Ind Vs Eng 1st T20: Arshdeep Singh Breaks 16 Year Old Record On His T20I Debut, Details Inside - Sakshi
Sakshi News home page

Arshdeep Singh: అరంగేట్రంలోనే అర్ష్‌దీప్‌ అదుర్స్‌.. 16 ఏళ్ల రికార్డు బద్దలు

Published Fri, Jul 8 2022 12:34 PM | Last Updated on Fri, Jul 8 2022 1:22 PM

Ind Vs Eng 1st T20: Arshdeep Singh Breaks 16 Year Old Record In Debut - Sakshi

అర్ష్‌దీప్‌ అరంగేట్రం(PC: BCCI)

India Vs England 1st T20- Arshdeep Singh: టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా భారత యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కల నెరవేరింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో తొలి మ్యాచ్‌తో అతడు అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేతుల మీదుగా క్యాప్‌ అందుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఇక మొదటి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు 23 ఏళ్ల అర్ష్‌దీప్‌ సింగ్‌. అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్‌ వేసి 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. భారత మహిళా జట్టు బౌలర్‌ ఝులన్‌ గోస్వామి, అజిత్‌ అగార్కర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. 2006లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఝులన్‌.. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అగార్కర్‌ టీ20 ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశారు.

రెండు వికెట్లు పడగొట్టి..
ఇంగ్లండ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రీస్‌ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్‌లను అవుట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ సింగ్‌పై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘టీమిండియాకు ఆడగల అన్ని అర్హతలు ఉన్న ఆటగాడివి. నీ ఎంట్రీ అదిరిపోయింది’’ అని సోషల్‌ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.

కాగా ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్‌దీప్‌ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత జట్టు సెలక్టర్ల దృష్టి ఆకర్షించి జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. భారత్‌ 50 పరుగుల తేడాతో బట్లర్‌ బృందాన్ని మట్టికరిపించింది.   

చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement