Sanju Samson's career- ODI World Cup: కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తే సంజూ శాంసన్‌కు మెగా ఈవెంట్లలో దారులు మూసుకుపోతాయని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టిన రాహుల్.. ఒకవేళ ఆసియా కప్ ఆరంభం నాటికి తిరిగిరాకపోతే మాత్రం ఈ కేరళ బ్యాటర్‌కు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023లో మాత్రం సంజూను ఆడించే పరిస్థితి లేదని స్పష్టం చేశాడు.
పంత్ దూరం కావడంతో వాళ్లకు ఛాన్స్
కాగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో టెస్టుల్లో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేస్తున్నారు. ఇక రాహుల్ కూడా గాయపడిన తరుణంలో ఇషాన్ కిషన్‌తో పాటు సంజూ శాంసన్‌కు కూడా వికెట్ కీపర్ కోటాలో జట్టులోకి వస్తున్నారు.
అయితే, కేఎల్ రాహుల్ సర్జరీ అనంతరం కోలుకుని ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆసియా వన్డే కప్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే వార్తలు వినిపిస్తున్నా.. వరల్డ్‌కప్ వరకు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ వస్తే సంజూకు మెగా ఈవెంట్లలో అవకాశం రాకపోవచ్చు.
సంజూ శాంసన్
రాహుల్ తిరిగి వస్తే అంతే
ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాదిరే సంజూ శాంసన్ కెరీర్ కూడా అర్ధాంతరంగా ముగిసిపోనుందా? అంటూ ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఆకాశ్ చోప్రాకు ప్రశ్న ఎదురైంది. అందుకు బదులిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే మాత్రం వరల్డ్‌కప్ జట్టులో సంజూ శాంసన్‌కు చోటు ఉండే ప్రసక్తే లేదు.
ఆసియా కప్ టోర్నీలో ఆడే అవకాశాలు కూడా తక్కువే. ఒకవేళ రాహుల్ పూర్తిగా కోలుకోకుంటే అప్పుడు సంజూకు ఛాన్స్ ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ రాకపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకొచ్చాడు.
కేఎల్ రాహుల్
అయితే, సంజూకు ఇప్పుడు కేవలం 28 ఏళ్లేనన్న ఈ మాజీ ఓపెనర్.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024, ఆ తర్వాత కూడా అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు.
త్రీడీ ప్లేయర్ అంటూ ఛాన్స్.. నాడు రాయుడికి అన్యాయం
కాగా 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో టీమిండియా స్టార్ అంబటి రాయుడికి జట్టులో చోటిస్తారని అంతా భావించారు.. కానీ అనూహ్యంగా 3డీ ప్లేయర్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్)గా ఉపయోగపడతాడంటూ అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ తీవ్ర విమర్శల పాలయ్యారు.
విజయ్ శంకర్
ఇక ప్రతిభా ఉన్న ప్రపంచకప్ జట్టులో ఆడే ఛాన్స్ రాకపోవడంతో అంబటి రాయుడు కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయిందని అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన అంబటి రాయుడు.. ఇటీవలే ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు.
చదవండి: తిలక్ వద్దు!? వరల్డ్‌కప్ టోర్నీలో నంబర్ 4లో సూర్య సరైనోడు! అతడిని ఆడిస్తే..
Comments
Please login to add a commentAdd a comment