ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేసిన బుమ్రా... బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో బుమ్రాపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ కూడా చేరాడు. కెప్టెన్‌గా బమ్రా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించడాని అగార్కర్ కొనియాడాడు.
"ఇదే సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో బుమ్రా, షమీ భాగస్వామ్యమే భారత్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ మెరుగ్గా బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాడు. దానిని జస్ప్రీత్ చక్కగా అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం బుమ్రాకు వైట్ బాల్ క్రికెట్ కంటే టెస్టు క్రికెట్ ఆడడం సులభంగా"ఉన్నట్టు ఉంది అని అగార్కర్ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
చదవండి: ENG vs IND: 19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. అభినందించిన బ్రియాన్ లారా
Comments
Please login to add a commentAdd a comment