India's ODI World Cup 2023 Squad: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై హర్భజన్ సింగ్ స్పందించాడు. మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడం ఏమిటంటూ ‘ఎక్స్’ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం ప్రపంచకప్ జట్టును ప్రకటించాడు.
ఈసారి కూడా మొండిచేయి!
ఇందులో.. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది. అయితే, ఆసియా కప్ జట్టులో స్థానం లేనప్పటికీ అనుభవం దృష్ట్యానైనా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఈసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు.
చహల్
కానీ.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా.. ఇకపై రిస్ట్ స్పిన్నర్లు కుల్-చా ద్వయాన్ని ఒకే జట్టులో చూడలేమన్న మాటలను నిజం చేస్తూ అగార్కర్.. చహల్‌పై వేటు పడటానికి కారణాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో చైనామన్ స్పిన్నర్‌కు చోటు దక్కగా.. చహల్‌కు భంగపాటు తప్పలేదు.
ఆశ్చర్యం వేసింది
ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ప్రపంచకప్ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్యూర్ మ్యాచ్ విన్నర్ తను’’ అని ట్వీట్ చేశాడు.ఘీ క్రమంలో నెటిజన్లు సైతం యుజీకి మద్దతు తెలుపుతూ భజ్జీని సమర్థిస్తున్నారు. చహల్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా అన్యాయం జరిగిందని మరికొంత మంది వాపోతున్నారు.
అక్షర్ వద్దు.. ఎందుకంటే!
తన వరల్డ్‌కప్ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటిచ్చిన హర్భజన్ సింగ్.. అక్షర్ పటేల్‌ను విస్మరించిన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘రవీంద్ర జడేజా.. అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు. చహల్ బౌలింగ్ శైలి వేరు. అతడు మ్యాచ్ విన్నర్.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి గణాంకాలు గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వన్డే, టీ20లలో చహల్ లాంటి ప్రభావంతమైన స్పిన్నర్ లేడనే చెప్పాలి. జడ్డూ ఎలాగో జట్టులో ఉంటాడు కాబట్టి.. అక్షర్‌ను పక్కనపెట్టి యుజీని తీసుకుంటే బాగుంటుంది అని వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు భజ్జీ తన అంచనా తెలియజేశాడు.
వన్డే వరల్డ్‌కప్-2023కి హర్భజన్ ఎంచుకున్న జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.
చదవండి: తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్
Surprise not to see @yuzi_chahal in the World Cup squad for Team India. pure Match winner
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 5, 2023
Comments
Please login to add a commentAdd a comment