పాండ్యా గురించి రోహిత్‌తో ద్రవిడ్ చర్చలు (PC: BCCI)
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు.
నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్‌ను ఫైనల్‌కు తీసుకువచ్చాడు.
కలిసిరాని కాలం
కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆటగాడిగానూ విఫలం
ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్!
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? లేడా? ఆల్‌రౌండర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
నిజానికి పాండ్యా హిట్టింగ్‌కు తోడు అదనపు సీమర్‌గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రత్యామ్నాయం అతడే!
ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్‌కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది.
Most sixes since IPL 2022 -
— TCTV Cricket (@tctv1offl) April 15, 2024
🔹 66 Shivam Dube
🔹 66 Nicholas Pooran
Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr
మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్‌లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా హిట్టింగ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్‌కు చోటిచ్చేస్తారా?
Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్
Comments
Please login to add a commentAdd a comment