End of road for Shikhar Dhawan! Ajit Agarkar confirms: వన్డేల్లో అద్భుత రికార్డులు.. ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్‌గా టీమిండియాను ముందుకు నడిపించి చరిత్ర సృష్టించిన సందర్భాలు.. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు.. కానీ.. ఇవేమీ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ పొడిగించుకునేందుకు దోహదం చేయలేదు..
కొత్త నీరు వచ్చె.. పాత నీరు పోయె!
కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్ల నుంచి ఎదురైన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్‌కు అవకాశాలు కరువయ్యాయి.
వాళ్లు ముగ్గురే మా ప్రాధాన్యం
అయితే.. ఇటీవల వీరిద్దరు విఫలమవుతున్న తరుణంలో ఆసియా కప్-2023 రూపంలో గబ్బర్‌కు మరో ఛాన్స్ దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు జోడీగా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్‌కు కూడా జట్టులో చోటిచ్చారు.
ఈ క్రమంలో గబ్బర్‌కు నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన సమయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. కానీ ప్రస్తుతం.. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు మాత్రమే ఓపెనర్లుగా మా ప్రాధాన్యం ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టాడు.
ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్?
ఇక ఆసియా కప్ జట్టే వన్డే వరల్డ్‌కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల నడుమ ధావన్ కెరీర్ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో.. ‘‘అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడు. ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. జట్టుకు అవసరమైన సమయంలో 100 శాతం కష్టపడ్డాడు. గబ్బర్‌ను తలచుకుంటే బాధేస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 143.
చదవండి: అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు
Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్..
Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ!
#WATCH | At the moment, Rohit Sharma, Shubman Gill and Ishan Kishan are our preferred openers...Shikhar Dhawan has been a terrific player for India, says BCCI chief selector Ajit Agarkar. pic.twitter.com/TqF6gV4869
— ANI (@ANI) August 21, 2023
Comments
Please login to add a commentAdd a comment