బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. సెలెక్షన్ ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం తాత్కాలిక సెలెక్టర్ శివ్‌సుందర్ దాస్ నేతృత్వంలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ప్యానెల్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విటర్‌లో పేర్కొంది. కాగా టీమిండియా తరపున 1998లో అరంగేట్రం చేసిన అగార్కర్ 2007 వరకు ప్రాతినిధ్యం వహించాడు.
9 ఏళ్ల కెరీర్‌లో అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టి20 వరల్డ్‌కప్‌ను గెలిచిన టీమిండియా జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ముంబై జట్టుకు ప్రధాన సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటరీ ప్రొఫెషన్‌లోనూ అగార్కర్ తనదైన ముద్ర వేశాడు
మరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అజిత్ అగార్కర్ పారితోషికం ఎంత ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ఇప్పటికైతే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు రూ. కోటి పారితోషికం చెల్లిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ కాకుండా మిగతా వారికి రూ.90 లక్షల చొప్పున ఏడాదికి చెల్లిస్తారు. అయితే అజిత్ అగార్కర్‌కు మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపేట్టేందుకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశం ఉంది. బీసీసీఐ కూడా చీఫ్ సెలెక్టర్ పదవికి పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అగార్కర్‌కు రూ. కోటి నుంచి మూడు కోట్ల వరకు చెల్లించే యోచనలో బీసీసీఐ ఉంది.
ఇక టీమిండియా తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇప్పటికి అజిత్ అగార్కర్ పేరిటే ఉంది. 2000వ సంవత్సరంలో జింబాబ్వేతో వన్డేలో అగార్కర్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అంతేకాదు అతి తక్కువ వన్డేల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గానూ అగార్కర్ నిలిచాడు. కేవలం 23 మ్యాచ్‌ల్లోనే అగార్కర్ ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా అగార్కర్ రికార్డు దశాబ్దం పాటు చెక్కుచెదరకుండా ఉంది.
చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా
Comments
Please login to add a commentAdd a comment