Gautam Gambhir on Kishan vs Rahul debate: ‘‘జట్టులో స్థానం కోసం తాను ఎంతగా శ్రమించాలో ఇషాన్ కిషన్ అంతకంటే ఎక్కువే శ్రమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువగా అనుభవం లేదు కాబట్టి.. ఇషాన్‌ను కాదని కేఎల్ రాహుల్ ఆడిస్తామనడం సరికాదు. ఒకవేళ విరాట్ కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ స్థానంలో ఉండి ఉంటే.. కేఎల్ రాహుల్‌తో వాళ్ల స్థానం భర్తీ చేసేవాళ్లా?
రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! మరి..
లేదు కదా! మనం చాంపియన్‌షిప్ గెలవడమే ప్రధాన లక్ష్యం. అయితే, ఇందులో మనకు ఆటగాళ్ల పేర్లు ముఖ్యమా? వారి ఫామ్ ముఖ్యమా? ఒకవేళ రోహిత్, కోహ్లి వరుసగా నాలుగు అర్ధ శతకాలు బాది ఉంటే.. అప్పుడు కూడా వాళ్ల స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకువస్తారా?
వరల్డ్‌కప్ టోర్నీకి సన్నద్ధమవుతున్న క్రమంలో ఆటగాళ్ల పేర్లతో మనకు పనిలేదు. వాళ్ల ఫామ్ ఎలా ఉందన్నదే ప్రధానాంశం. జట్టుకు ప్రపంచకప్ అందించగల సత్తా ఉన్న ఆటగాడి వైపే మనం మొగ్గుచూపాలి’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాహుల్ రీఎంట్రీతో ఇషాన్ స్థానానికి ఎసరు?
కాగా గాయం నుంచి కోలుకుని.. సుదీర్ఘ విరామం తర్వాత కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్-2023కి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించని కారణంగా పాకిస్తాన్, నేపాల్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.
ఈ క్రమంలో జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో వరుస హాఫ్ సెంచరీలు బాదిన ఈ యువ ఆటగాడు.. చిరకాల ప్రత్యర్థి పోరులోనూ బ్యాట్ ఝులిపించాడు.
పేరు కాదు.. ఫామ్ ముఖ్యం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ హార్దిక్ పాండ్యా(87)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. 82 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి తన విలువేమిటో చాటుకున్నాడు. అయితే వర్షం కారణంగా పాక్‌తో మ్యాచ్ రద్దు కాగా.. నేపాల్ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించడంతో ఇషాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇదిలా ఉంటే.. ఆదివారం మరోసారి భారత్- పాకిస్తాన్ సూపర్-4లో తలపడనున్న తరుణంలో ఫిట్‌నెస్‌తో ఉన్న రాహుల్ రీఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే ఐదో స్థానంలో ఆడుతున్న ఇషాన్‌పై వేటు తప్పదు.
మరోవైపు.. వరల్డ్‌కప్-2023 జట్టులో రాహుల్‌తో పాటు ఇషాన్‌కు చోటు దక్కిన నేపథ్యంలో గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ఫామ్‌లో ఉన్న ఇషాన్‌కే ఛాన్స్ ఇవ్వాలంటూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టులో కేఎల్ రాహుల్ కంటే ఇషాన్ కిషన్‌కే పెద్దపీట వేయాలని సూచించాడు.
చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..
అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
Rahul- Ishan: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment