WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ | WC 2023: India Dont Rule Out Both KL Rahul Ishan Kishan In Playing XI | Sakshi
Sakshi News home page

WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి.. ఇలాంటివి మాకిష్టమే: చీఫ్‌ సెలక్టర్‌

Published Tue, Sep 5 2023 4:54 PM | Last Updated on Tue, Oct 3 2023 7:04 PM

WC 2023: India Dont Rule Out Both KL Rahul Ishan Kishan In Playing XI - Sakshi

అజిత్‌ అగార్కర్‌ (PC: Star Sports)

India Playing XI- KL Rahul vs Ishan Kishan: ప్రపంచకప్‌-2023 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌.. ఇద్దరికీ చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆసియా కప్‌ వన్డే ఈవెంట్‌తో జట్టులోకి పునరాగమనం చేశాడు కేఎల్‌. జాతీయ క్రికెట్‌ అకాడమీలో నెలలపాలు పునరావాసం పొంది రీఎంట్రీకి సిద్ధమయ్యాడు.

కేఎల్‌ రాహులా? లేదంటే ఇషాన్‌?
అయితే, గాయం వెంటాడటంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ కర్ణాటక బ్యాటర్‌ సూపర్‌-4 మ్యాచ్‌తో మైదానంలో దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే.. సదరు మ్యాచ్‌లో తుదిజట్టులో కేఎల్‌ రాహుల్‌కు చోటిస్తే ఇషాన్‌ పరిస్థితి ఏమిటన్న చర్చలు జరుగుతున్నాయి.


కేఎల్‌ రాహుల్‌

రాహుల్‌ కోసం... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసిన ఇషాన్‌ను పక్కనపెడితే అంతకంటే మూర్ఖత్వం ఉండదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. 

ఇలాంటి తలనొప్పి మంచిదే కదా!
ఇందుకు స్పందనగా.. ‘‘ఇలాంటి తలనొప్పి మంచిదే? కాదంటారా? ఇషాన్‌ గత మ్యాచ్‌లో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. సాధారణంగా అతడు ఓపెనర్‌గా వస్తాడు. అలాంటిది మిడిలార్డర్‌లో గొప్పగా రాణించాడు. కాబట్టి కేఎల్‌ జట్టులో ఉంటే ఇద్దరిలో ఎవరిని ఆడించాలన్న తలనొప్పి తప్పదు. 


ఇషాన్‌ కిషన్‌

ఇద్దరూ ఉన్నా..
వన్డే క్రికెట్‌లో కేఎల్‌ రికార్డు అద్భుతమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు వచ్చాడంటే ఇలాంటి సందిగ్దం ఉండటం సహజం. అయినా.. ఇద్దరు ఉన్నారే అని బాధపడే బదులు మన ముందు రెండు మంచి ఆప్షన్లు ఉన్నాయని సంతోషించవచ్చు కదా!’’ అని అజిత్‌ అగార్కర్‌ బదులిచ్చాడు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బట్టే తుదిజట్టు కూర్పు ఉంటుందని.. అందులో ఇద్దరు ఒకే రకమైన ప్లేయర్లు ఉండటం అసాధ్యమేమీ కాదని పేర్కొన్నాడు.

చదవండి: వన్డే వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు
అతడు ఉండగా అక్షర్‌ ఎందుకు? మ్యాచ్‌ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement