Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్‌పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్‌లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు.
ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు.
150 వికెట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా
ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర
అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్‌లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు.
దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది.
టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు
►మహ్మద్ షమీ- 80 మ్యాచ్‌లలో..
►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో..
►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్‌లలో..
►జహీర్ ఖాన్- 103 మ్యాచ్‌లలో..
►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్‌లలో..
►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్‌లలో..
అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్‌లో చేరిన స్పిన్నర్లు
►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్‌లలో
►రషీద్ ఖాన్- 80 మ్యాచ్‌లలో
►అజంత మెండిస్- 84 మ్యాచ్‌లలో
►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో
►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్‌లలో.
చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్
Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్
As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥
— Star Sports (@StarSportsIndia) September 12, 2023
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW
Comments
Please login to add a commentAdd a comment