అహ్మదాబాద్: వరుస ఓటములతో డీలా పడిన కేకేఆర్ నేడు పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కోనుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కేకేఆర్ పంజాబ్‌తో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ కేకేఆర్ ఫ్రాంచైజీకి ఒక కీలక సూచన చేశాడు.
''కేకేఆర్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా.. మ్యాచ్‌లోకి వచ్చేసరికి మాత్రం తడబాటు కొనసాగుతూనే ఉంది. లోకీ ఫెర్గూసన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌కు కేకేఆర్ ఇప్పటివరకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలనుకుంటే కెప్టెన్ మోర్గాన్, నరైన్, కమిన్స్ స్థానంలో అతనిని తీసుకునే అవకాశం ఉంది. పూర్ ఫామ్‌లో ఉన్న మోర్గాన్ తనకు తాను తప్పుకొని లోకికి అవకాశం ఇవ్వాలి లేదా నరైన్ స్థానంలో ఆడించాలి. లోకీ ఫెర్గూసన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానం చేయగలడు.
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫెర్గూసన్ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. కాబట్టి ఇప్పటికైనా అతనికి అవకాశం ఇస్తే మంచిది. ఇప్పటివరకు చెన్నై, ముంబై వేదికల్లో మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఇకపై అహ్మదాబాద్, ఢిల్లీ వేదికల్లో ఆడనుంది. నేడు పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇక్కడ 200 పై చిలుకు స్కోరు వస్తుందని గ్యారంటీ లేదు.. కానీ సరిగ్గా ఆడితే మాత్రం 160 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఫెర్గూసన్ గతేడాది కేకేఆర్ తరపున ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లాడి 43 పరుగులతో పాటు 6 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment