
వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు (India vs West Indies) భారత జట్టు (Team India) ప్రకటన రేపటికి వాయిదా పడింది. బుమ్రా (Jasprit Bumrah) ఆసియా కప్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో అతని అందుబాటుపై స్పష్టత లేకపోవడం.. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) గాయపడటం వంటి అంశాలు సెలక్టర్లను గందరగోళంలోకి నెట్టాయి.
విండీస్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉన్నా అతని ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అంశాలను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఆసీస్-ఏతో మ్యాచ్‌లో ఇవాళ ప్రసిద్ధ్ కృష్ణ తలకు తీవ్ర గాయం కావడం సెలెక్టర్లను మరింత ఇరకాటంలో పడేసింది.
అతనికి ప్రత్యామ్నాయంగా యాశ్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. పై రెండు కారణాల చేత జట్టు ప్రకటన రేపటికి వాయిదా పడింది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. రాణించిన మాత్రే.. ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా