రోహిత్ శర్మ- అజిత్ అగార్కర్ (PC: Star sports)
Asia Cup Squad- Chahal Dropped- Rohit Sharma Reveals BIG reason: ఆసియా కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తుండగా.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది.
వరల్డ్‌కప్ ప్రొవిజినల్ టీమ్!
ఇక ఆసియా వన్డే కప్ నేపథ్యంలో ప్రకటించిన జట్టునే వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ప్రొవిజినల్ టీమ్‌గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌ల గురించి క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది.
ఆసియా కప్ జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కగా.. అశ్విన్, చహల్, సుందర్‌లకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి ప్రపంచకప్ అవకాశాలు కూడా గల్లంతయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ముగ్గురికి గుడ్‌న్యూస్!
అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ముగ్గురికి ఓ శుభవార్త చెప్పాడు. జట్టు ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... ‘‘17 మందికి మాత్రమే జట్టులో చోటు ఉంది. అందుకే చహల్‌ను తీసుకోలేకపోయాం. రవి అశ్విన్, చహల్, సుందర్‌లతో పాటు వరల్డ్‌కప్ ఆడే క్రమంలో ఎవరికీ దారులు మూసుకుపోలేదు’’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
చైనామన్ స్పిన్నర్‌కు ప్రాధాన్యం
కాగా ఇటీవలి కాలంలో ఆల్‌రౌండర్లుగా జడ్డూ, అక్షర్ దూసుకుపోతుండగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. విండీస్‌తో మూడు వన్డేల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టులో అతడికి చోటు దక్కడం గమనార్హం.
అయితే, చహల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ‘కుల్చా’ ద్వయాన్ని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో మూడు వికెట్లు తీశాడు. అయితే, చహల్ అనుభవజ్ఞుడైనప్పటికీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల అక్షర్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మకు ఛాన్స్.. పాపం సంజూ!
Comments
Please login to add a commentAdd a comment