టీమిండియా నూతన టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టీ20ల్లో రోహిత్ శర్మ వారుసుడిగా సూర్యకుమార్ భారత జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా సూర్య ప్రస్ధానం మొదలు కానుంది.
అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌లోనూ, భారత జట్టు తత్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటకి కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేయలేదన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.
ఇందుకు ఒక్కొక్కరు ఒక్క కారణం చెబుతున్నారు. కొంత మంది ఫిట్‌నెస్ వాళ్లే అతడిని ఎంపిక చేయలేదని, మరికొంత మంది శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను తప్పించడం అందరని విస్మయానికి గురిచేసింది.
ఒప్పుకోని అగార్కర్..
కాగా హార్దిక్ పాండ్యాకు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ ఒప్పుకోలేదంట. పాండ్యా కెప్టెన్సీపై తనకు నమ్మకం లేదంటూ అగార్కర్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం.
అందుకు ఐపీఎల్‌లో పాండ్యా కెప్టెన్సీనే కారణమని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. పాండ్యా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేర్చినప్పటకి.. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు.
ఐపీఎల్-2024లో అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో అగార్కర్ అండ్ కో సైతం పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌పై సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి. మరోవైపు భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment