India Vs Pakistan- "Bolne se kuch nahi hota": దాయాదులు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు ఇలాంటి హై వోల్టేజ్ తాజా మ్యాచ్ కి శ్రీలంక లోని పల్లకెలే వేదిక కానుంది
గెలుపే లక్ష్యంగా
ఆసియా కప్-2023 లో భాగంగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ పోటీ పడనున్నాయి. ఈ వన్డే కప్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా దాయాదిపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది.
ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పూనకాలు వస్తాయని తెలిసిందే. గతేడాది ఐసీసీ T20 టోర్నీలో ఈ విషయాన్నీ మరోసారి నిరూపించాడు. పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించాడు.
కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!?
ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో .. కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులే అని తేలింది.
పాక్ స్టార్ రియాక్షన్ ఇదే!
ఇదే విషయాన్నీ కొంతమంది రిపోర్టర్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దగ్గర ప్రస్తావించారు. అజిత్ అగార్కర్ ఆ మాటలు అన్నారా లేదా అన్నది పక్కన పెడితే .. ఇలాంటి కామెంట్లపై మీరేమంటారు అని ప్రశ్నించారు. అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో గెలుపు తర్వాత ప్రెస్ మీట్ సందర్భంగా షాదాబ్ ఈ ప్రశ్నలకు బదులిస్తూ అందరికి ఆట తోనే సమాధానం ఇస్తామని పేర్కొన్నాడు.
ప్రగల్బాలు
మ్యాచ్ రోజు ఏం జరుగుతుందనే దాని పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనైనా మా జట్టు లో ఎవరైనా.. లేదంటే ప్రత్యర్థి టీం లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే వాస్తవం అందరికి బోధపడుతుంది అని షాదాబ్ ఖాన్ ప్రగల్బాలు పలికాడు.
కాగా లెగ్ స్పిన్నర్ అయిన షాదాబ్ ఖాన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటర్గానూ రాణించగలడు. ఇక పాక్ పేస్ దళంలో ఫాస్ట్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షా గత కొంత కాలంగా మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! అతడు మొదలు పెట్టేశాడు
Comments
Please login to add a commentAdd a comment