్ కమిటీలో సభ్యులను తీసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించేంత వరకూ ఎంఎస్కేను కొనసాగమని సూచించడంతో అతని మరిన్ని నెలలు పనిచేసే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం సెలక్టర్ల పదవికి పలు దరఖాస్తులు రావడంతో ఎవరు చీఫ్ సెలక్టర్ అవుతారనే విషయంపై కాస్త సందిగ్థత నెలకొంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న మాజీల్లో ఎక్కువగా టెస్టులు ఆడినవారే చీఫ్ సెలక్టర్ అవుతాడు. ఇది చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేయడానికి ఉన్న ఒక నిబంధన’ అని గంగూలీ తెలిపాడు. కాగా, చీఫ్ సెలక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, శివరామకృష్ణన్, వెంకటేశ్‌ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయాన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబీ కురువిల్లాలు ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ శివరామకృష్ణన్ తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇక వెంకటేశ్ ప్రసాద్ 33 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా, అజిత్ అగార్కర్ 26 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వెంకటేశ్ ప్రసాద్‌కు జూనియర్ సెలక్షన్ కమిటీలో చేసిన అనుభవం ఉండగా, ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం అగార్కర్ సొంతం. దాంతో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చు. -
సెలక్టర్ రేసులో అగార్కర్
ముంబై: భారత సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ పదవి కోసం భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ పోటీపడుతున్నాడు. గురువారమే అతడు దరఖాస్తు చేసుకున్నాడంటూ ఊహాగానాలు రాగా... అవి నిజమేనంటూ శుక్రవారం అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఇతనితో పాటు ఇప్పటికే జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఉన్నాడు. దాంతో చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఇప్పటికే ఉన్న భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్‌లకు అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఇప్పటికే ముంబై సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 349 వికెట్లు తీశాడు. సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలల కోసం దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియగా... తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. గడువులోపు దరఖాస్తు చేసుకున్న మాజీ భారత క్రికెటర్లు: అజిత్ అగార్కర్ (ముంబై), వెంకటేశ్ ప్రసాద్ (కర్ణాటక), చేతన్ శర్మ (హరియాణా), నయన్ మోంగియా (బరోడా), లక్ష్మణ్ శివరామకృష్ణన్ (తమిళనాడు), రాజేశ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), అమేయ్ ఖురాసియా (మధ్య ప్రదేశ్), జ్ఞానేంద్ర పాండే (ఉత్తర ప్రదేశ్), ప్రీతమ్ గాంధీ (విదర్భ).