Muttiah Muralitharan's Blunt Take: కేవలం వైవిధ్యం కోసమని అదనపు స్పిన్నర్‌ను ఎంపిక చేయడం సరికాదని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. వరల్డ్‌కప్-2023 జట్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే సరిపోయేదంటూ బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, అదే సమయంలో.. యజువేంద్ర చహల్‌ను పక్కన పెట్టి మంచి పని చేశారని సమర్థించాడు.
కాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో పాటు.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది.
అయితే, మరో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై స్పందించిన మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బయోపిక్ ‘800’ ప్రమోషన్లలో భాగంగా..
జడేజా ఉన్నాడు కదా
‘‘ఒకవేళ జడేజా, కుల్దీప్‌లను తీసుకుని ఉంటే సరిపోయేది. వైవిధ్యం పేరిట ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేయడం మాత్రం సరికాదు. జడ్డూ ఎలాగో ఆల్‌రౌండర్ కాబట్టి కుల్దీప్‌ను స్పెషలిస్టు బౌలర్‌గా వాడుకునేవాళ్లు.
ఇక రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్‌ల ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో నాకు తెలియదు. అయినా, టీ20 ఫార్మాట్‌లో ప్రదర్శన ఆధారంగా వన్డేలకు సెలక్ట్ చేయలేరు కదా! 50 ఓవర్ల ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ చహల్ కంటే కుల్దీప్ ప్రదర్శన మెరుగ్గా ఉంటే అతడిని ఎంపిక చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి అనుభవం కంటే ఫామ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
చహల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?
వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగ్గదిగా లేనపుడు అతడిని ఎవరైనా ఎలా సెలక్ట్ చేయగలరు? కాబట్టే అతడిని విస్మరించి ఉంటారు. ఇంతకీ చహల్ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడా? తిరిగి ఫామ్ పొందాలంటే అంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదు కదా!’’ అని టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ముత్తయ్య మురళీధరన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
అశ్విన్ ఉంటే
ఒకవేళ తనకు ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకునే అవకాశం ఉంటే మాత్రం.. జడేజా, అశ్విన్, కుల్దీప్‌లవైపే మొగ్గు చూపుతానని మురళీధరన్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో కాకుండా.. ఐపీఎల్‌లో బాగా ఆడినంత మాత్రాన ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశాడు.
చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే?
Comments
Please login to add a commentAdd a comment